ఇంతకంటే గొప్ప బహుమతి ఉండదు..

కుటుంబానికి మహేష్ బాబు ఎంత విలువిస్తాడో, ఎంత ప్రేమిస్తాడో అందరికీ తెలిసిందే. పిల్లలతో కలిసి సమయం గడపడమంటే మహేష్ బాబుకు మరీ ఇష్టం. ఇంట్లో వారితో కలిసి మహేష్ చేసిన అల్లరిని నమ్రత సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉన్నారు

సీతూపాపను నవ్వించేందుకు మహేష్ రకరకాల విన్యాసాలు చేసేవాడు. పిల్లలతో వెరైటీ గేమ్స్ ఆడేవాడు. ఇలా లాక్ డౌన్ అంతా తన పిల్లలతో కలిసి ఎంచక్క ఎంజాయ్ చేశాడు. తాజాగా అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మహేష్ బాబు ఎమోషనల్ అయ్యాడు

కూతురు కన్నా గొప్ప బహుమతి ఇంకేమీ లేదు అని అంటున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ సృష్టిలో ఆడ-మగ సమానమేనని చెబుతూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆడపిల్లలు దృఢంగా ఉండాలన్నారు

తమ కలలను సాకారం చేసుకోవడానికి కష్టపడాలని సూచించారు. ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే (అంతర్జాతీయ ఆడపిల్ల దినోత్సవం) సందర్భంగా తన గారాపట్టి సితార ఫొటోనూ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ ఈ పోస్ట్ చేశారు మహేష్ బాబు

ఓ కూతురు పుట్టడం కంటే గొప్ప బహుమతి ప్రపంచంలో మరొకటి ఉండదు. నా చిట్టి పాపని చూసి ఎంతో గర్విస్తుంటాను. నా పాప తనకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్ చేసుకుంటుంది. తన కాళ్ల పై తాను నిలబడాలనుకుంటుంది. మీ కలలను ఎన్నడూ తిరస్కరించం

మీ మాట వింటాను. స్ట్రాంగ్‌గా ఉండు. నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే దాని కోసం పోరాడు. సమానత్వంతో కూడిన ప్రపంచాన్ని మనం ఏర్పరుచుదాం. నా చిన్నారి పాపతో పాటు ఈ ప్రపంచంలో ఉన్న బాలికలంతా సెలబ్రేట్ చేసుకుంటోన్న రోజు ఇది

మీ కోసం ఈ ప్రపంచంలో సమానత్వాన్ని క్రియేట్ చేస్తామంటూ సితార పై, బయట ఉన్న పిల్లలందరి పై మహేష్ ఈ విధంగా ప్రేమను కురిపించాడు. అలాగే ప్రపంచంలో స్త్రీ, పురుషులకు సమాన హక్కులు ఉండేలా అందరూ కృషి చేయాలని కూడా పేర్కొన్నారు

ఇదిలా ఉంటే, మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్నారు. పరుశురామ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. దర్శకుడు పరుశురామ్ మహేష్ ని ఈ చిత్రంలో ఓ భిన్నమైన పాత్రలో ప్రెజెంట్ చేయనున్నాడని తెలుస్తుంది

దర్శకుడు పరశురామ్ తో మొదటి సారి మహేష్ నటిస్తుండగా ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి ముందు వరుసగా మూడు భారీ హిట్లు అందుకున్న మహేష్ దీనితో ఇంకో హ్యాట్రిక్ కు నాంధి పలకడానికి రెడీగా ఉన్నారు

Share

Leave a Comment