మహేష్ గురించి ఫేస్‌బుక్ లైవ్‌లో కౌశల్

తెలుగు బిగ్ బాస్ రెండో సీజన్ విన్నర్ గా కౌశల్ నిలిచిన తర్వాత ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. అనేక ఈవెంట్స్ కి గెస్ట్ గా ఆహ్వానిస్తున్నారు. కౌశల్ విజయాన్ని అభినందిస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక ట్వీట్ పోస్ట్ చేసిన సంగతి మనకి తెలిసిందే. ఆ ట్వీట్ కు అరవై ఆరు వేల లైకులు, పదమూడు వేల కు పైగా రి ట్వీట్లు, రెండున్నర వేల కామెంట్లు వచ్చాయి.

సూపర్‌స్టార్ వంటి వారే కౌశల్ కి స్పెషల్ గా శుభాకాంక్షలు తెలియజేసారంటే ఇంక ఇదే తనకి పెద్ద విజయం అని అంటున్నారు అభిమానులు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి, ఈ రోజు ఈ స్థాయి లో ఉండటానికి మహేష్ బాబు కారణం అని చెప్పిన కౌశల్, సూపర్ స్టార్ స్వయంగా తాను సాధించిన విజయాన్ని అభినందించడంతో ఆనందపడిపోయాడు.

ఫేస్ బుక్ లైవ్ లో మహేష్ బాబు కు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాడు కౌశల్. “మహేష్ గారు నా ఫ్రిన్స్. నా ఫస్ట్ ఫిల్మ్ హీరో. ఆయన నా గురించి ట్వీట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. రాజకుమారుడు సినిమా చేసిన సమయంలో ఆయనతో ఎక్కువ సమయం గడిపాను. మహాభలేశ్వరం షూటింగులో ఆయనతో స్పెండ్ చేసిన టైమ్ ఎప్పుడూ మరిచిపోలేను.

ఆయన నన్ను విష్ చేసిన విషయం నా జీవితాంతం గుర్తుంచుకుంటాను, మిమ్మల్ని మీరు నకు అందించిన సహకారాన్ని ఎప్పటికీ మరిచిపోను” అని కౌశల్ తెలిపారు. ట్విట్టర్ పెద్దగా వాడకపోయినా అదే పనిగా నిన్న అర్థరాత్రి మహేష్ బాబు కు కృతజ్ఞతలు తెలుపుతూ మరో ట్వీట్ పెట్టాడు కౌశల్.

“నా ప్రిన్స్ మహేష్ బాబు పెట్టిన ట్వీట్ కు కృతఙ్ఞతలు తెలుపుతున్నాను. మీ అభినందనలు నాకు చాలా విలునైనవి. మీతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. చాలా కాలం అవుతోంది” అని రాసుకొచ్చాడు కౌశల్. సూపర్ స్టార్ మహేష్ బాబు కు సమాధానమిస్తూ కౌశల్ పెట్టిన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తన తాజా చిత్రం ‘మహర్షి’. ఈ చిత్రం షూటింగ్‌ త్వరలో న్యూయార్క్‌లో జరగనుంది. డబ్బుని మనసుతో ముడిపెట్టిన వాడు మనిషి. మనసుని తపస్సుతో జయించేవాడు మహర్షి. అలాంటి ఓ యువకుడి కథే ‘మహర్షి’. ‘మహర్షి’ సినిమాలో అల్లరి నరేష్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.

Share

Leave a Comment