ఆ కిక్కే వేరు…

మహేష్‌ బాబు సిల్వర్ జూబిలీ చిత్రం’మహర్షి’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. రూ.100 కోట్ల షేర్‌ క్రాస్‌ చేసి ఇప్పటికీ సూపర్‌ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా ఒక వారం క్రితం దిల్‌ రాజు మాట్లాడుతూ ఈ చిత్రం ఇప్పటికీ ఇంకా సక్సెస్‌ఫుల్ గా రన్ అవుతుంది. ఇప్పటికే సూపర్‌ కలెక్షన్స్‌తో చాలా స్ట్రాంగ్‌గా రన్‌ అవుతోంది.

నేను ఫస్ట్‌టైమ్‌ ఇంకో రెండు పెద్ద ప్రొడక్షన్‌ హౌస్‌తో కలిసి పని చేయడానికి కారణం వంశీ కథ చెప్పినప్పుడు ఆ కథ ఇచ్చిన ఎగ్జయిట్‌మెంట్‌. అదే నమ్మకంతో ఈ సినిమా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. ఒక సినిమా విషయంలో రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఆ సినిమా విజయవంతమైతే వచ్చే కిక్కే వేరు.

అదే ‘మహర్షి’ నిరూపించింది. కొన్ని సినిమాలు డబ్బుతో పాటు మంచి పేరుని కూడా తెస్తాయి. అలాంటి చిత్రం ఇది. ఎక్కడికెళ్లినా మంచి ఎప్రిషియేషన్‌ వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రైతులతో కలిసినప్పుడు ఈ సినిమా తర్వాత రైతుల గురించి, వ్యవసాయం గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా చేశారని వారు చెప్పడంతో వచ్చిన శాటిస్‌ఫ్యాక్షన్‌కి ఎంత డబ్బు వచ్చినా రాదు.

మా బ్రదర్‌ మాట్లాడుతూ ఈ బేనర్‌లో ది బెస్ట్‌ మూవీ ఇదే వంశీ అన్నారు. మహేష్‌ కెరీర్‌లో హయ్యస్ట్‌ షేర్‌ సాధించిన సినిమాగా ‘మహర్షి’ నిలిచింది. అలాగే నైజాంలో 30 కోట్ల షేర్‌ను టచ్‌ చేసి కొత్త చరిత్ర సృష్టించింది.. ఈ సంవత్సరం సంక్రాంతికి ‘ఎఫ్‌2’తో పెద్ద హిట్‌ కొట్టాం. ఇప్పుడు సమ్మర్‌లో ‘మహర్షి’తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ సాధించాం.

ఈ రెండు సక్సెస్‌లు ఇచ్చిన కిక్‌తో ఇంకో మూడు ప్రొడక్షన్స్‌తో రాబోతున్నాం’అని అన్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ‘ఏ నమ్మకంతో అయితే సినిమా ప్రారంభించారో ఈరోజు ఆ నమ్మకాన్ని తెలుగు ప్రేక్షకులు నిజం చేశారు. మహేష్ బాబు గారికి నేనెప్పటికీ రుణ పడి ఉంటాను.. ఆయన నాకు సోల్ మేట్ లాంటి వారు..

ఈ సినిమా విజయంతో పాటు మాకిచ్చిన రెస్పెక్ట్‌ మా జీవితాంతం గుర్తుండిపోతుంది. ఎక్కడికెళ్ళినా రైతులు తమ కళ్లల్లో నీళ్లు పెట్టుకొని మాకు ఒక గుర్తింపునిచ్చారన్నా అంటున్నారు. మాకెలా స్పందించాలో తెలియలేదు. మేము అనుకున్న దానికంటే ఇంక అనూహ్యమైన స్పందన లభించడం ఆనందంగా ఉంది.

ఈ సినిమా ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాం. రైతులను మర్చిపోతే మనల్ని మనం మర్చిపోయినట్టే. సొసైటీలో ఇది ఇంత ప్రభావాన్ని చూపింది. ఈ విజయం వెనుక మా టీమ్‌ కృషి ఎంతో ఉంది. నాలుగో వారంలోకి వచ్చినా కూడా ఈ సినిమా గురించి మాకు ఫోన్లు వస్తున్నాయి.

ఈ సినిమాను అభినందించిన ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, ఇండిస్టీ ప్రముఖులకు మా టీమ్‌ అందరి తరపున ధన్యవాదాలు. కొన్ని కొన్ని సినిమాలు మన జీవితాల్లో తీపి గుర్తులుగా మిగిలిపోతాయి..మహేష్ బాబు గారితో ఈ జర్నీని ఎప్పటికీ మరవలేను..’ అని చెప్పారు.

సిల్వర్ జూబ్లీ సినిమా తో మహేష్ కొత్త రికార్డులను నమోదు చేయడం పట్ల అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహర్షి సక్సెస్‌ తర్వాత ఫ్యామిలీతో కలసి ఆయన ఫారిన్‌ ట్రిప్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. కుటుంబంతో క్వాలిటీ టైమ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇండియా తిరిగి వచ్చాక కొత్త సినిమా షూటింగ్ లో పాల్గోనున్నారు.

Share

Leave a Comment