మహర్షి అరుదైన రికార్డులు

సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరో గా వంశీ పైడిపెల్లి దర్శకతంలో రూపొందిన మహర్షి చిత్రం మే 9వ తేదీన విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే మూడు వారాలు పూర్తిచేసుకుంది. విడుదలైన రోజు నుంచి ఈ రోజు వరకు వరకు కలెక్షన్స్ పరంగా మాత్రం వెనక్కి తగ్గకుండా దూసుకుపోతూనే ఉంది.

మహర్షిలో మహేష్ బాబు నటన, సామాజిక అంశాల పట్ల పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ మూడు వారాల్లో చాలా చోట్ల నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టడమే కాక చాలా మంచి సినిమా అని అందరిచేత ప్రశంసలను అందుకుంటుంది. కలెక్షన్ల పంట పండిస్తూ మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తున్న ఈ సినిమా చెన్నైలో అరుదైన ఫీట్ సాధించింది.

సూపర్ స్టార్ మహేష్ బాబుకి తమిళ ఆడియన్స్ పరంగా కూడా ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. మహేష్ కెరీర్ లో వచ్చిన అన్ని సినిమాలకు చెన్నై నగరంలో మంచి ఆదరణ లభిస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఇటీవలే విడుదలైన మహర్షి సైతం చెన్నై పట్టణంలో కలెక్షన్స్ పరంగా సూపర్‌స్టార్ మరోసారి తన హవా కొనసాగించాడు.

పద్దెనిమిది రోజుల్లోనే చెన్నైలో కోటి రూపాయలకు పైగా వసూలు చేసి అరుదైన ఘనత సాధించింది. గతంలో మహేష్ హీరోగా వచ్చిన భరత్ అనే నేను అంతకుముందు ఈ ఫీట్ సాధించిన ఏకైక సినిమాగా ఉండేది. ఇప్పుడు ఆ సినిమా సరసన మహర్షి కూడా వచ్చి చేరింది. భరత్ అనే నేను రూ.1.71 కోట్ల గ్రాస్ తో మొదటి స్థానంలో ఉంది.

కేవలం చెన్నై లోనే కాకుండా ఆంధ్రా లో కూడా మరో మూడు అరుదైన రికార్డులని సొంతం చేసుకున్నాడు మన సూపర్‌స్టార్. కాకినాడ టౌన్ లో మరోసారి కోటి రూపాయల షేర్ దక్కించుకున్నాడు మహర్షి తో. సో ఇది మన మహేష్ కి మూడే కోటి రూపాయల షేర్ సినిమా. మరే ఇతర హీరో కి ఇలా మూడూ కోటి షేర్స్ ఉన్నా చిత్రాలు లేవు.

అలానే నెల్లూరు టౌన్ లో కూడా మహర్షి జోరు మాములుగా లేదు. అక్కడ కూడా కోటి రూపయల షేర్ వసూలు చేసింది. అంతే కాకుండా అతి తక్కువ టైం లో (బాహుబలి 2 ని మినిహాయించి) కోటి మార్కు ని అందుకున్న చిత్రం గా నిలించింది. సూపర్‌స్టార్ మహేష్ కి ఇక్కడ ఇది మొదటిసారి కావడం విశేషం.

కాకినాడ, నెల్లూరు లోనే కాకుండా రాజమండ్రి లో కూడా మరో అరుదైన ఘనత దక్కించుకున్నాడు మన ప్రిన్స్ మహేష్ బాబు. మహర్షి ఇక్కద కూడా కోటి షేర్ కొళ్ళగొట్టడం తో మూడు సార్లు ఈ ఘనత సాదించిన ఒకే ఒక్క హీరో గా సూపర్‌స్టార్ మహేష్ బాబు ఇక్కడ సరి కొత్త చరిత్ర సృష్టించాడు.

