అందరిలోనూ ఉత్కంఠ

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో జెట్ స్పీడ్ తో పూర్తవుతోంది. అనీల్ సుంకర- దిల్ రాజు- మహేష్ బాబు ఈ చిత్రానికి నిర్మాతలు. మహేష్‌బాబు బర్త్‌డే సందర్భంగా స‌రిలేరు నీకెవ్వరు చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ రూపంలో పోస్టర్ తో సరిపెడతారు అనుకుంటే ఏకంగా ఇంట్రో పేరుతో వీడియోనే రిలీజ్ చేసి అభిమానులను ఆనందంలో ముంచెత్తారు.

సరిలేరు నీకెవ్వరు విడుదలకి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ అప్పుడే మహేష్ తరువాతి సినిమా మీద ఫిలిం సర్కిల్స్ లో అప్పుడే జోరుగా చర్చ నడుస్తుంది. ఈ సినిమా తర్వాత మహేష్ 27 ఛాన్స్ ఎవరికి అంటే ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇంతవరకూ మహేష్ నటించే 27వ సినిమా స్క్రిప్టు ఫైనల్ అయ్యిందో లేదో కుడా తెలియదు. ఫలానా దర్శకుడితో సినిమా చేస్తాను అని మహేష్ ప్రకటించలేదు.

అయితే ఫలానా దర్శకుడితో కన్ఫామ్ అయినట్టే అని సామాజిక మాధ్యమాల్లో విస్త్రతంగా ప్రచారం సాగుతోంది. కానీ ఏదీ అధికారికంగా ఫైనల్ కాలేదని తెలుస్తోంది. మహేష్ తో సినిమా చేసేందుకు ముగ్గురు నలుగురు దర్శకులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా, పరశురామ్ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు మహేష్ తో తదుపరి సినిమా చేసే వీలుందని వైరల్ గా ప్రచారం అవుతోంది.

అయితే చివరి నిమిషం వరకూ ఏదీ కన్ఫామ్ గా చెప్పలేని పరిస్థితి. ఎవరికి వారు స్క్రిప్టులు తయారు చేసి సూపర్‌స్టార్ ని మెప్పించే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. మహేష్ వాటిని విని ఫైనల్ చేసి ఖాయంగా సెట్స్ కెళుతున్నాం అని చెప్పే వరకూ ఇది కన్ఫామ్ అని చెప్పలేని సన్నివేశం నెలకొంది.

మరో పక్క నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ మహేష్ తో సినిమా చేయాలని పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ మధ్యే మైత్రి మూవీ మేకర్స్ మీడియాతో మాట్లాడుతూ మహేష్ తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించేసారు. కానీ దర్శకుడి పేరు మాత్రం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఎవరికి ముందుగా మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారు అన్నది సస్పెన్స్ గా మారింది.

ప్రస్తుతానికి సూపర్ స్టార్ దృష్టి మొత్తం సెట్స్ పై ఉన్న సరిలేరు నీకెవ్వరుపైనే. ఈ సినిమా పూర్తయితే కానీ ఏదీ ఖాయంగా చెప్పలేని పరిస్థితి. విడుదల చేసిన సరిలేరు నీకెవ్వరు ఇంట్రోలో సూపర్ స్టార్ ఆర్మీ లుక్‌లో అద‌ర‌గొట్టేస్తున్నారు. మేజ‌ర్ అజ‌య్ కృష్ణ పాత్రలో మహేష్‌ లుక్ సూపర్. మహేష్ కి ఈ బ్యాక్ డ్రాప్ సినిమా ఎంచుకోవడం ఇదే మొదటి సారి.

ఆగస్టు 15 కి సోల్జర్స్ మీద డిజైన్ చేసిన స్పెషల్ సాంగ్ ని రిలీజ్ చేసారు. సరిలేరు నీకెవ్వరు అని టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుండి అనిల్ రావిపూడి ఇది కేవలం మహేష్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని పెట్టిన టైటిల్ అని అందరూ భావించారు. అయితే ఒకే ఒక్క పాటతో అందరికీ క్లారిటీ ఇచ్చారు మేకర్స్. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అతని క్యారెక్టర్ ను ఎలివేట్ చేస్తూ ఓ సాంగ్ తో ఇండియన్ ఆర్మీ కి ఓ ట్రిబ్యూట్ ఇచ్చారు.

అదే సరిలేరు నీకెవ్వరు టైటిల్ సాంగ్. లిరిక్స్ ఆకట్టుకున్నాయి. సాంగ్ చివరిలో సరిలేరు నీకెవ్వరు అంటూ అజయ్ కృష్ణ ని ఉద్దేశించి లిరిక్స్ పడ్డాయి. ఈ పాటతో టైటిల్ పెట్టడానికి గల కారణం అందరికీ తెలిసింది. ఒక ఆర్మీ మేజర్ గా సరిలేరు నీకెవ్వరు అని అందరిచేత అనిపించుకుంటాడని అందరికీ క్లారిటీ వచ్చేసింది. భగ భగ భగ మండే నిప్పుల వర్షం వచ్చినా జనగణమంటూ దూకేవాడు సైనికుడు అంటూ మొదలైన ఈ పాట ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటోంది.

ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్ ని ప్లాన్ చేసుకుంది యూనిట్. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో యాక్షన్ సీన్ ను తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇక్కడ పని ముగించాక రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్ లో కొన్ని కీలక సన్నివేశాలు తీస్తారు. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా రష్మిక నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్స్ లోకి రానుంది సరిలేరు నీకెవ్వరు.

Share

Leave a Comment