మహేష్ అన్నే మాకు రోల్ మోడల్

సూపర్‌ స్టార్ మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం భరత్‌ అనే నేను. కొరటాల శివ దర్శకత్వంలో రాజకీయ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రొమోషన్స్‌లో భాగంగా ‘బహిరంగ సభ’ పేరుతో ఎల్‌బీ స్టేడియంలో ఆడియో రిలీజ్‌ వేడుక అట్టహాసంగా జరిగింది.

కాగా ఈ వేడుకలో హీరో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ… ‘నందమూరి తారకరామారావుగారి మనవడిని అయిన నేను, అభిమాన సోదరులందరికీ నమస్కారాలు’ అని మట్లాడటం మొదలు పెట్టారు.

ఇంకా ఈ ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘మహేష్ బాబును మమీరందరూ ప్రిన్స్, సూపర్ స్టార్’ అంటారు. కానీ, నేను మాత్రం ‘మహేష్ అన్న’ అంటాను అని రహస్యాన్ని బయట పెట్టారు.

ఓ కమర్షియల్ హీరోగా మహేష్ బాబు అన్న చేసినటువంటి ప్రయోగాత్మక చిత్రాలను మేమెవరమూ చేయలేదు. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పడిప్పుడే మేము కూడా మొదలు పెడుతున్నాం.

ఇప్పుడు మేము చేసే ప్రయోగాలకి ఇన్స్పిరేషన్ ఒక రకంగా మహేష్ అన్నే. ఆయన ఎప్పుడో మొదలుపెట్టిన దానిని మేము ఇప్పుడు అనుకరిస్తున్నాము. ఆయన చాలా అరుదైన రకం, ఆయన్ని అలాగే ఉండనిద్దాం..

ఈ వేడుకకు నేను ముఖ్య అతిథిగా రాలేదని.. ఓ కుటుంబసభ్యుడిగా వచ్చానని వివరించారు. అలాగే… ‘ఈ చిత్రం గత రికార్డులు అన్నింటినీ తిరగ రాయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.

‘భరత్ అనే నేను’ మహేష్ అన్న కెరీర్ లో ఓ మైలురాలిగా నిలవాలని కోరుకుంటున్నాను అంటూ మహేష్ ను అభినందించారు. సమాజం పట్ల ఎంతో బాధ్యత కలిగిన వ్యక్తి, దర్శకుడు కొరటాల శివ.

అభిమానులకు కావాల్సిన మసాలాను గట్టిగా దట్టించి, శివ చెప్పదలచుకున్న సందేశాన్ని చిత్రాల ద్వారా అందిస్తారు. ఆయనకి అభిమానుల పల్స్ బాగా తెలుసు. అందరికి నచ్చే విధంగా సినిమా తీయడం లో శివ మేటి అని’ అని అన్నారు.

డైరెక్టర్ కొరటాల శివ మాట్లాడుతూ… తనకు ఎంతో సంతోషంగా ఉందని, తాను ఆ ఇద్దరు హీరోలకు మీకంటే ఎక్కువ అభిమానిని అని.. తాను ఎవరితో సినిమా చేసినా ఆ హీరోతో ప్రాణం పెడతానని వెల్లడించారు.

Share

Leave a Comment