ఆశ్చర్యం కలుగుతుంది..

సూపర్‌స్టార్ మహేష్‌ బాబుతో వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి కృతి సనన్‌. తన మొదటి సినిమా మహేష్ తో చేయడం అంటే అది తన లక్‌ గా ఫీలయ్యానని అంటున్న కృతి ఆ తర్వాత తెలుగులో ఎక్కువగా కనిపించలేదు. బాలివుడ్ లోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ వస్తున్నారు కృతి సనన్‌.

ర్యాంప్ మీద హొయలొలికిస్తూ క్యాట్ వాక్ చేయాలంటే అంత సులభం ఏమీ కాదని దానికంటే సినిమాల్లో చేయడమే చాలా సులభమని చెప్పారు ఆవిడ. ఇంకా ఇంటర్వ్యూలో సౌత్ లో మహేష్ తో కలిసి పని చేసిన అనుభవాలని వివరించారు. గతంలో చాలా యాడ్స్‌లో నటించాను.

ఉన్నట్టుండి హీరోయిన్ అయిపోయాను. కథానాయికగా నటించిన తొలి సినిమానే మహేష్‌ బాబు లాంటి బిగ్ సూపర్‌స్టార్ తో చేయడం చాలా ఆనందం కలిగించింది. సూపర్‌స్టార్‌ తో తెలుగు తెరపై హాలీవుడ్ స్థాయిలో తీసిన యాక్షన్ ఎంటర్‌టైనర్ వన్ నేనొక్కడినే ద్వారా హీరోయిన్‌గా పరిచయం అవ్వడం గర్వంగా అనిపించింది.

నన్ను ఆదరించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మహేష్‌ తో నటించడం ఎప్పటికీ మరిచిపోలేను, నిజంగా మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్. సెట్‌ లో ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే ఆయన ఒక్కసారి కెమెరా ముందుకెళితే పూర్తిగా ఆ పాత్ర లా మారిపోతారు. ఆయన ప్రతి సినిమాలో పాత్రల్లో లీనమయ్యే తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

నిజంగా ఆయనతో నటించడం అమేజింగ్ అనిపించింది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ నా మీద చాలా ప్రేమ చూపించారు. అందరికి చాలా థ్యాంక్స్. మహేష్ గారితో తో నటిస్తున్నప్పుడు ఒక్క మూమెంట్ గురించి చెప్పమంటే చాలా కష్టం. అలాంటి మొమెంట్స్ చాలా ఉన్నాయి అని కృతి సనన్ అన్నారు.

కృతి సనన్ తొలి సినిమాతో డెబ్యూ హీరోయిన్‌గా ఫిల్మ్‌ఫేర్‌, ఐఫా, స్టార్‌గిల్డ్‌ సహా పలు అవార్డులు అందుకోవడం విశేషం. ప్రస్తుతం తాను బాలీవుడ్ లో మంచి సినిమాలతో బిజీగా ఉన్నట్లు తెలిపారు. మంచి రోల్ వస్తే తప్పకుండా సౌత్ లో తిరిగి రీఎంట్రీ ఇచ్చి నటిస్తాను అని తెలిపారు కృతి సనన్.

రెగ్యులర్‌ మూస కథల కంటే విభిన్నమైన పాత్రలు ఉన్న చిత్రాలని ప్రేక్షకులకి అందించడంలో మహేష్ బాబు ముందు వరుసలో ఉంటారు. ఒక స్టార్‌ హీరో అయి ఉండి ప్రయోగం చేస్తే ఫలితం ఎలా ఉంటుందనేది పక్కన పెట్టి ఎప్పటికప్పుడు తన సినిమాల ద్వారా కొత్తదనాన్ని ప్రేక్షకులకి అందిస్తూ టాలివుడ్ స్థాయిని మరింతగా పెంచారు సూపర్‌స్టార్.

మహేష్ గత కొంతకాలంగా సందేశాత్మక కథాంశాలతో సినిమాలు చేస్తున్నారు. ఆ పంథాకు పూర్తి భిన్నంగా పరుశురాం సినిమా సరికొత్త కధతో మంచి ఎంటర్టైనర్‌‌గా రానుందని సమాచారం. మహేష్ ఫ్యాన్స్ అందరూ గర్వపడేలా సినిమా ఉంటుంది. మహేష్ ను సరికొత్తగా ప్రెజంట్ చేయడానికి ప్రయత్నిస్తాను అని తెలిపాడు.

Share

Leave a Comment