మేమంతా ఒకటే గ్యాంగ్

ఓ వైపు సరిలేరు నీకెవ్వరు ఫీవర్ నడుస్తూ ఉంటే మహేష్ బాబు కూతరు సితార, వంశీ పైడిపల్లి కూతురు ఆద్యలతో కలిసి రష్మిక అల్లరి చేస్తోంది. సితార, ఆద్యలు సొంతంగా ఓ యూబ్యూబ్ చానెల్ కూడా మెయింటెన్ చేస్తారన్న సంగతి తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్స్‌లో భాగంగా వీరి చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఈ క్రమంలో ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సితార, ఆద్య కలిసి ఏ అండ్‌ ఎస్‌ అనే యూట్యూబ్‌ ఛానెల్‌ స్టార్ట్‌ చేశారు. తొలుత త్రీ మార్కర్‌ ఛాలెంజ్‌ అంటూ తొలి వీడియో పోస్ట్‌ చేసిన వీర్దిదరూ.. అనంతరం పలు ఆసక్తికర వీడియోలను పోస్ట్‌ చేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకున్నారు. అంతేకాకుండా డిఫరెంట్‌ కంటెంట్‌ వీడియోలను షేర్‌ చేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్నారు.

తాజాగా సితార, ఆద్యలు ఇద్దరూ కలిసి రష్మిక మందాన్నను ఇంటర్వ్యూ​ చేశారు. ఈ క్రమంలో సరిలేరు నీకెవ్వరు చిత్ర విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇక మహేష్ సైతం ఈ వీడియోను తన ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ ఈ ముగ్గురి ఎనర్జీ, ఉత్సాహం తనను ఆశ్చర్యపరిచిందని అన్నాడు.

రాబోయే తరం పిల్లలు వారి ఎనర్జీ వారి ఉత్సాహం నన్నెప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. రష్మిక నువ్వు కూడా వారితో సమానమే. మీ ముగ్గురి కలిసి చేసిన ఈ అల్లరి బాగుంది. రాక్ ఆన్ యూ గర్ల్స్. అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు రష్మకి రిప్లై ఇస్తూ.. సర్ ఇప్పుడైనా ఎప్పుడైనా మేమంతా ఒక్కటే. గర్ల్స్ గ్యాంగ్ అంటూ క్యూట్‌గా చెప్పుకొచ్చింది.

ఈ ఇంటర్వ్యూలో సరిలేరు విశేషాలతో పాటు 2020 రష్మిక ప్లానింగ్స్ తదితర విషయాల్ని ముచ్చటించారు. స్టార్ డాటర్స్ తో పాటు రష్మిక కూడా క్యూట్ కిడ్ గా మారి పోయింది. సరిలేరు చిత్రం లోని సూపర్ హిట్ సాంగ్ హీ ఈజ్ సో క్యూట్ కి ఆ ముగ్గురూ స్టెప్పులేశారు. ఈ వీడియో సూపర్ క్యూట్ అంటూ అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు.

అనంతరం సింగిల్ స్క్రీన్ థియేటర్ లో షో చూసేందుకు సితార తనతో పాటు రావాలని రష్మిక అడిగింది. దీంతో వెంటేనే సితార నో ఛాన్స్ అన్నట్లు ఓ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. చివరికి ఎలాగూ రష్మిక సితారను కన్విన్స్ చేసేసింది. మొత్తానికి స్టార్ కిడ్స్ యూట్యూబ్ చానెల్ రాకెట్ స్పీడ్ తో దూసుకెళ్లడం ఖాయంగానే కనిపిస్తోంది.

సంక్రాంతి సెలవులు కావడంతో సరిలేరు నీకెవ్వరూ సినిమాకు భారీగా కలెక్షన్లు వస్తున్నాయి. బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చుకుని కలెక్షన్స్ లో కొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతుంది. దీంతో మహేష్ బాబు తాజాగా తన ఇంట్లో ఈ చిత్ర యూనిట్ మెంబర్స్ కి పెద్ద పార్టీ ఇచ్చేశాడు. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి

సరిలేరు రిలీజ్ అయిన తర్వాత ఇచ్చిన ఈ పార్టీలో దర్శకుడు అనిల్ రావిపూడి నిర్మాత దిల్ రాజు సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ హీరోయిన్ రష్మిక దర్శకుడు పైడిపల్లి వంశీ నమ్రత అనిల్ సుంకర తదితరులు సందడి చేశారు. ఈ సందర్భంగా తీసుకున్న సెల్ఫీని మహేష్ బాబు తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు.


మహేష్ సోషల్ మీడియాలో ఫొటో షేర్ చేస్తూ బ్లాక్ బస్టర్ పార్టీ కంటిన్యూస్.. సరిలేరు నీకెవ్వరు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇలా తనకు దక్కిన విజయాన్ని అందరితో పంచుకున్నారు. దీని బట్టి చూస్తే సరిలేరు నీకెవ్వరు టీం ఎంతో ఆనందంగా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అభిమానులు కూడా వీరిని చూసి ఖుషీ అవుతున్నారు.

సంక్రాంతి పండుగ వేళ ప్రేక్షకులకు ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేలా తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఓపెనింగ్స్‌ భారీ స్థాయిలో ఉండటంతో సరిలేరు నీకెవ్వరు వందకోట్ల మార్క్‌ను అవలీలగా దాటేసి ప్రస్తుతం సంచలన రికార్డులని క్రియేట్ చేస్తూ దూసుకెల్తుంది.

Share

Leave a Comment