మహర్షి చిత్రం నైజాం ఏరియాలో అత్యధిక వసూళ్లు సాధిస్తూ దూసుకెళుతోంది. బాహుబలి సిరీస్ తరువాత నైజాంలో అత్యధిక వసూళ్ళు రాబట్టిన సినిమాగా ఇప్పటికే రికార్డు సృష్టించింది మహర్షి. ఇదే దూకుడును కొనసాగిస్తూ ఇంకో రెండు రోజుల్లో రూ.30 కోట్ల షేర్ మార్క్ ను బద్దలుకొట్టి బాహుబలి సిరీస్ తరువాత ఈ ఘనత సాధించిన సినిమాగా నిలవడం తధ్యం.

ఇంకా తెలుగు రాష్ట్రాలలోని మిగతా ఏరియాల్లో కూడా నిన్న దుమ్మురేపే కలెక్షన్లు వచ్చాయి. చాలా ఏరియాల్లో నిన్న హౌజ్‌ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. నిన్న నైజాం, ఉత్తరాంధ్రా మరియు ఈస్ట్ గోదావరి నుంచే దాదాపు అర కోటి రూపాయల షేర్ ను కొల్లగొట్టింది మహర్షి. రెండు రాష్ట్రాల నుంచి ఎనబై లక్షల వరకు వసూళ్ళు సాధించింది.

ప్రపంచ వ్యాప్తంగా చూసినా మహర్షి సినిమా ఇప్పటికీ డీసెంట్ రన్ లో ఉంది. ఈ రేంజ్ కలెక్షన్లు అంటే అది సూపర్ స్టార్ కు ఉన్న స్టార్‌డమ్ వల్లే అని చెప్పాల్సిందే. ఇంకా రెస్టాఫ్ ఇండియాలో కూడా మహర్షి తన సత్తా చూపిస్తున్నాడు. ఒక ఏరియా అని లేకుండా ఇలా అన్ని చోట్లా దిగ్విజయంగా ప్రదర్శింపబడుతూ అందరి మన్ననలను అందుకుంటుంది మహర్షి.

కేవలం మూడు వారాల్లోనే కళ్ళు చెదిరే స్థాయి లో వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించిన ఈ సినిమా నేటికీ పరుగులు పెడుతోంది. ఈ పరుగులు చూస్తుంటే మహేష్ కెరీర్ లో ఈ సినిమా మరో మైల్ స్టోన్ అవుతుందని తెలుస్తోంది. సిల్వర్ జూబ్లీ సినిమా తో మహేష్ కొత్త రికార్డులను నమోదు చేయడం పట్ల అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మహర్షి సక్సెస్‌ తర్వాత ఫ్యామిలీతో కలసి ఆయన ఫారిన్‌ ట్రిప్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. కుటుంబంతో క్వాలిటీ టైమ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. 20 రోజుల పాటు సాగే ఈ ట్రిప్‌లో పోర్చుగల్, ఇంగ్లాండ్‌ చుట్టి రానున్నారు మహేష్. ట్రిప్‌లోని ఆనంద క్షణాలను ఎప్పటికప్పుడు మహేష్ సతీమణి నమ్రత తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు.

వెకేషన్ నుంచి తిరిగొచ్చాక అనీల్ రావిపూడితో క‌లిసి మ‌హేష్ త‌న 26వ సినిమా చేయ‌నున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అప్‌డేట్స్ తెలియజెప్పడం లో దర్శకుడు అనిల్ రావిపూడి ఒక స్టైల్ ను అనుసరిస్తారు. ఎమోజి వాడుతూ సినిమా కి సంబందించిన కీలక అప్డేట్ ని ప్రేక్షకులకి హింట్ చేసారు.

అనిల్ పోస్ట్ చేసిన ఆ సింబల్స్ ను డీకోడ్ చేస్తే తాను ఈ సినిమా కి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేశానని, స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది అని, షూటింగ్ త్వరలో మొదలు కానుంది అని అర్థం. దానికి అదే రీతిలో రాహుల్ రవీంద్రన్ మరియు అనసూయ రెస్పాండ్ కావడం విశేషం. వారు కూడా అలాంటి సింబల్స్ తోనే అనిల్ కి రిప్లై పెట్టారు.

Share

Leave a Comment