కాలేజీ నుంచి వస్తున్న

భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు తన 25వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా డెహ్రాడూన్ లో జరుగుతోంది. జూన్ 17వ తేదీన అక్కడ మొదలైన షెడ్యూల్ రీసెంట్ గా పూర్తయింది.

మహేష్, పూజా హెగ్డే, అల్లరి నరేష్ ల మధ్య కొన్ని కీలకమైన సన్నివేశాలను డెహ్రాడూన్ లో చిత్రీకరించారు. జూన్ 17న మొదలైన డెహ్రాడూన్ షెడ్యూల్ శుక్రవారంతో ముగిసింది. 20 రోజుల పాటు చిత్రీకరించాక మహేష్25 టీమ్ మొత్తం హైదరాబాద్ తిరిగి రానుంది. కీలకమైన అమెరికా షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు.

కొన్నిరోజుల విరామం తరువాత ఈ సినిమా టీమ్ అమెరికా వెళ్లనున్నట్టు తెలుస్తోంది. మూడు నెలల క్రితమే న్యూ యార్క్ తో పాటు కీలకమైన ప్రదేశాలన్నీ తిరిగి వచ్చి షూటింగ్ స్కెచ్ వేసుకున్న వంశీ పైడిపల్లి ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు నాయకా నాయికల మధ్య రెండు పాటలను కూడా అక్కడ చిత్రీకరించనున్నట్టు టాక్.

అల్లరి నరేష్ కూడా ఈ షెడ్యూల్ లో ఉంటారో లేదో తెలియాల్సి ఉంది. కాలేజీ బ్యాక్ డ్రాప్ కాబట్టి డిఫరెంట్ గా కనిపించేందుకు గెడ్డం పెంచిన మహేష్ అది కంటిన్యూ చేస్తాడా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఏప్రిల్ 5న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ మూవీకి రకరకాల టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి కానీ వాటిని దర్శకుడు వంశీ పైడిపల్లి కొట్టిపారేస్తున్నారు.

భరత్ అనే నేను తరహాలో ఇందులో కూడా మెసేజ్ ఉంటుందని సమాచారం. మహేష్ చేసిన 24 సినిమాల్లో వెంకటేష్ తో మాత్రమే మరో హీరోగా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత అల్లరి నరేష్ తో చేయటం ఆసక్తి రేపుతోంది. మహేష్ పాత్ర తీరుతెన్నులు, ఇద్దరు హీరోల మధ్య సినిమాలో ఉండే సంబంధం గురించి ఏవేవో బైట్స్ బయటికి వస్తున్నాయి కానీ కనీసం ఫస్ట్ లుక్ లేదా టీజర్ వస్తే తప్ప ఒక అంచనాకు రాలేం. దానికైనా చాలా టైం ఉంది లెండి. వెయిట్ చేయాల్సిందే.

దిల్ రాజు, అశ్విన్ దత్ లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 25వ సినిమా అనేది చాలా స్పెషల్ గా ఉండాలని కోరుకుంటున్నారు అభిమానులు. ఇప్పటికే మహేష్ 25వ చిత్రం మీద ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న మూవీ కనక హైప్ భీభత్సంగా ఉంది. ఆ అంచనాలను అందుకొనేలా ఫస్ట్ లుక్ ఉండాలని ఫ్యాన్స్ ఆకాంక్ష.

Share

Leave a Comment