అప్పటికి..ఇప్పటికి..

దశాబ్దకాలంగా అందాల తార కాజల్ అగర్వాల్ కెరీర్ స్టడీగా దూసుకుపోతున్నది. పదేళ్లలో అటు గ్లామర్ పాత్రలతోనూ ఇటు ఫెర్ఫార్మెన్స్ పాత్రలతోనూ ఆకట్టుకొంటున్నది. 2007లో లక్ష్మీ కల్యాణంతో కెరీర్ ఆరంభించిన కాజల్ అర్ధ శతకాన్ని అందుకొన్నది.

ఆ మధ్య ఒక సందర్భంలో ఇచ్చిన ఇంటర్వ్యూ లో తను పని చేసిన హీరోల గురించి తెలుగు సినిమాల గురించి ముచ్చటించారు కాజల్. సూపర్‌స్టార్ మహేష్ బాబు తో రెండు సినిమాలు కలిసి చేసిన కాజల్ తన గురించి ఆశక్తికర కామెంట్స్ చేసారు.

నేను పని చేసిన హీరోల్లో మహేష్ బాబు పర్ఫెక్షనిష్ట్. వంద శాతం డెడికేషన్ ఉన్న యాక్టర్. ఇంక చాలా చార్మింగ్. ఒక సీన్ కోసం ఎంతైనా కష్టపడతారు. తనకు నచ్చే వరకు టేక్స్ ఇస్తూనే ఉంటారు. టూ మచ్ డెడికేషన్. ఆయన కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్.

ఇంక వర్క్ పట్ల ఎంతో నిబద్ధత కలిగిన మనిషి. కొంచెం కూడా గర్వం ఉండదు. ఇంకో విషయం ఏంటంటే మహేష్ ఒక ఫిట్‌నెస్ ఫ్రీక్. చాలా డెడికేటెడ్ గా వర్క్ అవుట్స్ చేస్తారు. చాలా సార్లు డైట్, వర్క్ అవుట్స్ గురించి మాట్లాడుకున్నాం.

బిజినెస్‌మాన్ కి ఇప్పటికీ మహేష్ ఇంకా యంగ్‌గా కనిపిస్తున్నారు. చెప్పాలంటే మాకంటే ఆయనే ఇంక ఎక్కువ చార్మింగ్ గా ఉంటారు. నాకు తెలిసి ఆయన దగ్గర ఒక టైం మెషీన్ ఉన్నట్లు ఉంది 24 సినిమాలో లాగా అని నవ్వుతూ చెప్పారు కాజల్ అగర్వాల్.

మహేష్‌ కి మాస్‌ నుంచి క్లాస్‌ వరకు, అమ్మాయిలు, ముసలివారు, చిన్నారులు ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులలోనూ అభిమానులు ఉన్నారు. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా, సింపుల్‌గా ఉండే మహేష్‌ కు కేవలం మాములు ప్రేక్షకులే కాకుండా సెలబ్రిటీస్ లో కూడా మంచి ఫాలోయింగి ఉంది.

అందరూ మహేష్ వ్యక్తిత్వాన్ని చాలా ఇష్టపడతారు. మహేష్ కి నేషనల్ లెవెల్ లొ ఉన్న క్రేజ్ అలాంటిది. ఇప్పుడు వచ్చే నూతన నటీమనుల నుంచి వేరే భాష లో నటిస్తున్న అగ్ర హీరోయిన్స్ వరకు అందరికి మన టాలివూడ్ లో సుపరిచితమైన పేరు మహేష్ బాబు.

ఇక కెరీర్ పరంగాను కూడా మహేష్ బాబు దూకుడుగా వెళ్తున్నారు. భరత్ అనే నేను మహర్షి సరిలేరు నీకెవ్వరు సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మహేష్ ప్రస్తుతం పరశురామ్ పెట్లా దర్శకత్వంలో సర్కారు వారి పాట మూవీ చేయనున్నారు.

ఈ చిత్రంలో విభిన్నమైన లుక్స్ లో మహేష్ కనిపిస్తాడట. అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా అందరికీ నచ్చేలా సినిమా ఉండబోతుంది అని టీం కాంఫిడెంట్ గా ఉన్నారు. ఇప్పటి వరకు తన కెరీర్లో చేసిన పాత్రలన్నింటికంటే ది బెస్ట్‌గా మహేష్ బాబు పాత్ర ఉంటుందట.

Share

Leave a Comment