నా మోస్ట్ ఫ్యావెరెట్

లోకనాయకుడు కమల్ హాసన్ గారి వారసురాలిగా మనందరి ముందుకు వచ్చారు శృతిహాసన్. చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా నటనలో తండ్రికి తగ్గ తనయురాలిగా మంచి పేరును సంపాదించారు ఆమె. ఈ మధ్య ఆమె సినిమాలకు కొంచెం బ్రేక్ ఇచ్చారనే చెప్పాలి. ఆమె ఎక్కువగా కనిపించడం కూడా అరుదే.

తెలుగు తెరపై శృతిహాసన్ కనిపించి చాలా రోజులే అయ్యిందన్న సంగతి మనకు తెలిసిందే. తెలుగు అనే కాదు వేరే భాషల్లో కూడా ఈమె నటించిన సినిమాలు ఏమీ ఈ మధ్య కాలంలో విడుదల కాలేదు. ఎందుకనో సినిమాలకు చాలా దూరంగా ఉంటున్నారు ఆమె. అటువంటి సమయంలో ఆమె ఒక తమిళ చానెల్ టాక్ షోలో ప్రత్యక్షమయ్యారు.

తన గురించి తన సినిమాల గురించి పలు విషయాలను ఆమె ఆ టాక్ షోలో పంచుకున్నారు. మీరు ఇన్ని భాషల్లో నటించారు కదా మీకు ఇష్టమైన సినిమా ఏది అని ఆ షో వ్యాఖ్యాత బాలాజీ శృతిహాసన్ ను అడిగారు. అందుకు ఆమె మహేష్ బాబు, కొరటల శివ లతో చేసిన శ్రీమంతుడు చాలా ఇష్టం అని సమాధానమిచ్చారు.

అన్ని భాషల్లోంచి అందులోనూ ఒక తమిళ షోలో మన శ్రీమంతుడు గురించి చెప్పారంటే ఆ సినిమా ఆమెకు ఎంత ప్రత్యేకమో మనకు అర్థమవుతుంది. ఇది వరకు ఒక ఈవెంట్ లో మీడియాతో మాట్లాడిన సందర్భంలో కూడా ఆమె శ్రీమంతుడు, మహేష్ బాబు గురించి ఆశక్తికర వ్యాఖ్యలు చేసారు. అమె ఏమన్నారో ఒక సారి చూద్దాం.

‘నాకు తెలుగు సినిమాలతో మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. మహేష్‌ బాబు సరసన నటించడం మరచిపోలేని అనుభూతినిచ్చింది. ఆయన ఒక జెంటిల్ మ్యాన్. ఎప్పుడూ నవ్వుతూ మనల్ని కూడా నవ్విస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా సినిమాల గురించే మాట్లాడతారు. చాలా మంచి మెమొరీస్ ఉన్నాయి మహేష్ గారితో’ అని చెప్పారు.

జీవితంలో ఉన్నత స్థానానికి వచ్చిన వారు సొంతూరు బాగు కోసం పాటుపడాలన్న ఆలోచనతో తెరకెక్కిన సినిమా శ్రీమంతుడు. డబ్బున్నవాడు కాదు, మనసున్నోడే అసలైన శ్రీమంతుడనేది ఒక్క లైన్ లో ఈ సినిమా స్టోరీ. సామాజిక స్పృహ ను పెంచే కథతో సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి ఓ స్టార్ హీరో ఈ సినిమా చేయడం అందరినీ ఆలోచింపజేసింది.

మహేష్ నటించే ప్రతి సినిమా సంథీంగ్ స్పెషల్ అనే విధంగా ఉంటాయి. భరత్ అనే నేను రాష్ట్రాభివృద్ది కోసం నిధులు ఎలా వినియోగించుకోవాలి, ప్రజల నమ్మకాన్ని డబ్బు తో కాదు అభివృద్ది చూపించి గెల్చుకోవాలన్న కాన్సెప్ట్ సూపర్ గా ఉంది. ఇక ఇప్పుడు మహర్షి. ఈ చిత్రాన్ని రైతు సమస్యలపై అద్భుతంగా ఆవిష్కరించారు.

రైతులకు సరైన గౌరవాన్ని ఇవ్వాలని, వారిని దోచుకుంటున్న దళారీలను తరిమి కొట్టేది సామాన్య ప్రజలే అని ఎన్నో మంచి విషయాలు ఈ చిత్రంలో చూపించారు. వారాంతపు వ్యవసాయం, సామాజిక సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన మహర్షి అందరి ప్రశంసలు అందుకుంటుంది. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుండి బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది. ముఖ్యమైన అన్ని సెంటర్లలో కొత్త రికార్డులను లిఖిస్తూ ముందుకు సాగిపోతుంది మహర్షి.

మహర్షి సక్సెస్‌ తర్వాత ఫ్యామిలీతో కలసి మహేష్ ఫారిన్‌ ట్రిప్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఇండియా క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచులు ఎంజాయ్ చేస్తున్న ప్రిన్స్ త్వరలోనే తిరిగి రానున్నట్టు తెలిసింది. తిరిగొచ్చాక అనీల్ రావిపూడితో క‌లిసి మ‌హేష్ త‌న 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు షూటింగ్ లో పాల్గొననున్నారు.

Share

Leave a Comment