ఇంప్రెస్ అయిన కీరవాణి గారు

టాలీవుడ్ అగ్ర సంగీత దర్శకుల్లో ఎమ్ఎమ్ కీరవాణి ఒకరు. సంగీత దర్శకుడిగా ఆయనికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు ఉన్న విషయం తెలిసిందే. కీరవాణి పేరు చెపితే ఎన్నో మెలోడీ పాటలు, భక్తి పాటలు, మాస్ పాటలు గుర్తుకొస్తాయి..ఏ టైపు పాటలకైనా సంగీతం అందించడంలో ఈయన తర్వాతే ఎవరైనా.

ఇక బాహుబలి సిరీస్ తో ఆయన రేంజ్ ఆల్ ఇండియా వైడ్ కూడా అనూహ్యంగా పెరిగింది. ఈ మధ్య కాలంలో మాత్రం బయటి సినిమాలకు పెద్దగా సంగీతం అందించడం లేదు, కొన్ని ప్రత్యేకమైన సినిమాలకు తప్ప. తాజాగా కీరవాణి గారు సంగీతం అందించిన చిత్రం నందమూరి తారక రామారావు గారి “ఎన్టీఆర్ బయోపిక్”.

యన్.టి.ఆర్ తొలి భాగం ‘కథానాయకుడు’ని హైదరాబాద్ లోని సూపర్ స్టార్ మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ లో బాలకృష్ణ, ఆయన కుటుంబసభ్యులు, సంగీత దర్శకుడు కీరవాణి, దర్శకుడు క్రిష్ చూశారు. అనంతరం తనని పలకరించిన మీడియాతో కీరవాణి మాట్లాడుతూ ‘ ఏఎంబీ స్క్రీన్-1లో ఈ సినిమా నేను చూశాను. నేను దుబాయి లో ఉన్నానా లేక ఇండియాలోనే ఉన్నానా అనే సందేహం కలిగింది.

మహేష్ కి సంబంధించిన ఈ మల్టీప్లెక్స్ లోకి అడుగుపెట్టిన ప్రతీసారి అద్భుతంగా అనిపిస్తుంది. అంతే కాకుండా ఆశ్చర్యకరంగాను ఉంటుంది. ఈ మల్టీప్లెక్స్ కేవలం రిచ్‌నెస్ తో పాటు హాస్పిటాలిటీలోను తనకు తానే సాటి అనిపిస్తుంది. ఈ ఎక్స్ప్రీరియన్స్ చాలా అరుదుగుగా దొరుకుతుంది. ఇంకోసారి ఇక్కడే సినిమా చూడాలి’ అన్నారు.

ఈ వండర్ఫుల్ మల్టీప్లెక్స్ సినిమాస్ ను నిర్మించిన మహేష్ బాబు గారికి ధన్యవాదాలు. మా పని ఇంకా కొనసాగుతోంది. యన్.టి.ఆర్ పార్ట్ 2 అయిన తర్వాత మళ్లీ మాట్లాడతానని తెలిపారు. ఆయన ఏ.ఎమ్.బీ సినిమాస్ ని పొగుడుతూ ఒక కాగితం మీద పైన చెప్పినవన్ని తనదైన శైలి లో రాసి ఇచ్చారు. దీని ఫోటోని తీసి ఏ.ఎమ్.బీ సినిమాస్ వారు తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసారు.

రెండేళ్ల క్రితం తను రిటైర్మెంట్ తీసుకుంటానంటూ ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు. గొప్ప సంగీత దర్శకుడు రిటైర్మెంట్ ప్రకటించడం ఏంటి అని అంత ఆశ్చర్య పోయారు. కానీ కీరవాణి మాత్రం వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నారు. పూర్తిగా సినిమాల నుంచి రిటైర్ అవుదామని అనుకోలేదని, తనను ఇబ్బంది పెట్టిన పరిస్థితుల నుంచి రిటైర్ అయ్యానని చెప్పుకొచ్చాడు.

మీడియాతో క్రిష్ మాట్లాడుతూ ‘ఏఎంబీ స్క్రీన్-1లో ఈ సినిమా నేను చూశాను. కొన్ని స్క్రీన్స్ లో ఎఫెక్ట్స్ బాగా ఉండవు. కానీ, మేము ఏదైతే ఎంత గొప్పగా తీశామో అంతే గొప్పగా ఈ స్క్రీన్ లో ఉంది. ఇండస్ట్రీ హాట్ ఫేవరెట్ గా మారిపోయింది ఏఎంబీ సినిమాస్. మహేష్ బాబు గారికి ధన్యవాదాలు’ అన్నారు.

కథానాయకుడు సినిమాను నందమూరి బాలకృష్ణ గారు కూడా ఏఎంబీ సినిమాస్ లో వీక్షించారు. సినిమా చుసి వస్తున్న బాలయ్య గారిని ఏఎంబీ సినిమాస్ గురించి ఫీడ్ బ్యాక్ రాయమని కోరారు. దీనికి ఆయన ‘ఎక్సెలెంట్’ అని రాసి తన సంతకాన్ని జత చేసారు.

మహేష్ కూడా సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా చూసిన వెంటనే మహేష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందనను తెలిపారు. సినిమా అద్భుతమని డైరెక్టర్ క్రిష్ ప్రేక్షకులకు మధురానుభూతి కలిగించేలా క్యాన్వాస్ పై పెయింటింగ్ లా వేశాడని అన్నారు. బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారి పాత్రలో జీవించారని ప్రతి ఫ్రేమ్ లో ఆ విషయం తెలుస్తుందని అన్నారు. అన్ని పాత్రలు చక్కగా డిజైన్ చేశారని 100 % న్యాయం చేసేలా ఆయా నటులు పోషించారని అందరినీ బ్రిలియంట్ అంటూ మెచ్చుకున్నారు.

ప్రస్తుతం వంశీ పైడిపల్లి మహేష్ బాబుతో మహర్షి సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ మహేష్ కెరీర్ లో కీలకమైంది. హీరోగా 25 వ చిత్రం కావడంతో కొత్త లుక్ తో మహేష్ అదరగొడుతున్నారు. ఈ సినిమా తరువాత మహేష్ సుకుమార్ తో సినిమా చేసేందుకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. భారీ హిట్ తర్వాత భారీగానే అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు మించి ఉంటుందని అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.

Share

Leave a Comment