అతను ఒక్కడు ఉంటే చాలు

కోట శ్రీనివాసరావు గారు తెలుగు చలన చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ అద్భుతమైన నటుల్లో ఒకరు. ఆయన చేయలేని పాత్ర లేదు, పోషించలేని రసం లేదు. దాదాపు నవరసాల్ని తన కెరీర్లో వందశాతం పలికించిన నటుడు ఆయన. అద్భుతమైన నటనతోనే కాదు, మొహమాటం లేకుండా మాట్లాడుతూ అందరినీ ఆకర్షిస్తూ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు కోట గారు.

ఆయనిది తెలుగులో ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా నాలుగు ద‌శాబ్దాల న‌ట‌జీవితం ఆయ‌న సొంతం. కోట శ్రీనివాసరావు గారు ఒక ఇంటర్వ్యూ లో మహేష్ అంటే తనకి ఎంతో ఇష్టమని తెలిపారు. తనకి నచ్చిన ముగ్గురు నలుగురు నటులలో మహేష్ ప్రధమ స్థానం లో ఉన్నాడని కొనియాడారు. ఈ సందర్బంగా కోటా శ్రీనివాసరావు గారు మహేష్ గురించి తన అభిప్రాయాన్ని ఇలా వివరించారు.

“మహేష్ బాబు పేరు గుర్తుకురాగానే ప్లెజెంట్‌గా అనిపిస్తుంది. అతని మొహంలో కల ఉంటుంది. అందరూ మెచ్చుకునే లవబుల్‌ బాయ్ అతను. చూడ్డానికి చక్కగా, నీట్‌గా ఉంటాడు. కృష్ణగారి అబ్బాయిగా అతను నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. చిన్నప్పుడు మహేష్ చాలా ముద్దుగా ఉండేవాడు. తెరమీద ఫైట్లూ అవీ చేసినా మనిషి పొడుగ్గా ఉంటాడు కాబట్టి అదో స్పెషల్‌గా అనిపిస్తుంటుంది.

స్ర్కీన్‌మీద ఎంతమంది ఉన్నా అతనుంటే మిగిలిన వాళ్లు కనిపించడం కాస్త కష్టమే. అందగాడు కాబట్టి పిల్లలకి, ఆడవాళ్లకి, మగవారికి అనే తేడా లేకుండా అందరికీ నచ్చుతాడు. ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అతను నటించిన ‘పోకిరి’ సినిమాకి, ‘శ్రీమంతుడు’ సినిమాకి ఎక్కడైనా సంబంధం ఉంటుందా?

రెండు సినిమాల్లోనూ తనదైన మార్కు నటన చూపించాడు. ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ అయితే ఎన్నిసార్లు చూసినా తనివితీరదు. ఎంతో నాచురల్ గా అవలీలగా నటించాడు. అందుకే మహేష్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. మహేష్ తో పాటు జూనియర్ ఎన్.టీ.ఆర్ ను కూడా ఇష్టపడతాను. వీరు కాకుండా మిగిలిన వాళ్లలో అంత పొటన్షియాలిటీ ఉన్నట్టున్నా ఎక్కడా బయటికి వచ్చినట్టు నాకు అనిపించదు.

ఏదో వస్తున్నారు.. చేస్తున్నారు.. కాదనట్లేదు. ఇప్పటికిప్పుడు పరిశ్రమలో హీరోలను లెక్కబెడితే ఎంత లేదన్నా 20, 30 మంది ఉన్నారండీ. కానీ చటుక్కున ఎవరి పేరు కూడా మనకి గుర్తుండదు.అందులోనూ ఇప్పుడేమో కాస్త ఫ్యాషన్‌ గోల ముదిరింది కదా… మహేష్ బాబు ని చూస్తే మాత్రం పర్సనల్ గా నాకు చాలా స్పెషల్ గా కనిపిస్తాడు..అది యాక్టింగ్ లోనే కాని కారెక్టర్ అయిన కాని..

ప్రస్తుతం మహేష్ బాబు తన 25వ చిత్రం ‘మహర్షి’లో నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కీలక పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ తో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడంతా ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు.

Share

Leave a Comment