తమ్ముడు తారక్ దగ్గర నుంచి నేర్చుకున్నాను

భరత్‌ అనే నేను సినిమా ప్రొమోషన్స్‌లో భాగంగా ‘బహిరంగ సభ’ పేరుతో ఎల్‌బీ స్టేడియంలో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా ‘కృష్ణగారి అబ్బాయినైన నేను అంటూ’ మహేష్‌బాబు ప్రసంగం ప్రారంభించారు.

తమ్ముడు తారక్‌ దగ్గర ఇటువంటి మాటలు నేర్చుకున్నాను అని సరదాగా అన్నారు. దీంతో స్టేడియం దద్దరిల్లిపోయింది. అందరూ కరతాల ధ్వనులతో మహేష్ తారక్ మధ్య ఉన్న చనువుని అభినందించారు.

అభిమానుల ఆనందం చూస్తుంటే ఇది ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లా లేదని, 100 రోజుల ఫంక్షన్‌లా అనిపిస్తోందని మహేష్‌ అన్నారు. తమ్ముడు తారక్ ఈవెంట్ కి వచ్చి మా మధ్య ఉన్న సాన్నిహిత్యం ని మీ అందరికి తెలియజేసారు అని కొనియాడారు.

‘ఆది’ సినిమా ఆడియో వేడుకకు చాలా కాలం క్రితం నేను వెళ్లాను. ఇప్పుడు ఈ సినిమా వేడుకకు తారక్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక నుంచి ఫంక్షన్ల ట్రెండ్ మారుతుందని భావిస్తున్నాని మహేష్‌ అభిప్రాయపడ్డారు.

అందరు హీరోలు ఒకరి దగ్గరికి మరొకరు వెళతారు. ఇండస్ట్రీలో అందరి సినిమాలూ హిట్‌ అవ్వాలని ఆకాంక్షించారు. ‘మేమూ మేమూ బాగుంటాం, మీరూ కూడా బాగుండాల’ని సూచించారు.

ఇండస్ట్రీలో తిప్పి కొడితే అయిదారుగురు హీరోలం ఉన్నాం. ఏడాదికి ఒకే సినిమా చేస్తాం. అందరం కలిసుండాలనుకుంటున్నాను. మన టాలివుడ్ ని అందరు కలిసికట్టుగా ఇంక పైకి తీసుకెళ్ళి ఒక బెంచ్ మార్క్ గా నిలపాలి అని అభిప్రాయపడ్డారు.

రాజకీయ నేపథ్యంలో సినిమా అంటే ముందు బయపడ్డానని మహేష్‌ చెప్పారు. ఈ సినిమాలో నా పాత్ర సీఎం అని శివ గారు చెప్పినప్పుడు నాకు వణుకు వచ్చింది. కానీ కథ చెప్పినప్పుడు ఇన్స్పిరేషన్‌గా అనిపించిందని అన్నారు.

నా సినిమాల్లో నేను అత్యున్నతమైన పర్ఫార్మెన్స్ కనబరిచిన సినిమా ఇది. నా కరీర్ లో శ్రీమంతుడి లాగానే ఈ సినిమా కూడా ఒక టర్నింగ్‌ పాయింట్‌గా భావిస్తున్నానని మహేష్‌ పేర్కొన్నారు.

ఏప్రిల్ 20 మా అమ్మ ఇందిరమ్మ గారు పుట్టినరోజు. అమ్మ ఆశీస్సులు, దీవెనలకు మించినవేవీ ఉండవంటారు! ఆ రోజున నా సినిమా విడుదలకానుండటం నాకు చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు.

Share

Leave a Comment