మొదటి సినిమా నుంచి

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన కెరీర్ 26వ చిత్రమిది. ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా సరిలేరు నీకెవ్వరు సినిమాను నిర్మిస్తున్నారు.

కశ్మీర్ షెడ్యూల్ అనంతరం హైదరాబాద్ లో కీలక షెడ్యూల్ ని తెరకెక్కించారు. మహేష్ కెరీర్ బెస్ట్ ఎంటర్ టైనర్ ని అందిస్తున్నామని అనిల్ రావిపూడి సినిమా ప్రారంభం అయ్యిన రోజునే వెల్లడించారు. తొలిసారి మహేష్ ఓ మిలటరీ అధికారిగా నటిస్తుండడం ఈ చిత్రంతోనే చాలా గ్యాప్ తర్వాత విజయశాంతి రీఎంట్రీ ఇస్తుండడం ఆసక్తిని పెంచుతోంది.

తాజాగా మహేష్ ఆన్ లొకేషన్ ఫోటో ఒకటి షేర్ చేసి నాటి జ్ఞాపకాల్లోకి వెళ్లారు. త్రోబ్యాక్ గురువారం అంటూ ఆయన శైలిలో స్పందించారు. ఇదిగో మీ అందరికీ పరిచయం చేస్తున్నా, ఈయనే నా సౌండ్ రికార్డిస్ట్ నగారా రాము. ఆయన్ని మేము ఇలానే పిలుస్తాం. నా మొట్ట మొదటి సినిమా నుంచి నా సినిమాలకు పని చేస్తున్నారు.

ఆయన్ని నాతో తప్ప వేరొక సెట్ లో నేనెప్పుడూ చూడలేదు. నాతో అన్నివేళలా నా కోసం ఉన్నందకు ఆయనంటే నాకు ప్రేమ మరియు గౌరవం. మేమిద్దరం కలిసి ఉన్న కొన్ని ఫొటోలను మీకోసం పోస్ట్ చేస్తున్నాను. అన్న తమ్ముడు సినిమా అప్పటి నుంచి మహర్షి, సరిలేరు నీకెవ్వరు అన్నిటికీ ఆయన ఉన్నారు అంటూ వివరాల్ని వెల్లడించారు మహేష్.

మహేష్ బాబు మనసు వెన్న.. ఈ మాట చాలా మంది అంటుంటారు. ముఖ్యంగా ఆయనతో కలిసి పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్స్ నుంచి ఈ మాట ఎక్కువగా వినిపిస్తుంటుంది. వాళ్లు మహేష్‌ను అంతగా ఎందుకు పొగుడుతారో తాజాగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఈ పోస్ట్ చూస్తే ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది.

1)

2)

3)

సాధారణంగా మనం తెరపై కనిపించే హీరోహీరోయిన్లు, నటీనటులను మాత్రమే పట్టించుకుంటాం. మహా అయితే దర్శకుడు, సంగీత దర్శకుడు, నిర్మాతను గుర్తుపెట్టుకుంటాం. కానీ, ఒక సినిమా కోసం తెర వెనుక కొన్ని వందల మంది పనిచేస్తారు. వాళ్లను సినిమాలో నటించే హీరోహీరోయిన్లు కూడా పెద్దగా గుర్తుపెట్టుకోరు. కానీ, మహేష్ బాబు తనకు సెట్‌లోని సౌండ్ రికార్డిస్ట్ అంటే ఇంత ఇష్టం అని చెప్పడం నిజంగా గొప్ప విషయం.

తన దగ్గర పనిచేసే ఒక టెక్నీషియన్ గురించి మహేష్ ఇంత గొప్పగా చెప్పారటంటే రాము అంటే ఆయనకి ఎంత ప్రత్యేకమో అర్థమవుతోంది. ఒక హీరోతో కలిసి అన్ని సినిమాలకు పనిచేయడం అంటే గ్రేట్ అని చెప్పాలి. సినిమా షూటింగ్ లో వాయిస్ ను రికార్ట్ చేయడం చాలా కష్టమైన పని. దానిని విజయవంతంగా చేస్తున్న వ్యక్తి నగారా రాము.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్న మహేష్ బాబు తాజాగా ముంబయి ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు. ఒక యాడ్ షూట్ కోసం మహేష్ ముంబయి వెళ్లినట్లుగా సమాచారం. ఎయిర్ పోర్ట్ లో చాలా సింపుల్ గా క్యాజువల్ డ్రస్ లో బ్లాక్ క్యాప్.. బ్లాక్ గ్లాసెస్ పెట్టుకుని బ్లూ షర్ట్ అండ్ జీన్స్ వేసుకుని నడుసుకుంటూ వెళ్లాడు.

అక్కడ మహేష్ బాబును ఫొటోలు తీసేందుకు జనాలు ఎగబడ్డారు. అదే సమయంలో కొందరు ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు ముచ్చట పడ్డారు. ముంబయి ఎయిర్ పోర్ట్ లోని మహేష్ బాబు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైట్ స్కిన్ టోన్ తో మహేష్ బాబు బ్లూ డ్రస్ లో అదిరిపోయాడు.

Share

Leave a Comment