మహర్షి పై పిల్లల రియాక్షన్

‘మహర్షి’ సినిమాతో మాంచి ఊపు మీదున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. డైరెక్టర్ వంశీ పడిపైల్లి ఈ సినిమాను తెరకెక్కించగా అశ్వనీదత్ – పీవీపీ – దిల్ రాజు నిర్మాతలుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ కలెక్షన్లతో పాటు ప్రేక్షకుల ప్రశంసలతో ప్రదర్శితమవుతోంది.

మహేష్ కెరీర్లోనే మొదటిసారి అగ్రెసివ్ ప్రమోషన్ లో యాక్టివ్ గా పాల్గొంటున్నాడు. నాన్ స్టాప్ గా పబ్లిసిటీ ప్రోగ్రాంస్ లో భాగమవుతున్నాడు. అందులో భాగంగా రైతులతో ముచ్చటించిన సూపర్ స్టార్ ఇప్పుడు స్టూడెంట్స్ తో కూడా చర్చలో పాల్గొన్నాడు. వారితో జరిగిన సంభాషణలో వివిధ ప్రశ్నలకు జవాబిచ్చారు.

రైతులు, అభిమానులు ఇంతగా మెచ్చిన మహర్షి స్వయానా మహేష్ పిల్లలు గౌతం సితారలకు ఎలా అనిపించింది అనే సందేహం రావడం సహజం. అలాంటి సందేహమే వచ్చిన ఒక కుర్రాడు మహేష్ కు ఈ ప్రశ్న వేసేసాడు. దానికి స్వయానా ప్రిన్స్ సమాధానం ఇచ్చాడు. ఇందులో వ్యవసాయం అనే కాన్సెప్ట్ కి ఇద్దరూ బాగా కనెక్ట్ అయ్యారట.

సినిమా అయ్యాక సితార కళ్ళలో నీళ్ళు కనిపించాయని గౌతం గట్టిగా కౌగిలించుకున్నాడని వాళ్ళ సంతోషాన్ని చూసాక తన నమ్మకం రెట్టింపు అయ్యిందని చెప్పాడు. అంతే కాదు రెండేళ్ళ క్రితం మహర్షి చేశాక ఇప్పటికి తన ఆలోచన ధోరణిలో మార్పు వచ్చిందని మూలాలు తెలుసుకునే ఆసక్తితో పాటు ఏడాదికి ఒకసారైనా పల్లెటూరికి వెళ్ళాలన్న కాంక్ష రగిలించిందని చెప్పాడు సూపర్ స్టార్.

మొత్తానికి తన అభిమానుల్లోనే కాక తనలోనూ మార్పును తెచ్చిన మహర్షి పట్ల మహేష్ ఎగ్జైట్ మెంట్ కొనసాగుతూనే ఉంది.మహర్షి కి దక్కుతున్న ప్రశంసలతో అభిమానుల ముందు మహేష్ తన కాలర్ ను కూడా ఎగరేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ తాను కాలర్ ఎందుకు ఎగరేయాల్సి వచ్చిందో చెప్పారు.

‘రిలీజ్ తరువాత నేను రెండుసార్లు కాలర్ ఎగరేయడం ప్లాన్ ప్రకారం చేసింది కాదు. నేనేంటో అందరికీ తెలుసు. నా ఎమోషన్స్‌ని ఫ్యాన్స్‌తో పంచుకున్నానంతే. ఆ రోజు చాలా మాట్లాడాలి అనుకున్నాను. అవన్నీ నా హార్ట్‌లో నుండి వచ్చిన మాటలే. సుదర్శన్ థియేటర్ కి వెళ్లాక ఇక్కడ కదా నేను సినిమా చూడాల్సింది అనిపించింది అందుకే కాలర్ ఎగరేశా’ అంటూ చెప్పుకొచ్చారు మహేష్ బాబు.

మహేష్ నటన, పైడిపల్లి ఎంచుకున్న థీమ్ కి ప్రముఖులు సహా కామన్ జనాల నుంచి ప్రశంసలు దక్కాయి. మహర్షి సినిమాను ప్రశంసిస్తూ పలువురు స్టార్స్ తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చగా ఏకంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కూడా సోషల్ మీడియా వేదికగా మహర్షి సినిమాపై తన స్పందనను తెలిపారు.

ఇది మహర్షి సాధించిన మరో ఘనతగా చెప్పుకోవచ్చు. సాధారణంగా ఇంత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఓ రీజనల్ సినిమా గురించి స్పందించడం అరుదు. అలాంటిది భారతదేశపు రెండో పౌరుడు ఇలా కాంప్లిమెంట్ ఇవ్వడం అంటే మాటలా. ఈ సినిమాలో ఎంత గొప్ప సందేశం ఉందో మహర్షి సినిమాకు వస్తున్న ప్రశంసలతో మనం చెప్పవచ్చు.

ఇంత మచి ప్రశంసలు దక్కుతున్న మహర్షి సినిమా కోసం సూపర్ స్టార్ కాలర్ ఎగరేయడంతో తప్పే లేదు. కలెక్షన్ల తో పాటు ప్రశంసలు కూడా దక్కిన నేపథ్యంలో మహర్షి గ్రాండ్ సక్సెస్ మీట్ విజయవాడలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడి సిద్ధార్థ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్ దీనికి వేదిక కాబోతోంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఈ గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్‌కు మహర్షి టీమ్ మొత్తం హాజరు కాబోతున్నారు. ఇక మహేష్ ఇప్పటికే ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. మహర్షి ప్రచారంలో భాగంగా ఇప్పటికే ఈ వెకేషన్ ని వాయిదా వేశారు. ప్రస్తుతం కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లేందుకు మహేష్ ప్లాన్ చేశారని తెలుస్తోంది.

అట్నుంచి రాగానే నెక్ట్స్ సినిమాల సంగతేంటి? అన్నది ఆలోచిస్తారు. విదేశీ టూర్ ముగించుకుని రాగానే జూన్ లో అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాని ప్రారంభిస్తారు. ఈ సినిమా స్క్రిప్టు ఇప్పటికే పూర్తయింది. ప్రీప్రొడక్షన్ పనుల్లో దర్శక నిర్మాతలు బిజీబిజీగా ఉన్నారు. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

Share

Leave a Comment