ద‌టీజ్ మ‌హేష్ అనాల్సిందే

ద‌ర్శ‌కుడు లేక‌పోతే సినిమా లేదు. అందుకే ద‌ర్శ‌కుడిని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని గౌర‌విస్తారు. ఒక సినిమాకి హీరో నిర్మాత ల‌తో సింక్ అయ్యి ద‌ర్శ‌కుడు ప‌ని చేయాల్సి ఉంటుంది. అందుకే టీమ్ లో అత‌డి ప్రాధాన్య‌త వేరుగా ఉంటుంది. సెట్స్ లో ద‌ర్శ‌కుల‌కు నటీనటులకు ఉండే అనుబంధం చాలా గటిగానే ఉంటుంది. దర్శకుడు చెప్పింది పాటిస్తే చాలు ఆ సన్నివేశం పండినట్లే.

అందుకే దర్శకులకు నటీనటులు చాలా గౌరవం ఇవ్వాల్సిన విషయం. ఇక ఈ విష‌యంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఎంతో ఎమోష‌న‌ల్ అని స‌న్నిహితులు చెబుతుంటారు. అది తండ్రి వార‌స‌త్వం గా వ‌చ్చిన ల‌క్ష‌ణం అని చెబుతారు. త‌న ద‌ర్శ‌కుల్ని గౌర‌వించ‌డంలో సూప‌ర్ స్టార్ కృష్ణ ఎప్పుడూ ముందుండేవార‌ని ఆన్ లొకేష‌న్ ద‌ర్శ‌కులతో వ్య‌వ‌హ‌రించే తీరు గురించి ఎంతో ఆస‌క్తిగా మాట్లాడుకునేవారు.

ఇప్పుడు అదే వార‌స‌త్వాన్ని మ‌హేష్ కొన‌సాగిస్తున్నారు. మ‌హేష్ త‌న ద‌ర్శ‌కుల‌తో అన్ని వేళ‌లా ఎంతో స్నేహంగా ఉంటారు. ఇటీవ‌లే మ‌హ‌ర్షి చిత్రంతో త‌న‌కు విజ‌యాన్ని ఇచ్చిన‌ ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లికి మ‌హేష్ ప్ర‌తి సంద‌ర్భంలో ఎంతో స‌ముచిత గౌర‌వం ఇచ్చారు. పైడిప‌ల్లి మ‌హేష్ ఫ్యామిలీ మెంబ‌ర్ అయిపోయారు.

ఇప్పుడే మహేష్ తో పాటే ఇంగ్లాండ్ లో వెకేషన్ లో ఉన్నారు వంశీ. మ‌హేష్ త‌న ద‌ర్శ‌కుడితో ఎంత ఎమోష‌న‌ల్ గా క‌నెక్ట‌వుతారో దీనిని బ‌ట్టి చెప్ప‌వ‌చ్చు. మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివలది ప్రత్యేక అనుబంధం. మ‌హేష్ కెరీర్ లో రెండు సార్లు అదిరిపోయే బ్లాక్ బ‌స్టర్లు ఇచ్చారు కొర‌టాల శివ‌. మ‌హేష్ కి శ్రీ‌మంతుడు లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ని ఇచ్చారు కొర‌టాల‌.

భ‌ర‌త్ అనే నేను లాంటి పొలిటికల్ టచ్ ఉన్న సినిమాని త‌నకి ఇచ్చారు. ఆ రెండు సంద‌ర్భాల్ని ఎన్నో సంద‌ర్భాల్లో వేదిక‌ల‌పైనే మ‌హేష్ గుర్తు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. కొర‌టాల శివ బ‌ర్త్ డే సంద‌ర్భంగా త‌న‌పై ఉన్న ప్రేమ‌ను ఓ ఫోటో ద్వారా వ్య‌క్తం చేశారు మ‌హేష్‌. “ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న అత్యంత టాలెంట్, విజనరీ డైరెక్టర్ అయిన నా స్నేహితుడు కొర‌టాల‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు“ అని ఈ ఫోటోకి క్యాప్ష‌న్ ఇచ్చారు.

ఆ ఒక్క వ్యాఖ్య‌లో కొర‌టాల అంటే త‌న‌కు ఉన్న ప్ర‌త్యేక ప్రేమ‌ను మ‌హేష్ రివీల్ చేశారు. దీంతో పాటు ఆప్యాయంగా అతన్ని హత్తుకొన్న ఓ ఫొటో ని కూడా పోస్ట్ చేశారు. దీనితో మహేష్, కొరటాల మధ్య ఎంత ఎమోషనల్ బాండింగ్ ఉందో మరో సారి ఋజువు అయ్యింది. న‌వ‌త‌రం హీరోల‌కు దర్శకుల పట్ల మ‌హేష్ ఎఫెక్ష‌న్ స్ఫూర్తినిస్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఈ విషయంలో ఆయనే రోల్ మోడల్. ద‌టీజ్ మ‌హేష్ అన్న‌మాట‌.

Share

Leave a Comment