ఆసక్తి రేపుతున్న మహేష్ 25

సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రంతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. తదుపతి చిత్రాలకు దర్శకులని ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. మహేష్ 25 వ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు.

ఇప్పటికే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. అశ్వినీదత్, దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం కోసం వంశీ పైడిపల్లి దాదాపు రెండేళ్లు ఎదురుచూసిన సంగతి తెలిసిందే. ఊపిరి తరువాత వంశీ మరో చిత్రం చేయలేదు.

కాగా ఈ చిత్రంలో మహేష్ లుక్ గురించి ఆసక్తికరణ వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు సహజంగానే అందంగా ఉంటాడు కాబట్టి లుక్ విషయంలో పెద్దగా ప్రయోగాలు చేయాల్సిన పని లేదు. పోకిరి, అతిధి వంటి చిత్రాలలో మహేష్ లుక్ కొత్తగా కనిపిస్తుంది. వంశీ పైడి పల్లి చిత్రంలో మహేష్ మరోసారి ఇలా కొత్తగా కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమా మహేష్ కెరియర్ లో 25వ సినిమా కావడంతో మంచి అంచనాలు ఆరంభం నుండే ఏర్పడ్డాయి. వంశీ పైడిపల్లి యూఎస్ లో లొకేషన్ల వేటలో ఉన్నారు. ఈ చిత్రం ఎక్కువ భాగం యుఎస్ లో షూటింగ్ జరుపుకోనుంది.

ఇదిలా ఉండగా ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో కూడా ఈ చిత్రం ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం గురించిన పూర్తి వివరాలు చిత్ర యూనిట్ వెల్లడించాల్సి ఉంది.

పూజ హెగ్డే తొలిసారి మహేష్ కు హీరోయిన్ గా చేయబోతోంది. దేవి శ్రీ ప్రసాద్ బాణీలను సమకూర్చే పనిలో పడ్డాడు. ఇది అద్భుతమైన, స్ఫూర్తిదాయకమైన కథని, అందరికీ నచ్చుతుందని అభిప్రాయపడ్డారు దేవి. కొన్ని రోజుల క్రితమే దేవిశ్రీ ప్రసాద్‌ అక్కడ దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

ఇప్పుడు భరత్ అనే నేను తమిళంలో ‘భరత్ యనుమ్ నాన్’ పేరుతో రిలీజ్ కానుంది. తెలుగు నాట మహేష్ బాబుకు, ఫ్యాన్స్ కు మంచి అనుభూతులను పంచిన భరత్ అనే నేను తమిళంలో ఎలాంటి ఫలితాన్ని చవిచూస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రిన్స్ కైతే చెన్నైలో భారీ మార్కెట్ ఉందని ‘బాహుబలి 2’ రికార్డులను బద్దలు కొట్టడం ద్వారా ఇప్పటికే స్పష్టమైంది.

మహేష్ బాబు 26 వ చిత్రం సుకుమార్ తో చేయనున్నారు. ఈ వార్త మహేష్ ఫాన్స్ కు క్రేజీ న్యూస్ అని చెప్పొచ్చు. పరాజయమే ఎరుగని మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మహేష్ – సుకుమార్ కాంబినేషన్ క్రేజ్ ఎంటో అందరికీ తెలిసిన విషయమే. మరొక్క కొత్త రకం కథ తో ముందుకు రాబోతున్నారు.

Share

Leave a Comment