అవార్డు రావడం ఖాయం

సహజ నటిగా పేరు దక్కించుకున్న సీనియర్ హీరోయిన్ జయసుధ గారు ప్రస్తుతం టాలీవుడ్ లో అమ్మ పాత్రలకు పెట్టింది పేరు అయ్యారనడంలో అతిసయోక్తి లేదు. స్టార్స్ కు అమ్మ పాత్రలో జయసుధ గారిని ఎక్కువగా ఎంపిక చేస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబుకు పలు సినిమాల్లో అమ్మగా నటించారు ఈవిడ.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మరియు ‘బ్రహ్మోత్సవం’ చిత్రాల్లో అమ్మ పాత్రను చేసిన జయసుధ గారు తాజాగా ‘మహర్షి’ చిత్రంలో కూడా అమ్మగా నటించారు. మహర్షి సినిమా మే 9 న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ బరిలో దూసుకెళుతోంది. మహర్షి సినిమా విడుదలై ఆరో వారంలోకి అడుగుపెట్టేసింది అనమాట. అయినా కూడా మహర్షి తన జోరును ఏమాత్రం తగ్గించడం లేదు.

ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన జయసుధ గారు ఒక ఇంటర్వ్యూలో మహర్షి చిత్ర షూటింగ్ అనుభవాలను, మహేష్ పెర్ఫార్మన్స్ గురించి చెప్పుకొచ్చారు. ఆవిడ మాట్లాడుతూ ‘నేను హీరోయిన్ గా నటించిన సినిమాలో బాల నటుడిగా చేశాడు మహేష్. అందుకే అప్పటి నుండే నాకు మహేష్ తెలుసు. చాలా మంచి వ్యక్తి. ఎంత పెద్ద స్టార్ అయినా ఏమాత్రం గర్వం ఉండదు.

పెద్దలను గౌరవించడంతో పాటు చాలా నిజాయితీగా మాట్లాడతాడు. అతడితో నటిస్తున్న సమయంలో చాలా కంఫర్ట్ గా ఉంటుంది. విజయ నిర్మల గారు నాకు బందువు అవ్వడం వల్ల కృష్ణ గారి ఫ్యామిలీతో చాలా ఏళ్లుగా సన్నిహిత్యం నాకు ఉంది. ఆ అనుబంధం వల్ల మహేష్ ను చిన్నప్పటి నుండి ఎక్కువగా కలవడం జరిగింది. మహేష్ ఏ సినిమా చేసినా దాన్ని తన మొదటి సినిమా గానే పరిగణించి చేస్తూ ఉంటాడు.

దర్శకుడు ఏది చెప్తే అది ఇచ్చేందుకు చాలా కష్టపడుతూ ఉంటాడు. దర్శకుడు ఎలా మల్చుకోవాలనుకుంటే మహేష్ అలా మారిపోతాడు. డైరెక్టర్స్ యాక్టర్ మహేష్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మహర్షి చిత్రంలో మహేష్ బాబు నటన తారా స్థాయికి వెళ్లింది. రెండు మూడు సీన్స్ లో మహేష్ బాబుతో యాక్టింగ్ చేసే సమయంలో అతడి యాక్టింగ్ చూసి నేను ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం మర్చి పోయాను.

నాతో కంట తడి పెట్టించాడు. మహేష్ యాక్టింగ్ కు సెట్స్ లోనే కన్నీరు పెట్టుకున్నాను. అంతగా పాత్రలో ఒదిగి పోయి నటించాడు. మహర్షి చిత్రంలోని నటనకు గాను మహేష్ బాబుకు అవార్డు రావడం ఖాయం. ఎవర్ గ్రీన్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. మహర్షి సినిమా కోసం మహేష్ ప్రాణం పెట్టాడు. ఇంత గొప్ప యాక్టర్, సౌమ్యుడు, పెద్దవాళ్లంటే గౌరవమున్న నటుడిని తాను ఇంతవరకూ చూడలేదు’ అని జయసుధ చెప్పుకొచ్చారు.

ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుండి బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది. మహర్షి తో సూపర్‌స్టార్ కెరీర్ లో రెండో 100 కోట్ల షేర్ సినిమా ఖాతాలో యాడ్ అయ్యింది. ఇంతకు ముందు భరత్ అనే నేను ఈ ఘనతను సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో రికార్డులను బద్దలుకొటిన మహర్షి ఆరో వారం లో కూడా సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది.

ఏదైనా సినిమా కి రోజులు పెరిగే కొద్దీ థియేటర్లు తగ్గుతూ వస్తూ ఉంటాయి. కానీ మహర్షి కి ధియేటర్లు తగ్గకపోగా కొన్ని చోట్ల ధియేటర్లను ఆరోవారంలో పెంచారు. దీని బట్టే మహర్షి సినిమాకి ప్రేక్షకులు ఏ రేంజ్ లో బహ్మరథం పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. మహేష్ స్టార్ పవర్ కి మంచి కథ కూడా తోడవడంతో మహర్షి జనాల్లోకి అంతలా చొచ్చుకుపోయింది.

మహర్షి సినిమాలో రైతు సమస్యలను అద్భుతంగా ఆవిష్కరించారు. రైతులకు సరైన గౌరవాన్ని ఇవ్వాలని, వారిని దోచుకుంటున్న దళారీలను తరిమి కొట్టేది సామాన్య ప్రజలే అని ఎన్నో మంచి విషయాలు ఈ చిత్రంలో చూపించారు. వారాంతపు వ్యవసాయం, సామాజిక సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన మహర్షి అందరి ప్రశంసలు అందుకుంటుంది.

మొత్తం మీద తన 25వ సినిమాతో సూపర్ స్టార్ ఇంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. మహర్షి మూవీ ప్రమోషన్స్ లో బిజీ గా గడిపిన మహేష్ ఆ మూవీ సక్సెస్ ని ఫ్యామిలీతో కలిసి వరల్డ్ టూర్ లో సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. జర్మనీ, ఇటలీ లో విహారం ముగించుకున్న మహేష్ అక్కడ నుండి నేరుగా ఇంగ్లాండ్ వెళ్లారు.

ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఇండియా క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచులు ఎంజాయ్ చేస్తున్న ప్రిన్స్ త్వరలోనే తిరిగి రానున్నట్టు తెలిసింది. తిరిగొచ్చాక అనీల్ రావిపూడితో క‌లిసి మ‌హేష్ త‌న 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు షూటింగ్ లో పాల్గొననున్నారు. ఇందులో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తారు. దిల్‌ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేష్ బాబు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో మహేష్ బాబు ఆర్మీ మేజర్‌గా నటించనున్నారు.విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, జగపతిబాబు కీలక పాత్రలు చేయనున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిచనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు.

Share

Leave a Comment