చిన్నప్పటి మహేష్‌ గుర్తొచ్చాడు…

మహేష్‌బాబు మేనకోడలు జాన్వి వెండితెరకు పరిచయమవుతోంది. తాను దర్శకత్వం వహిస్తున్న చిత్రంతోనే తన కూతురు జాన్విని పరిచయం చేస్తున్నారు మంజుల.

నటిగా పలు చిత్రాల్లో మెరిసిన మంజుల, ఇటీవల దర్శకురాలిగా మారిన విషయం తెలిసిందే. సందీప్‌కిషన్‌ కథానాయకుడిగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఆ చిత్రంలోని ఓ కీలక పాత్రలో జాన్విని పరిచయం చేస్తున్నారు. సినిమా సెట్‌లో తీసిన ఒక ఫొటోను మంజుల శుక్రవారం ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

నా కుమార్తె జాన్వి- ఆమెను షూట్స్‌కు దూరంగా ఉంచాను. ఆమె షూటింగ్‌ తొలిరోజున నేను చాలా భయపడ్డా.

కానీ ఆమె మాత్రం చాలా సులభంగా, ఆత్మవిశ్వాసంతో నటించింది. పూర్తి సహజంగా చేసింది, అందగత్తె.

జాన్వి బాలనటుడు మహేశ్‌బాబును నాకు గుర్తు చేసింది. అతడిలాగే అనిపించింది’ అని మంజుల పోస్ట్‌లో పేర్కొన్నారు.

చిత్రీకరణల్ని జాన్వికి ఎప్పుడూ చూపించింది లేదు. దాంతో తొలిరోజు ఎలా నటిస్తుందో అనుకొన్నా. బాలనటుడిగా మహేష్‌ నటించినప్పటి రోజులు గుర్తుకొచ్చాయి అని మంజుల ఏమోషనల్ అయ్యారు.

నిర్మాత, నటిగా గుర్తింపు పొందిన మహేశ్‌బాబు సోదరి మంజుల తెరకెక్కిస్తున్న చిత్రంలో సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు.

ఇంకా టైటిల్‌ ఖరారు చేయని ఈ సినిమాలో అమైరా దస్తూర్‌ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. ఆనంది ఇందిరా ప్రొడక్షన్స్‌ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మార్చికి ‘భరత్‌ అనే నేను’ చిత్రీకరణ అంతా పూర్తవుతుందట!

దీని తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సి. అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు నిర్మించనున్న సినిమా ప్రీ–ప్రొడక్షన్‌ పనులు, కథపై కాన్సంట్రేట్‌ చేస్తున్నారు. వంశీ పైడిపల్లి సినిమా తర్వాత చేయబోయే సినిమా కోసం కథలు కూడా వింటున్నారు.

చుట్టూ ఎంత మంది దర్శకులున్నా… ఎన్ని పనులున్నా… నో కన్‌ఫ్యూజన్‌! ఫుల్‌ క్లారిటీతో ఓ పని పూరై్తన తర్వాత మరో పని మీద దృష్టి పెడుతున్నారు మహేష్ .

Share

Leave a Comment