మరికొన్ని గంటల్లో ఫస్ట్‌లుక్

మహేష్ బాబు 25 వ సినిమా టైటిల్ పై ఉత్కంఠత కొనసాగుతున్నది. ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులు, ప్రిన్స్ ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్న విషయమిది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను 9వ తేదీ మహేష్ జన్మదినం సందర్భంగా విడుదల చేస్తామని టీమ్ ఆఫీషియల్ గా వెల్లడించింది.

జాయిన్ ది జర్నీ ఆఫ్ ‘రిషి’, ఫస్ట్ లుక్ ఆఫ్ SSMB25 ఎట్ 12:06AM. టీజర్ ఆఫ్ ‘రిషి’ ఎట్ 9:09AM. అని చిత్ర బృందం ట్వీట్ చేశారు. అంటే రేపు టీజర్ కూడా ఉందనమాట. ఇక అభిమానులకు పండగే. సాధారణంగానే సూపర్ స్టార్ సినిమాలకు క్రేజ్ పీక్స్ లో ఉంటుంది.

ఇక ల్యాండ్ మార్క్ ఫిలిం అయిన 25 చిత్రమైతే ఆ క్రేజ్ ఆకాశాన్ని తాకడంలో ఆశ్చర్యం లేదు కదా. రోజుకో ఎంబ్లెమ్ చొప్పున వంశి పైడిపల్లి టీమ్ రిలీజ్ చేస్తూ వచ్చింది. మొత్తం 5 ఆంగ్ల అక్షరాలను విడతల వారీగా రిలీజ్ చేసింది.

‘రిషిని కలవండి. తన ప్రయాణంలో ఈ నెల 9నుంచి మీరూ భాగస్వాములు కండి’ అని డైరెక్టర్ వంశీ పైడిపెల్లి ట్వీట్ చేసారు. సో సినిమాలో మహేష్‌ బాబు పాత్ర పేరు ‘రిషి’ అయ్యుంటుంది. అసలు టైటిల్‌ ఏంటి? వేరే టైటిల్‌ ప్రకటిస్తారా? అనేది తేలాల్సివుంది.

ఇప్పుడు రిషి గురించిన చర్చ మహా జోరుగా నడుస్తోంది. ఈ నెల 9న మహేష్ బాబు బర్త్ డే అవడంతో, అందుకు కొద్దిరోజులు ముందునుండే అయన అభిమానులు సోషల్ మీడియాలో పండుగ మొదలెట్టారు. ఒక వైపు అభిమాన నటుడి పుట్టినరోజు, మరో వైపు చిత్ర ఫస్ట్ లుక్ ఆగస్ట్ 9న రాబోతుండటంతో మహేష్ అభిమానులు డబుల్ ధమాకా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అల్లరి నరేష్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్విని‌దత్, పివిపి లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ కేవలం మహేష్ పుట్టినరోజు కాబట్టి ఫ్యాన్స్ కు గిఫ్ట్ గా ఇచ్చినట్టు ఉంటుందనే ఉద్దేశంతోనే ఇది ప్లాన్ చేసారు.

Share

Leave a Comment