సూపర్‌స్టార్ ఆవేదన

పర్యావరణ అసమతుల్యత ప్రస్తుతం ముంచుకొస్తున్న పెనుముప్పు అన్న సంగతి తెలిసిందే. నగరీకరణ నేపథ్యంలో అడవుల్ని నరికేయడం ప్రకృతి అసమతుల్యతకు కారణమవుతోంది. పైగా చెట్ల పెంపకం అన్నది మానవాళి మర్చిపోతుండడంపైనా హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఇలాంటి టైమ్ లో మరో ఊహించని ఉత్పాతం గుండెలు గుభేల్మనేలా చేస్తోంది.

మానవాళికి 20శాతం ఆక్సిజన్ ని అందిస్తున్న ప్రఖ్యాత అమెజాన్ రెయిన్ ఫారెస్ట్స్ (దక్షిణ అమెరికా) ధగ్ధం కావడం సంచలనంగా మారింది. ఈ విషయంలో టాలీవుడు నుంచి తొలిగా మేల్కొలుపు మాట చెప్పిన సూపర్ స్టార్ మహేష్ బాబు అందరికీ ఆదర్శంగా నిలిచారు. లోతుగా కలచివేసిన వార్త ఇది. మన భూగ్రహానికి ఊపిరితిత్తులు అని చెప్పుకునే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అగ్నికి ఆహుతి అవుతోంది.

20శాతం ఆక్సిజన్ అక్కడి నుంచే పర్యావరణంలోకి అందుతోంది. ఇది భూమిపై నివశించేవారంతా నిదుర లేవాల్సిన తరుణం అని గ్రహించాలి. అమెజాన్ కోసం ప్రార్థించండి అని సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు టాలీవుడు నుంచి. అమెజాన్ అడవులు తగలబడుతున్న ఒక దృశ్యం తాలూకు ఫోటోని కూడా మహేష్ తన ఫాలోవర్ల కోసం షేర్ చేశారు.

మన ప్లానెట్ ఊపిరి తిత్తులు తగలబడిపోతున్నాయ్! అంటూ మరో ట్వీట్ లోనూ మహేష్ ఆవేదన వ్యక్తం చేయడం చూస్తుంటే పరిస్థితి తీవ్రత ఏమిటో అర్థమవుతోంది. మన భూమిని కాపాడుకునేందుకు ఏదైనా చేయాలన్న తపన ఆయనలో వ్యక్తమైంది. పచ్చదనాన్ని కాపాడడం ప్రతి ఒక్క మనిషిలో ఒక ఉద్యమంగా మారాలని కోరుకుందాం. తొలిగా ఇంటి వద్దనే మనం పచ్చదనం పెంచే ఉద్యమం చేపడదాం!

అమెజాన్ అడవుల్లో 15రోజుల పైగా మంటలు వ్యాపిస్తుండటంతో అడవి దగ్దమవుతోంది. వేళాది హెక్టార్లలో విస్తరించిన చెట్లు అగ్ని దాటికి కాలి బూడిదవుతున్నాయి. దీంతో దగ్గరలోని ప్రాంతాలు పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నయి. అంతే కాదు ఈ ఏడాదిలో ఇప్పటికే అమెజాన్ లో దాదాపు 75వేల అగ్నిప్రమాదాలు సంభవించాయని బ్రెజిల్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ వెల్లడించింది.

వివరాలు.. బ్రెజిల్‌ కు చెందిన అమెజాన్ అడ‌వులు ప్ర‌తి ఏడాది రికార్డు స్థాయిలో ద‌గ్ధం అవుతున్నాయి. ఆ దేశానికి చెందిన స్పేస్ ఏజెన్సీ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. దీంతో సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, శాస్త్రవేతలు దీనిపై స్పందిస్తున్నారు. ఊపిరితిత్తులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి ఇప్పటికైనా మేల్కొని అమెజాన్ ని కాపాడుకుందాం అని పిలుపునిస్తున్నారు.

వాస్తవానికి అమెజాన్ అడవిలో కార్చిచ్చు కొత్తేమీ కాదు. అధిక ఉష్ణోగ్రత, తక్కువ మొత్తంలోని ఆర్థ్రత వల్ల అక్కడ కార్చిచ్చు రగులుకోవడం సర్వసాధారణం. అయితే, ఈసారి మాత్రం ఆ కార్చిచ్చు తీవ్ర స్థాయిలో రగిలిపోతోంది. నాసా అంతరిక్షం నుంచి తీసిన ఫొటోల్లో కార్చిర్చు స్పష్టంగా కనిపిస్తోందంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. ఈ ఫొటోలను నాసా సోషల్ మీడియాలో పెట్టడంతో చాలా మందికి తెలిసింది.

అమెజాన్ ఫారెస్ట్‌ను కాపాడండంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా వేడుకుంటున్నారు. అసలు, భూమికి ఊపిరితిత్తులుగా చెప్పుకునే అమెజాన్ అడవి తగలబడిపోతుంటే మీడియా మాత్రం దాన్ని పట్టించుకోవడంలేదని, కవరేజ్ చాలా తక్కువగా ఉందని కొంత మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మహేష్ బాబు చేసిన ఈ ట్వీట్‌కు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. వేల సంఖ్యలో ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు. #ప్రేఫర్‌ది్అమెజాన్ యాష్ ట్యాగ్ వైరల్ చేశారు. సినిమాల విషయానికొస్తే… ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ తొలిసారి ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించబోతున్నారు.

Share

Leave a Comment