మొదలవడానికి అంతా రెడీ

సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో చేసిన భరత్ అనే నేను సినిమా సూపర్ హిట్ అయింది. భారీ స్థాయిలో వసూళ్లు వస్తుండటంతో భరత్ టీమ్ సంబరాల్లో మునిగిపోయింది. మహేష్ కూడా ఈ హిట్ ను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యామిలీతో వెకేషన్లో ఉన్నారు.

త్వరలో మహేష్ 25 వ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. జూన్ లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ పక్కాగా జరుగుతోంది. అమెరికా నేపథ్యములో సాగే ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే ఖరారు అయింది.

మహేష్ తరఫున ఆ సినిమా ఏర్పాట్ల కోసం దర్శకుడు వంశీ పైడిపల్లి కెమెరామెన్ కెయు మోహనన్ తో కలిసి అమెరికాకి వెళ్లి లొకేషన్ వేటలో పడ్డాడు. తొలిసారి తెలుగు చిత్రం చేస్తున్నారు కెయు మోహనన్. ఈ చిత్రంలో మహేష్ మరోసారి కొత్తగా కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సో మహేష్ త్వరలోనే న్యూ యార్క్ లో కాలు పెట్టనున్నాడు అనే క్లారిటీ వచ్చినట్టే. భరత్ అనే నేను తర్వాత వస్తున్న మూవీ కావడంతో పాటు సూపర్ స్టార్ 25వ సినిమా కావడం కూడా దీని మీద హైప్ ని పెంచుతోంది. ఈ చిత్రం గురించిన పూర్తి వివరాలు చిత్ర యూనిట్ వెల్లడించాల్సి ఉంది.

దేవి శ్రీ ప్రసాద్ ఇది అద్భుతమైన, స్ఫూర్తిదాయకమైన కథని, అందరికీ నచ్చుతుందని అభిప్రాయపడ్డారు. కొన్ని రోజుల క్రితమే దేవిశ్రీ ప్రసాద్‌ అక్కడ దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం కోసం అద్భుతమైన ట్యూన్స్ రెడీ చేసేసారు.

మహేష్ బాబు 26 వ చిత్రం సుకుమార్ తో చేయనున్నారు. మహేష్ – సుకుమార్ కాంబినేషన్ క్రేజ్ ఎంటో అందరికీ తెలిసిన విషయమే. మరొక్క కొత్త రకం కథ తో ముందుకు రాబోతున్నారు. పరాజయమే ఎరుగని మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి నటుడు మాత్రమే కాదు, మంచి మనసున్న మనిషి అని అనేక సార్లు నిరూపించుకున్నారు. మూడో కంటికి తెలియకుండా అయన ఎంతోమందికి సాయం చేశారు. రెండు గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు. తాజాగా మరో సాయం చేశారు.

ఎన్నారై సేవ పేరుతో కొంతమంది ఎన్నారై లు రోగాలతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. అందుకోసం అయ్యే మొత్తాన్ని భరించడానికి మహేష్, నమ్రతలు ఒకే చెప్పారు. చేసిన సాయాన్ని ఎంతో గొప్పగా చెప్పుకుని ప్రచారం చేసుకునే ఈ రోజుల్లో తాము చేసిన మంచి పనులను కూడా ప్రచారం చేసుకోకపోవడం నిజంగా గొప్ప విషయం. నిజంగా తను సూపర్ స్టార్ అని మహేష్ నిరూపించాడు.

Share

Leave a Comment