నా మోస్ట్ ఫ్యావరెట్

సరిగ్గా పద్దెనిమిది ఏళ్ళ క్రితం 2000వ సంవత్సరంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం అయిన కీర్తి సురేష్ ప్రస్తుతం టాప్ హీరోయిన్ లలో ఒకరిగా మారారు. అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ భామ మహానటి సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు క్రేజీ ఆఫర్స్ తో అటు టాలివుడ్ లో ఇటు కోలివుడ్ లో దూసుకెళ్తున్నారు.

ఇప్పటికే పలు సందర్భాల్లో తన అభిమాన హీరో మహేష్ బాబు అని కీర్తి సురేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి తెలియజేస్తూ మాటల మధ్యలో తెలుగు హీరోలలో మహేష్ బాబు అంటే తనకి అత్యంత ఇష్టం అని మరోసారి వెల్లడించారు.

మీ సెలెబ్రిటీ క్రష్ ఎవరు అని అడిగిన ప్రశ్నకు మరో మాట లేకుండా మహేష్ బాబు అని సమాధానం ఇచ్చారు కీర్తి. చిన్నప్పటి నుండి మహేష్ అంటే తనకి ఇష్టం అని, ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ వస్తే ఎందుకు వదులుకుంటా అని నవ్వేసారు కీర్తి సురేష్. ఆయనతో నటించే అవకాసం కోసం ఎదురుచూస్తున్నాను.

ఆయన నటన ఎంతో నాచురల్ గా ఉంటుందని, అదే మహేష్ ని అందరిలో స్పెషల్ గా నిలబెడుతుంది అని మహేష్ మీద తనకున్న అభిమానాన్ని వెల్లడించారు కీర్తి సురేష్. అంతకు ముందు తెలుగు బుల్లి తెరపై రానా హోస్ట్ గా ప్రసారం అయిన టాక్ షో యారి లో నాని మరియు కీర్తి సురేష్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూడా కీర్తి కి మహేష్ అంటే ఎంత ఇష్టమో తెలిసింది.

నాని కి మహేష్ బాబు అండ్ వెంకటేష్ కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా టైటిల్ చెప్పి తన హావ భావాలతో కీర్తి సురేష్ కి అర్ధం అయ్యేలా తెలపమన్నాడు రానా. దీనితో నాని మహేష్ ని అనుకరిస్తూ కీర్తి కి క్లూస్ ఇచ్చాడు. ఈ ఆట చాలా సరదాగా సాగింది. నాని మొదటగా ఇద్దరు హీరోస్ అనే సైగలు చేయగా కీర్తి కరెక్టుగా చెప్పారు.

అందులో మొదటి హీరో పేరు అని కీర్తి దెగ్గరికి వెళ్ళి నాని సైగలతో చెప్పాడు. వెంటనే కీర్తి మహేష్ బాబు అని చెప్పేసారు. ఈ పేరు మాత్రం చెప్తావు నీ ఫేవరెట్ హీరో కదా అని నాని అన్నారు. మహేష్‌ ఫాలోయింగ్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా, సింపుల్‌గా ఉండే మహేష్‌ కు కేవలం మాములు ప్రేక్షకులే కాకుండా సెలబ్రిటీస్ లో కూడా చాలా మంచి ఫాలోయింగి ఉంది.

అందరూ మహేష్ వ్యక్తిత్వాన్ని చాలా ఇష్టపడతారు. మహేష్ కి నేషనల్ లెవెల్ లొ ఉన్న క్రేజ్ అలాంటిది. ఇప్పుడు వచ్చే నూతన నటీమనుల నుంచి వేరే భాష లో నటిస్తున్న అగ్ర హీరోయిన్స్ వరకు అందరికి మన టాలివూడ్ లో సుపరిచితమైన పేరు మహేష్ బాబు. ప్రస్తుతం మహేష్ తన 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు తో బిజీగా ఉన్నారు.

సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ మహర్షి తరువాత మహేష్ చేస్తున్న సినిమా కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అంచనాలకి తగ్గకుండా గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. మేజర్ అజయ్ కృష్ణ గా మహేష్ ఈ సినిమాలో కనిపించనుండడంతో అప్పుడే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరిలేరు నీకెవ్వరు చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

13 ఏళ్ళ తరువాత విజయశాంతి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఎ.కె ఎంటర్ టైన్ మెంట్స్, జి.ఎం.బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు ఎలాంటి బ్లాక్‌బస్టర్ గా నిలవనుందో తెలియాలంటే 2020 సంక్రాంతి వరకు ఆగాల్సిందే.

Share

Leave a Comment