అతడిని చూసి గర్వపడుతున్నా

విలక్షణ దర్శకుడు చిత్రాన్ని రూపొందించడంతో ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి నెలకొంది. సినిమా ప్రోమోలు కూడా అంచనాలు పెంచాయి. అలాంటి దర్శకుడితో పని చేయడం పట్ల.. సినిమా ఔట్ పుట్ విషయంలో సుధీర్ చాలా ఎమోషనల్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ‘సమ్మోహనం’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఆ ఉద్వేగాన్నంతా చూపించాడు సుధీర్.

ముందు మహేష్ గురించి మాట్లాడటం మొదలుపెట్టి.. గడ్డంతో ఉన్న అతడి న్యూ లుక్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సుధీర్. ఆ తర్వాత ‘సమ్మోహనం’ గురించి మాట్లాడుతూ..ఈ సినిమాలో పని చేసిన అనుభవం గురించి చాలా మాట్లాడాలనుకున్నానని.. కానీ ఇప్పుడు మాటలు రావట్లేదని..వెంటనే ఇంద్రగంటి దగ్గరికెళ్లి గట్టిగా హత్తుకున్నాడు. ఆ తర్వాత ప్రసంగం కొనసాగించలేక మైక్ ఇచ్చేసి పక్కకు వెళ్లిపోయాడు.

ఇక సుధీర్ బాబు గురించి మహేష్ మాట్లాడుతూ.. తాను కానీ.. తమ కుటుంబ సభ్యులు కానీ..సుధీర్ బాబుకు మొదట్నుంచి ఎలాంటి సపోర్ట్ ఇవ్వట్లేదని.. కేవలం ఆడియో వేడుకలకు రావడం తప్పితే తాము చేస్తున్నది ఏమీ లేదని వెల్లడించాడు.

సుధీర్ తన కష్టంతో ఎదుగుతున్నాడని, సొంతగా ఈ స్థాయికి వచ్చాడు, అతడిని చూస్తే తనకు చాలా గర్వంగా ఉంటుందని మహేష్ చెప్పాడు. సుధీర్ మాట్లాడుతున్నపుడు ఎమోషనల్ అయిపోవడం గురించి స్పందిస్తూ.. నా సినిమా వేడుకలకు వచ్చినపుడు స్పీచులు ఇరగ్గొట్టేస్తుంటాడని.. కానీ తన సినిమా వేడుకలో మాత్రం సెంటిమెంటల్ అయిపోయాడని మహేష్ చమత్కరించాడు.

తర్వాత ఇంద్రగంటి మైక్ తీసుకుని.. నువ్వు తమ సినిమాలోని ఒక ఎమోషనల్ సీనే ఇక్కడ చూస్తున్నట్లుగా ఉంది అన్నాడు. ప్రసంగం కొనసాగించాలని ఇంద్రగంటి అన్నా సుధీర్ నా వల్ల కాదనేశాడు. సుధీర్ ది చాలా సున్నిత మనస్తత్వమని.. అందుకే ఇలా ఎమోషనల్ అయిపోతున్నాడని చెప్పాడు. తాను పని చేసిన వాళ్లలో అత్యంత నచ్చిన నటుల్లో సుధీర్ ఒకడని ఇంద్రగంటి కాంప్లిమెంట్ ఇచ్చాడు.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసం మహేష్‌ డిఫరెంట్‌గా, హెయిర్‌ స్టయిల్‌ను పూర్తిగా మర్చేసి మేకోవర్‌ ఛేంజ్‌ చేశాడు. మొన్న ఎయిర్‌ పోర్ట్‌లో రఫ్‌ లుక్‌తో ఆకట్టుకున్న మహేష్‌ సమ్మోహనం ప్రి రిలీజ్ ఈవెంట్‌లో చాలా కూల్‌గా కనిపించారు.

‘భరత్‌ అనే నేను’ తర్వాత అభిమానులను కలవడం ఇదే. మీ అశీసులు, అభిమానం ఇలాగే ఉండాలి. సుధీర్‌ సినిమా ని కూడా పెద్ద హిట్‌ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు.

Share

Leave a Comment