ఇక అంతా రెడీ

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది ‘భరత్ అనే నేను’ చిత్రంతో కెరీర్ లోనే ది బెస్ట్ హిట్ అందుకొని తన స్టార్ స్టామినాను నిరూపించుకున్నారు. ఇక ఇప్పటి వరకు 24 చిత్రాలను పూర్తి చేసుకున్న మహేష్ నెక్స్ట్ తన సిల్వర్ జూబ్లీ సినిమా కోసం సిద్ధమవుతున్నారు.

‘రాజకుమారుడు’తో కథానాయకుడిగా తన ప్రయాణం ప్రారంభించారు మహేష్‌బాబు. ఇప్పుడు 25వ చిత్రం మైలు రాయిని అందుకోబోతున్నారు. మహేష్ కెరీర్లో ల్యాండ్ మార్క్ చిత్రమైన ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయనున్నారు. స్క్రిప్టు ఎప్పుడో పూర్తయింది.

మహేష్‌ రాక కోసం చిత్రబృందం ఎదురుచూస్తోంది. వచ్చే నెల రెండో వారం నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సినిమా పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో కొత్త మహేష్ ను చూస్తామట. ఇప్పటి వరకు మహేష్ ఎన్నో వినూత్న పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు.

గ్లామర్ ని మెయింటైన్ చేయాలి అంటే మహేష్ తరువాతే ఎవరైనా. అయితే ఈ వంశీ ప్రాజెక్ట్ లో సూపర్ స్టార్ కొత్త హెయిర్ స్టైల్ ని చుపించనున్నాడట. ఈ చిత్రంలో మహేష్‌ లుక్‌ మారనున్నదని, అనుకున్న లుక్‌లోకి మారడానికి మహేష్‌ కాస్త సమయం తీసుకున్నారని, అందుకే ఈ చిత్ర షూటింగ్ ఆలస్యమైందని సమాచారం.

ఇప్పటికే బ్యాక్ గ్రౌండ్ వర్క్ మొత్తం అయిపొయింది. లొకేషన్స్ విషయంలో దర్శకుడు వివిధ దేశాల ప్రముఖ నగరాలను చుట్టేశాడు. ముఖ్యంగా అమెరికాలో కొత్త లొకేషన్స్ ఈ సినిమా లో కనిపిస్తాయని చెబుతున్నారు.

ఫైనల్ గా జూన్ సెకండ్ వీక్ లో సినిమా రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చెయ్యాలని చూస్తున్నారు. ఎక్కువగా యూఎస్ – నార్త్ ఇండియాలో షూటింగ్ చేస్తారట. ఇక సినిమాలో మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్స్ కూడా రెడీ చేసేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి కె.యు.మోహనన్ సినిమాటోగ్రఫీ అందివ్వనున్నారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్విని దత్ లు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు.

Share

Leave a Comment