ద‌టీజ్ మ‌హేష్ ..!!

ద‌ర్శ‌కుడు లేక‌పోతే సినిమా లేదు. ద‌ర్శ‌కుడిని అందుకే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని గౌర‌విస్తారు. ఒక సినిమాకి హీరో నిర్మాత ల‌తో సింక్ అయ్యి ద‌ర్శ‌కుడు ప‌ని చేయాల్సి ఉంటుంది. అందుకే టీమ్ లో అత‌డి ప్రాధాన్య‌త వేరుగా ఉంటుంది. సెట్స్ లో ద‌ర్శ‌కుల‌కు నటీనటులకు ఉండే అనుబంధం చాలా గట్టిగానే ఉంటుంది.

దర్శకుడు చెప్పింది పాటిస్తే చాలు ఆ సన్నివేశం పండినట్లే. అందుకే దర్శకులకు నటీనటులు చాలా గౌరవం ఇవ్వాల్సిన విషయం. ఇక ఈ విష‌యంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఎంతో నిబద్దతో ఉంటారాని స‌న్నిహితులు చెబుతుంటారు. అది తండ్రి వార‌స‌త్వం గా వ‌చ్చిన ల‌క్ష‌ణం అని చెబుతారు.

త‌న ద‌ర్శ‌కుల్ని గౌర‌వించ‌డంలో సూప‌ర్ స్టార్ కృష్ణ ఎప్పుడూ ముందుండేవార‌ని ఆన్ లొకేష‌న్ ద‌ర్శ‌కులతో వ్య‌వ‌హ‌రించే తీరు గురించి ఎంతో ఆస‌క్తిగా మాట్లాడుకునేవారు. ఇప్పుడు అదే వార‌స‌త్వాన్ని మ‌హేష్ కొన‌సాగిస్తున్నారు. మ‌హేష్ త‌న ద‌ర్శ‌కుల‌తో అన్ని వేళ‌లా ఎంతో స్నేహంగా ఉంటారు.

మ‌హ‌ర్షి చిత్రంతో త‌న‌కు విజ‌యాన్ని ఇచ్చిన‌ ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లికి మ‌హేష్ ప్ర‌తి సంద‌ర్భంలో ఎంతో స‌ముచిత గౌర‌వం ఇచ్చారు. పైడిప‌ల్లి మ‌హేష్ ఫ్యామిలీ మెంబ‌ర్ అయిపోయారు. ఇటీవలే సరిలేరు నీకెవ్వరు తో మహేష్ కు కెరీర్ బెస్ట్ ఇచ్చిన అనిల్ రావిపుడి ని కూడా ఫ్యామిలీ మెంబర్ లా చూసుకుంటున్నారు మహేష్.

మ‌హేష్ త‌న ద‌ర్శ‌కుడితో ఎంత ఎమోష‌న‌ల్ గా క‌నెక్ట‌వుతారో దీనిని బ‌ట్టి చెప్ప‌వ‌చ్చు. మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివలది ప్రత్యేక అనుబంధం. మ‌హేష్ కెరీర్ లో రెండు సార్లు అదిరిపోయే బ్లాక్ బ‌స్టర్లు ఇచ్చారు కొర‌టాల శివ‌. మ‌హేష్ కి శ్రీ‌మంతుడు, భ‌ర‌త్ అనే నేను లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ని ఇచ్చారు కొర‌టాల‌.

కేవలం హిట్స్ ఇచ్చిన దర్శకులనే కాకుండా అందరినీ ఇంతే గౌరవంగా చూసుకోవడం మహేష్ కే చెల్లింది అంటున్నాయి సినీ వర్గాలు. అందుకు నిదర్శనం ఇటీవలే మురుగదాస్ చెప్పిన విషయం. మహేష్‌ తో ఓ మంచి సినిమా చేయాలన్న ఆలోచనలోనే స్పైడర్‌ను తెరకెక్కించాను. కానీ తెలుగు, తమిళ ఆడియన్స్‌ను బ్యాలెన్స్ చేయటంలో ఫెయిల్ అయ్యా అన్నారు.

స్పైడ‌ర్ ఫ్లాప్ అయిన త‌ర‌వాత కూడా ఆయ‌న త‌న స్నేహం కొన‌సాగించారు. ప‌ది రోజుల పాటు వ‌రుస‌గా ఫోన్లు చేస్తూ, మెసేజ్‌లు పెట్టేవారు. సినిమాల్లో ఇవ‌న్నీ మామూలే ప‌ట్టించుకోకండి అని భ‌రోసా ఇచ్చేవారు. అలాంటి హీరోని నేను చూడ‌లేదు అని మ‌హేష్ గురించి చెప్పుకొచ్చాడు మురుగ‌దాస్‌.

అందుకే మహేష్ సూపర్‌స్టార్ అయ్యాడు. మహేష్ బాబు చాలా సింపుల్ గా ఉంటారని అందరికి తెలిసిన విషయమే. ఆయన చార్మింగ్ పర్సనాలిటి నే కాకుండా ఆయన వ్యక్తిత్వం ని అందరు ఇష్టపడతారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనేది చాలా గొప్ప విషయం. మహేష్ ఈ విషయం లో మాత్రం అందరికంటే చాలా స్పెషల్ అనే చెప్పాలి. దటీజ్ మహేష్ !

మహేష్ బాబు ఇదొక పేరు కాదు ఇట్స్ ఏ బ్రాండ్ అన్న టాక్ ఇప్పటికే కార్పొరేట్ రంగంలో నెలకొంది. నేషనల్‌ వైడ్‌లో బడా బడా స్టార్స్‌, క్రికెటర్స్‌కి ధీటైన ఫాలోయింగ్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఉంది. జాతీయ స్థాయిలో ఒక్కో విభాగంలో టాప్‌లో ఉన్న కంపెనీలన్నీ రీజనల్‌ స్థాయికి వచ్చే సరికి సౌత్ మార్కెట్‌ కోసం సూపర్ స్టార్ మహేష్‌ వద్దకే వస్తున్నాయి.

Share

Leave a Comment