మాట్లాడతారు అనుకున్నాను

ప్రముఖ నటి, మహిళా దర్శకురాలు, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్న విజయనిర్మల 74 వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తనకు అరుదైన కానుకను ఇచ్చి చరిత్రకెక్కారు సూపర్‌స్టార్ కృష్ణ. ఇంతకీ ఆయనేం కానుక ఇచ్చారు? అంటే ఏకంగా సతీమణి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఎంతో అపురూపంగా తన ప్రేమకు గుర్తుగా ఒక అద్భుతమైన డిజైన్ తో విజయనిర్మల విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆసక్తికరంగా ఈ విగ్రహాన్ని విజయనిర్మలకు ఎంతో ఇష్టమైన నానక్ రామ్ గూడ తోటలోనే సూపర్ స్టార్ ఆవిష్కరించారు. నానక్ రామ్ గూడా కృష్ణ విజయ నిర్మల నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో విజయనిర్మల విగ్రహాన్ని హీరో కృష్ణ స్వయంగా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు, మురళీమోహన్, మహేష్ బాబు, నమ్రత, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, గల్లా జయదేవ్, నిర్మాత పివిపి, పరుచూరి గోపాల కృష్ణ, ఆదిశేషగిరరావు, శివకృష్ణ, మారుతి, నందిని రెడ్డి బ్రహ్మాజీ, శివ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. సూపర్‌స్టార్ మహేష్ బాబు జ్యోతి ప్రజ్వలన చేసి, విజయ నిర్మల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

అనతంరం ఆయన మాట్లాడుతూ నా సినిమా రిలీజ్ రోజు మార్నింగ్ షో చూసి నాన్నగారు ఫోన్ చేసి మాట్లాడేవారు. తర్వాత ఆమె కూడా విష్ చేసేవారు. మొన్న సరిలేరు నీకెవ్వరు రిలీజ్ రోజు కూడా నాన్న గారు ఫోన్ చేసి విష్ చేశారు. ఆమె మాట్లాడబోతున్నారనుకున్నారు. ఆవిడ ఎక్కడున్నా చాలా సంతోషంగా ఉంటారు. విజయ నిర్మల గారి పుట్టినరోజు ప్రతి సంవత్సరం ఒక వేడుకగా జరుగుతుంది అన్నారు.

ఈ కార్యక్రమంలోనే విజయ నిర్మల స్త్రీ శక్తి పురస్కారాన్ని లేడీ డైరెక్టర్ నందినిరెడ్డికి కృష్ణంరాజు, మహేష్ సంయుక్తంగా అందచేశారు. అమ్మ పేర అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా వుందని నందిని రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. మును ముందు ఇలా మహిళా దర్శకులకు పురస్కారాలు అందిస్తామని విజయనిర్మల వారసుడు సీనియర్ నరేష్ ఈ వేదిక పై ప్రకటించారు.

1)

2)

3)

4)

5)

6)

7)

Share

Leave a Comment