బెస్ట్ ఇవ్వగలడని..

క్రియేటివ్ డైరక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే ఒకప్పుడు అందరూ కృష్ణవంశీ గారి పేరే చెప్పేవారు. ఆయన తీసిన సినిమాల పవర్ అలాంటిది మరి. అప్పటి వరకు మిగితా సినిమాలలో ఒకరకంగా కనిపించిన హీరో కాస్త కృష్ణవంశీ సినిమాలో మరోరకంగా కనిపిస్తాడు. ఆర్టిస్టు నుండి ఎంత కావాలో అంతే నటనను రాబట్టగల సమర్ధుడు కృష్ణవంశీ.

కృష్ణవంశీ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెలుగు సినిమా ఎప్పటికీ మర్చిపోలేని ఒక సినిమా పుట్టుంది. అలా వచ్చిన సెన్సేషనల్ సినిమానే మురారి. మురారి మహేష్‌ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచి నటుడిగా ఒకమెట్టు పైకి ఎక్కించి ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత దగ్గరచేసింది. మహేష్ బాబు డైరెక్టర్ ఆర్టిస్ట్ అని చాలా మంది దర్శకులు చెబుతూనే ఉంటారు.

ఆయన ఎంత మంచి నటుడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శకుడు ఎలాంటి సీన్ చేయమని చెప్పిన చేస్తాడని దర్శకుడు తేజ చాలా సార్లు చెప్పారు. అయితే దర్శకుడు కృష్ణవంశీ నిన్న సోషల్ మీడియాలో ఒక నెటీజన్ అడిగిన ప్రశ్నకు మహేష్ గురించి మరో క్లారిటీ ఇచ్చారు. సాధారణంగా కృష్ణవంశీ గారు షూటింగ్ లో ఆర్టిస్ట్ లతో 70, 80 టెక్స్ తీసుకుంటారని విన్నాను.

మరి మురారి సినిమాలో మహేష్ బాబు ఎన్ని టేక్స్ తీసుకున్నారు సర్ అని కృష్ణవంశీ ని ఒక నెటిజన్ అడుగగా ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ముందుగా 70 – 80 టేక్స్ అనేది ఏ మాత్రం నిజం కాదు. అన్ని టేక్స్ నేను తీసుకోలేను. అవన్నీ రూమర్స్ అంటూ మహేష్ బాబు అయితే ఒకటి రెండు టేక్స్ లలోనే తన బేస్ట్ ఇవ్వగలడని అన్నారు.

గతంలో కూడా ట్విట్టర్ వేదికగా అభిమానులు మహేష్ గురించి మరియు మురారి సినిమా గురించి అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానమిచ్చారు కృష్ణవంశీ. మురారి సినిమాలో మహేష్ లక్ష్మి అమ్మ మాటలు విని ఏడుస్తే తన బుగ్గల మీద నుంచి కన్నీళ్ళు రాలతాయి కదా, గ్రేట్ లైటింద్ అండ్ గ్రేట్ షాట్. ఆ సీన్ ని ఎంతసేపు లో తీసారు అని అభిమాని కృష్ణవంశీ గారిని అడిగాడు.

కేవలం ఒక గంటలో ఆ సీన్ షూట్ చేసాం అని చెప్పారు. లక్ష్మి అమ్మ సీన్ ని విడిగా తీసాం. దానికి రెండు గంటల సమయం పట్టింది. సీన్ పేపర్ ఏం లేకుండా మొత్తం తీసిన సన్నివేశం అది. ఆ లొకేషన్ లో తీసుకున్న నిర్ణయం అది. మహేష్ వాస్ జస్ట్ అమేజింగ్. లక్ష్మి అమ్మ ఈజ్ ఆసమ్. చాలా హార్ట్ టచింగ్ అండ్ ఎమోషనల్ సీన్ అది అని చెప్పారు కృష్ణవంశీ.

ఈ సన్నివేశం గురించే ఇంకో అభిమాని ఇలా అడిగాడు. కృష్ణవంశీ గారు మురారిలో ఆ రెండు సీన్స్ విడిగా తీసాం అన్నారు కదా. లక్స్మి గారి మాటలు విని మహేష్ కి కన్నీరు వచ్చే సీన్, ఆ ఇద్దరూ పక్కపక్కనే ఉన్నారు అనుకున్నాను నేను. లక్ష్మి గారి ని చూస్తే అలా వెంటనే ఏడవడం ఈజీ ఏమో, మహేష్ తో అలా ఎలా యాక్ట్ చేయించారు?

దానికి కృష్ణవంశీ గారు ఇలా స్పందించారు. చిన్నప్పటి నుంచే మహేష్ ఒక అద్భుతమైన నటుడు. అప్పటి నుంచే మహేష్ ఒక సినిమాని తన భుజాల మీద మోసేవాడు. మహేష్ ఒక సూపర్ స్టార్. ధ్యాంక్ యూ. సంకల్పం ఓ కల్పవృక్షం. ఏది మనం బలంగా కోరుకుంటే అదే మన చెంతకి వస్తుంది. నమ్మకం ఓ ఐరావతం. మనల్ని ఎంత దూరాలకైనా మోసుకెళ్తుంది.

ఇదే పాయింట్ మీద మురారి సినిమాని చిత్రీకరించారు కృష్ణవంశీ. ఐదు నెలల షూటింగ్. రోజుకి 12 గంటల తక్కువ పని చేయలేదు. అంతమంది ఆర్టిస్టులతో సెట్ అంతా సందడే సందడి. మహేష్ బాబు అయితే ఫస్ట్ డే నుంచే క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసేశాడు. కృష్ణవంశీ టేకింగ్ కు ఫిదా అయిపోయాడు. సినిమా విడుదల అయ్యాక మెల్లమెల్లగా ఊపందుకుంది.

కలెక్షన్ల వర్షం కురవడం మొదలైంది. జనం విరగబడి చూసేశారు. మహేష్ పెర్ఫామెన్స్ పీక్స్ అని ఒకటే ప్రశంసలు. కృష్ణ గారబ్బాయిలా కాకుండా మహేష్ బాబుగా ప్రిన్స్ ను జనం గుర్తించేలా చేసింది మురారి. సూపర్ స్టార్ కృష్ణ గారు సినిమా చూసి కదిలిపోయారు. మురారిలో మహేష్ పెర్ఫామెన్స్ చూసి గర్వపడుతున్నాను ఒకటే స్టేట్ మెంట్. మహేష్ టాప్ టెన్ సినిమాల్లో అగ్రతాంబూలమెప్పుడూ దీనికే.

Share

Leave a Comment