ఎప్పటికీ మరిచిపోలేను

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు కథానాయకునిగా సుకుమార్ దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మించిన చిత్రం ‘1 నేనొక్కడినే’. ఈ చిత్రం ద్వారా కృతి సనన్ కథానాయికగా పరిచయమైన సంగతి తెలిసిందే. తరువాత రూటు మార్చి బాలీవుడ్ కి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే.

తాజాగా హైదరాబాద్‌ వచ్చిన కృతి సనన్ విలేకరులతో ముచ్చటించారు. ‘గతంలో యాడ్స్‌లో నటించాను. ఉన్నట్టుండి హీరోయిన్ అయిపోయాను. కథానాయికగా నటించిన తొలి సినిమానే సూపర్‌స్టార్ మహేష్‌తో చేయడం చాలా ఆనందంగా ఉంది. సూపర్‌స్టార్‌ తో యాక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

తెలుగుతెరపై హాలీవుడ్ స్థాయిలో తీసిన ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ ద్వారా హీరోయిన్‌గా పరిచయం అవ్వడం గర్వంగా ఉంది. మహేష్‌తో నటించడం ఎప్పటికీ మరిచిపోలేను, నిజంగా మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్. సెట్‌లో ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే ఆయన ఒక్కసారి కెమెరా ముందుకెళితే పాత్రలా మారిపోతారు. ఆయన పాత్రల్లో లీనమయ్యే తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

నిజంగా ఆయనతో నటించడం అమేజింగ్ అనిపించింది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ నా మీద చాలా ప్రేమ చూపించారు. అందరికి చాలా థ్యాంక్స్. మహేష్ గారితో తో నటిస్తున్నప్పుడు ఒక్క మూమెంట్ చెప్పమంటే చాలా కష్టం. చాలా ఉన్నాయి’ అని కృతి సనన్ అన్నారు.

జాకీష్రాఫ్‌ తనయుడు టైగర్‌ ష్రాఫ్‌ను వెండితెరకు పరిచయం చేస్తూ తీసిన ‘హీరోపంతి’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు కృతి సనన్. తొలి సినిమాతో డెబ్యూ హీరోయిన్‌గా ‘ఫిల్మ్‌ఫేర్‌’, ‘ఐఫా’, ‘స్టార్‌గిల్డ్‌’ సహా పలు అవార్డులు అందుకోవడం విశేషం. ప్రస్తుతం తాను బాలీవుడ్ లో బిజీగా ఉన్నట్లు తెలిపారు.

ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా షూటింగ్ లో మహేష్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అల్లరి నరేష్ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ 2019 ఏప్రిల్ 5న విడుదల కాబోతోంది.

Share

Leave a Comment