మహేష్ క్రష్ ఎవరంటే..

సూపర్ స్టార్ మహేష్ ఫస్ట్ క్రష్ ఎవరి పైనో తెలుసా? ఇంతకీ ఏ వయసులో ఆయనకు ఫస్ట్ క్రష్ అయ్యిందో తెలుసా? తన ఫస్ట్ క్రష్ మ్యాటర్ ఏమిటో మహేష్ మాటల్లోనే వింటే తనకు 26 వయసు ఉన్నప్పుడు ఫస్ట్ క్రష్ అయ్యిందని ఆమె ఎవరో కాదు నమ్రత శిరోద్కర్ అని చెప్పాడు మహేష్.

ఆ తర్వాత తనతోనే లవ్ లో పడి పెళ్లాడేసిన సంగతి తెలిసిందే. ఈ జంటకు వివాహం జరిగి సుమారు 15 సంవత్సరాలు అయ్యింది. టాలివుడ్ లోనే థి బెస్ట్ కపుల్ గా పేరు సంపాదించికుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు పిల్లలు.

తాజా ఇన్ స్టా చిట్ చాట్ లో మహేష్ తన అభిమానులతో సంభాషిస్తున్నప్పుడు నమ్రతపై క్రష్ గురించి తనని నమ్రత ఎంతగా ప్రేమించిందో కూడా చెప్పారు. ఓ అభిమాని మాత్రం మీకు ఎవరి పై అయినా క్రష్ అయ్యిందా? అని అడిగారు. దానికి మహేష్ ఇలా జవాబు ఇచ్చాడు

తనకు 26 ఏళ్ళ వయసులో ఒకరిపై క్రష్ ఉందని వెల్లడించాడు. అయితే ఆ తర్వాత తనతో లవ్ లో ఉన్నానని తెలిపారు. భార్య నమ్రతా శిరోద్కర్ ను ట్యాగ్ చేసి తనపైనే నా క్రష్ అని తెలిపాడు. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అన్న ప్రశ్నకు తన భార్యను తన బెస్ట్ ఫ్రెండ్ అని తెలిపారు.

మహేష్ నమ్రతా శిరోద్కర్ తో కలిసి వంశీ చిత్రంలో నటించారు. ఈ చిత్రం షూటింగ్ ముగిసాక ఐదేళ్ల తర్వాత మహేష్ నమ్రత 2005 లో పెళ్లి చేసుకున్నారు. వీరి పిల్లలు గౌతమ్ ఆండ్ సితార కి నెటిజన్స్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది అని అందరికీ తెలిసిందే.

చాలా రకాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు మహేష్. తాను కాలి సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాడనేది. ఇంకా సర్కారు వారి పాట సినిమా థీమ్ గురించి కూడా తెలిపాడు. ఇందులో అన్ని కమర్షియల్ ఎలెమెంట్స్ తో పాటు స్ట్రాంగ్ మెసేజి కూడా ఉంటుందని తెలిపారు.

ఇక పూరి జగన్నాథ్ సినిమాతో ఎప్పుడనే సందేహంపై కూడా స్పంధించారు. తప్పకుండా ఆయనతో వర్క్ చేస్తానని పూరి గారు ఎప్పుడు కథ చెబుతారా అని వెయిట్ చేస్తున్నట్లు చెప్పాడు. ఇంక రాజమౌళి గారి సినిమా కోసం తాను కూడా ఎదురుచూస్తున్నాను అని సమాధనం ఇచ్చాడు.

ఇటీవల మహమ్మారీ నిర్భంధ సమయంలో మహేష్ భార్యా పిల్లలతోనే సమయాన్ని గడిపారు. సరిలేరు నీకెవ్వరు తర్వాత కొంత గ్యాప్ తీసుకుని తాజాగా సర్కార్ వారి పాట చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Share

Leave a Comment