అందుకే మహేష్‌ సూపర్‌స్టార్‌

‘భరత్‌ అనే నేను’ సినిమాకు ముందు కైరా అద్వాణీ కానీ, ఆమె పేరు కానీ తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియదు. ఈ సినిమా తరువాత ఆమె పేరు టాలీవుడ్‌లో మారు మోగిపోతోంది. కేవలం ఒకే ఒక్క సినిమా ఆమెను తెలుగులో స్టార్‌ హీరోయిన్‌ని చేసేసింది.

ఈ సినిమా తనకు మంచి పేరుతో పాటు మరిచిపోలేని అనుభూతిని ఇచ్చిందందంటూ వివరించింది కైరా. మహేష్ గురించి, భరత్ అనే నేను లో మహేష్ తో తన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ని ఇలా షేర్ చేసుకుంది.

మహేష్‌ గారి ని సూపర్‌స్టార్‌ అని ఎందుకంటారో, ఆయనతో చేసిన తరువాతే నాకు అర్థమయింది. ఓ షాట్‌ చేసిన తరువాత దాన్ని సిస్టంలో చూస్తారు. బాగా రాలేదు అనుకుంటే మళ్ళీమళ్ళీ చేస్తూనే ఉంటారు. అలా ఎన్నిసార్లు చేసినా విసుగు అనేది ఆయన ముఖంలో చూడలేదు.

సినిమా బాగా రావాలన్న తపన ఆయనలో ఎక్కువగా ఉంటుంది. షూటింగ్‌ చేసేసాం. ఇంటికెళ్ళిపోదాం అనే తత్వం ఆయనది కాదు. అందుకే ఆయన నిజమైన సూపర్‌స్టార్‌. ఎక్కువగా మాట్లాడరు కానీ, కౌంటర్లు బాగా వేస్తుంటారు. ఆయన తో నటించడం వలన నేను చాలా నేర్చుకున్నాను. ఆయనతో మరో సినిమా చేయాలన్నది నా కోరిక.

నా మొదటి సినిమానే ఇంతటి ఘన విజయాన్ని సాధించడం నిజంగా నా అదృష్టం. ఒకప్పుడు బాలీవుడ్‌లో నటిస్తేనే గుర్తింపు వస్తుందన్న అభిప్రాయం చాలామందిలో ఉండేది. ఇప్పుడు అలా కాదు. భాష ఏదైనా సినిమా బాగుంటే అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దానికి నేనే పెద్ద ఉదాహరణ.

ఈ సినిమాకి ముందు నా గురించి తక్కువ మందికి తెలుసు. ఇప్పుడు నేను చాలా మందికి తెలుసు. నా సినిమా ‘ధోని’ చూసిన తరువాత కొరటాల శివ గారు నా దగ్గరకు వచ్చారు. మహేష్‌బాబు గారి పక్కన ఓ కొత్త అమ్మాయి కోసం చూస్తున్నారనీ, ఆ పాత్రకి నేనేయితే సరిపోతానని చెప్పారు.

శివ గారి గురించి ఒక్కమాటలో చెప్పాలంటే కష్టం. ఆయన వలనే ఈ సినిమాలో ఇంత బాగా చేయగలిగాను. ఈ సినిమా చూసినవారందరూ నన్ను మెచ్చుకుంటున్నారంటే దానికి కారణం ఆయనే! ఆయన గురించి ఒక్కమాటలో ఇంతకంటే చెప్పలేను.

‘భరత్‌ అనే నేను’ సినిమా షూటింగ్‌ సమయంలోనే నాకు రాంచరణ్‌ తో చేసే ఆఫర్‌ వచ్చింది. కథ నచ్చింది. దర్శకులు, హీరో అందరూ పెద్దవారే కావడంతో ఓకే చెప్పాను. ఇంత త్వరగా తెలుగు ప్రేక్షకులు నన్ను ఓన్‌ చేసుకుంటారని ఊహించలేదు. తెలుగువారి అభిమానానికి కృతజ్ఞతలు అని చెబితే చిన్నమాటే అవుతుంది.

Share

Leave a Comment