ఇంకోసారి ఇక్కడే

విశ్వ విఖ్యాత నట సార్వ భౌమ నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్రపై ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం యన్.టి.ఆర్ కథానాయకుడు. రామారావు గారి సినీ ప్రస్థానానికి సంబందించిన జీవితాన్ని ఒక భాగం గాను, రాజకీయ ప్రస్థానానికి సంబందించిన ఒక భాగం గాను తెరకెక్కించారు.

ఈ రోజు విడుదలైన యన్.టి.ఆర్ తొలి భాగం ‘కథానాయకుడు’ని హైదరాబాద్ లోని సూపర్ స్టార్ మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ లో బాలకృష్ణ, ఆయన కుటుంబసభ్యులు, దర్శకుడు క్రిష్ చూశారు. అనంతరం తనని పలకరించిన మీడియాతో క్రిష్ మాట్లాడుతూ ‘ఏఎంబీ స్క్రీన్-1లో ఈ సినిమా నేను చూశాను. కొన్ని స్క్రీన్స్ లో ఎఫెక్ట్స్ బాగా ఉండవు.

కానీ, మేము ఏదైతే ఎంత గొప్పగా తీశామో అంతే గొప్పగా ఈ స్క్రీన్ లో ఉంది. ఇంకోసారి ఆ స్క్రీన్ లోనే సినిమా చూడాలి. ఈ సినిమాస్ ను నిర్మించిన మహేష్ బాబు గారికి ధన్యవాదాలు. మా పని ఇంకా కొనసాగుతోంది. యన్.టి.ఆర్ పార్ట్ 2 అయిన తర్వాత మళ్లీ మాట్లాడతా’నని అన్నారు.

‘రామారావు గారి గురించి చాలా రీసెర్చ్ మెటీరియల్ ఉంది. రామారావు గారి గురించిన కథ ఒక గొప్ప కథ, అందమైన స్క్రీన్ ప్లే వచ్చింది. రెండు రాష్ట్రాల్లోని అనేక జిల్లాల నుంచి వస్తున్న కాల్స్ చూస్తుంటే రియల్లీ ఐ ఫీల్ ప్రౌడ్. ఆయన ప్రభ ఏమాత్రం తగ్గకుండా, ఆయన శోభను ప్రెజెంట్ చేసినందుకు కించిత్తు గర్వంగా, చాలా ఆనందంగా ఉంది’ అని క్రిష్ చెప్పుకొచ్చారు.

హైదరాబాద్ లోని మహేష్ బాబు మల్టీప్లెక్స్ ఏఎంబీ సినిమాస్ లో అయితే కథానాయకుడు బుకింగ్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. ఏ ధియేటర్లో కూడా ఈ రకమైన బుకింగ్స్ కథానాయకుడు సినిమాకు లేవు. కథానాయకుడు షోస్ ను కూడా అంతే భారీ స్థాయిలో ఈ రోజు ప్రదర్శించారు. సుమారు ముప్పై రెండు షోస్ ఈ రోజు వేయనున్నారు.

ఏషియన్ సినిమాస్‌తో కలిసి ఏఎంబీ సినిమాస్ ను గచ్చిబౌలి ప్రాంతంలో నిర్మించారు మహేష్ బాబు. సాధారణ మల్టిప్లెక్సుల కంటే ఒక మెట్టు ఎక్కువ గా రిచ్ ఇంటీరియర్స్ తో, లగ్జరీకి మారు పేరుగా ఈ మల్టి ప్లక్స్ పేరు తెచ్చుకుంది. సూపర్‌ స్టార్ రేంజ్‌కు తగ్గట్లే ఏఎంబీ సినిమాస్ ఉందని అందరి మాట.

ఇండస్ట్రీ హాట్ ఫేవరెట్ గా మారిపోయింది ఏఎంబీ సినిమాస్. గ‌చ్చిబౌలిలో అధునాత‌న సౌక‌ర్యాల‌తో ఈ మ‌ల్టీప్లెక్స్ నిర్మాణం జ‌రుపుకోగా, ఇందులో మొత్తం 1638 సీటింగ్ కెపాసిటీ తో 7 స్క్రీన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఏ సినిమా ఈవెంట్ కన్నా ఇప్పుడు కేరాఫ్ అడ్రస్ ఏఎంబీ సినిమాస్.

ఏఎంబీ సినిమాస్ లో ఫెసిలిటీస్, ఇంటీరియర్ డిజైన్ సహా రిచ్ లుక్ వెనక నమ్రత అభిరుచి ఉందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో జనాల చూపు అంతా ఏఎంబీ సినిమాస్ పైనే. అప్పుడే ఈ ఏరియాలో రద్దీ విపరీతంగా పెరిగింది. 5 స్టార్ వాతావరణంతో అంతర్జాతీయ స్థాయిలో ఈ మల్టీప్లెక్స్‌ను నిర్మించారు.

వి.ఐ.పి లాంజ్ కూడా ఏర్పాటు చేశారు. కళ్లు మిరిమిట్లు గొలిపే అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్, లగ్జరీ థియేటర్లు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. పార్టీ జోన్, వీవీఐపీ లాంజ్, స్పెషల్ కిడ్స్ జోన్, లగ్జరీ సీటింగ్ తదితర సదుపాయాలు ఏఎంబీ సినిమాస్‌లో ఉన్నాయి.

ప్రస్తుతం మహేష్ త‌న కెరీర్లోని ప్రతిష్ఠామకమైన 25వ సినిమా మహర్షిలో న‌టిస్తున్నారు. 25వ సినిమా కాబట్టి మహేష్, వంశీ పైడిప‌ల్లి కూడా ఈ సినిమా గురించి చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. ఈ సినిమాలో ఇప్పటిదాకా కనిపించని విధంగా కొత్త లుక్ లో కనబడబోతున్నారు మహేష్. అనేక ప్రత్యేకతలు ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ మహర్షి పై మహేష్ అభిమానుల్లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కాదు.

సినిమా సెట్స్ పై ఉండగానే పక్కా ప్లాన్డ్ గా, అంతే ఎఫెక్టివ్ గా సినిమా నుండి ఒక్కో అప్డేట్ రిలీజ్ చేస్తూ ఎట్రాక్ట్ చేస్తున్న తీరు, ‘మహర్షి’ టీమ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని ఎలివేట్ చేస్తుంది. మార్చి నాటికి చిత్రీకరణ పూర్తి చేసి, ఏప్రిల్‌ లో సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

Share

Leave a Comment