మహేష్ కు నచ్చింది!

నటి, నిర్మాత మంజుల ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ‘మ‌న‌సుకు న‌చ్చింది’.

ఇటీవ‌ల‌ ప్రీ-లుక్ పోస్టరుని, ప్రీ-లుక్ టీజరుని విడుదల చేసిన యూనిట్. మంగ‌ళ‌వారం ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌ని రిలీజ్ చేసింది.

‘మనసుకు నచ్చింది’ చిత్రం టీజర్‌ను మంగళవారం మధ్యాహ్నం సినీ ప్రముఖులు కృష్ణ, రాఘవేంద్రరావు విడుదల చేశారు.

దీన్ని మంజుల సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. ఇది గాఢమైన ప్రేమకథ అని ట్వీట్‌ చేశారు.

ఈ టీజర్‌ను చూసిన సూపర్‌స్టార్‌, మంజుల సోదరుడు మహేష్ బాబు ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

టీజర్‌ చాలా ఫ్రెష్‌ , కూల్‌గా ఉందని అన్నారు. మంజులకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.

ప్ర‌కృతి ప్రేమికురాలు అయిన క‌థానాయిక‌ అమైరా ద‌స్త‌ర్‌.. ఆమె స్నేహితుడు సందీప్ కిష‌న్ తో చేసే సంభాష‌ణ‌గా ఈ టీజ‌ర్ రూపొందింది.

‘ప్రతి మనిషిలో ప్రపంచం అంత ప్రేమ ఉంటుంది రా. కానీ 0.1 శాతం కూడా బయటికి రావట్లేదు. ఒకసారి మన హార్ట్‌తో మనం కనెక్ట్‌ అయితే ఆ ప్రేమంతా పరిచయం అవుతుంది’ అనే అమైరా డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభమైంది.

ఆమె ఇలా అన్న వెంటనే సందీప్‌ నువ్వు ప్రేమలో ఉన్నావా? అని ప్రశ్నించారు. దీనికి ఆమె అవును అనే సరికీ.. ‘నాకు తెలియకుండా ఎవరితోనే?’ అని ఉత్సుకతతో అడగడంతో టీజర్ ముగుస్తుంది.

“మంజుల కథ, డైలాగ్స్‌ కూడా రాసుకుని డైరెక్షన్‌ చేస్తుందని నాకు తెలియదు. ఈ సినిమా కథ నాకు తెలియదు.

అయితే, ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ చాలా బాగుంది. కచ్చితంగా సినిమా సూపర్‌హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని సూపర్‌స్టార్‌ కృష్ణ అన్నారు.

ఈ టీజరులో అందమైన లొకేషన్స్ ని అంతే అందంగా తన కెమెరాలో బంధించారు సినిమాటోగ్రాఫర్ రవియాదవ్.

లొకేషన్స్ ఎంత అందంగా ఉన్నాయో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతే అందంగా, రొమాంటిక్ గా ఇచ్చారు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ర‌థ‌న్.

“విజువల్స్ ఎంజాయ్ చేయండి. వాటిని చిత్రీకరిస్తున్నప్పుడు నేను చాలా ఎంజాయ్ చేసాను. ఇది మీకోసమే” అంటూ ట్వీట్ చేసారు మంజుల.

సందీప్‌ కిషన్‌, అమైరా దస్తూర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘మనసుకు నచ్చింది’. ఆనంది ఆర్ట్స్‌, ఇందిరా ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

సినిమాని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26, 2018న విడుదల చేయబోతున్నారు.

Share

Leave a Comment