ఫ్యాన్స్‌కు ట్రిబ్యూట్

కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘పేట’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల అయింది. రజనీ తన స్టైల్‌తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు విదేశాల్లో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. రీసెంట్ గా 2.0తో అల‌రించిన ర‌జ‌నీకాంత్ పేట తో మన ముందుకు వచ్చారు.

ఈ సినిమా పై పలువురు సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా సూపర్‌స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఈ చిత్రం పై తన స్పందన ను అదిరిపోయే రీతి లో తెలియజేశారు. ట్విట్టర్ ద్వారా ఆయన రజనీకాంత్ కు, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కు, సినిమాటోగ్రాఫర్ తిరు కు, చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.

‘పెట్టా సినిమా అందరి రజనీకాంత్ ఫ్యాన్స్ కు ఒక ట్రిబ్యూట్ లాంటిది, నా లాంటి ఫ్యాన్ తో కలిపి. ఒకే ఒక్క మాట చెప్పగలను, తలైవా. మనకు ఉన్న అద్భుతమైన టాలెంట్ ల్లో నిస్సందేహంగా కార్తీక్ సుబ్బరాజ్ ఒకరు. ఎప్పటిలాగే సినిమాటోగ్రాఫర్ తిరు వర్క్ ఔట్‌స్టాండింగ్.

మొత్తం సినిమా బృందానికి ధన్యవాదాలు’ అని ట్వీట్ చేసి దానితో పాటు ‘రజనిఫైడ్’ అని హ్యాష్ ట్యాగ్ ను వాడారు మహేష్. తాను ఒక సూపర్ స్టార్ అయ్యుండి కూడా తను రజనీకాంత్ కు ఎంత పెద్ద ఫ్యానో ఈ ట్వీట్ తో తెలెయజేసారు మహేష్ బాబు.

సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాల విషయంలోనే కాకుండా ఇతర సినిమాల విషయంలో కూడా సోషల్ మీడియా ద్వారా స్పందన తెలియజేస్తూ ఉంటారు. మహేష్ కు ఏ సినిమా అయినా నచ్చితే తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఆ విషయాన్ని అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.

సంక్రాంతి కానుకగా వచ్చిన తొలి సినిమా ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ను తొలి రోజే చూసేసి సాయంత్రానికల్లా ట్వీట్ చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు. 24 గంటలు గడవకముందే ఇంకో సినిమా గురించి మహేష్ ట్వీట్ పడిపోయింది. ఆ సినిమానే సూపర్ స్టార్ రజనీకాంత్ ‘పేట’.

మహేష్ బాబు ఒకప్పుడు ఎంత రిజర్వ్డ్గా ఉండేవాడో తెలిసిందే. ఎప్పుడైనా మీడియా ముందుకు రావడం గగనంగా ఉండేది. తన సినిమాల వేడుకల్లో కూడా పాల్గొనడమూ కష్టమే. సామాజిక మాధ్యమాల్లోనూ యాక్టివ్ గా ఉండేవారు కాదు. కానీ గత కొన్నేళ్లలో మహేష్ చాలా మారిపోయారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యారు.

తన సినిమాల గురించే కాదు వేరే వాళ్ల చిత్రాల గురించి కూడా స్పందిస్తున్నారు మహేష్. అందులోనూ ఈ మధ్య రిలీజైన ప్రతి సినిమాకూ మహేష్ రివ్యూ ఇచ్చేస్తున్నారు. సోషల్ మీడియాలో మహేష్ ఇంత యాక్టివ్ గా ఉండడంతో అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు.

భరత్ అనే నేను తరువాత మహేష్ బాబు చేస్తున్న సినిమా మహర్షి. ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కాబోతున్నది. సినిమాకు సంబంధించిన కొన్ని పోస్టర్ లు, ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఇవి బాగా ఆకట్టుకోవడంతో నెక్స్ట్ ఏంటి అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. వంశి పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

మూడు వేరియేషన్స్ లో మహేష్ కనిపించనున్నారని ఫిలిం నగర్ టాక్. మహేష్‌ పాత్ర మనసుకి హత్తుకునేలా ఉండబోతోందని, స్నేహం, ప్రేమ, త్యాగం ఈ అంశాల చుట్టూ ఈ సినిమా సాగనుందని సమాచారం. చాలా ప్రేస్టేజియస్‌గా తెరకెక్కిస్తున్నాడు వంశీ పైడిపల్లి. ఈ సినిమా తరువాత మహేష్ సుకుమార్ తో సినిమా చేసేందుకు కమిట్ అయిన సంగతి తెలిసిందే.

Share

Leave a Comment