బాబు ల్యాండ్ అయ్యాడు

ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్నా కుటుంబానికి సమయం కేటాయిస్తూ కిడ్స్ తో ఆటలాడుకుంటూ మన హీరోలు ఫ్యామిలీ లైఫ్- పర్సనల్ లైఫ్ మ్యాటర్స్ ని డీల్ చేస్తున్న విధానం ఆశ్చర్యపరచకుండా ఉండదు. ఎంత బిజీగా ఉన్నా షూటింగ్ ల గ్యాప్ లో విదేశీ వెకేషన్లు ప్లాన్ చేస్తూ స్టార్ డాడ్స్ పక్కా ఫ్యామిలీ మ్యాన్ లు అని నిరూపిస్తున్నారు.

ప్రస్తుత జనరేషన్ లో సూపర్ స్టార్ మహేష్ ఫక్తు ఫ్యామిలీ మ్యాన్ గా, బెస్ట్ డాడ్ గా పేరు తెచ్చుకున్నారు. చిన్నారులు గౌతమ్, సితారతో కలిసి ఏడాదికి మూడు నాలుగు సార్లు అయినా విదేశీ వెకేషన్స్ కి మహేష్ వెళ్ళాల్సిందే. దుబాయ్, లండన్, ప్యారిస్ అంటూ వెళ్లి వస్తుంటారు. ఇంట్లో ఉన్నప్పుడు గౌతమ్, సితారలతోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తుంటారు మహేష్.

ఈ సారి కూడా మహర్షి ప్రొమోషన్స్ ముగించుకుని మహేష్ కుటుంబ సమేతంగా విదేశాలకు జాలీ ట్రిప్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఎగ్జోటిక్ యూరప్ ఆద్యంతం చుట్టేసిన మహేష్ జర్మనీ, ప్యారిస్ లాంటి నగరాల్ని విజిట్ చేశారు. అటుపై ఇంగ్లండ్ లో పర్యటించారు. ఈ పర్యటన ఆద్యంతం నమ్రత సహా క్యూట్ కిడ్స్ సితార, గౌతమ్ అతడితో కలిసి జాలీ ట్రిప్ ఎంజాయ్ చేశారు.

ఇంగ్లాండ్ ట్రిప్ మాత్రం తన కుమారుడు గౌతమ్ కు క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ చూపించడం కోసమే అని మహేష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసారు. వరల్డ్ కప్ లో ఓవల్ లో జరిగిన ఇండియా- ఆస్ట్రేలియా మ్యాచ్ ని ఫ్యామిలీ సమేతంగా వీక్షించారు. అందుకు సంబంధించిన ఫోటోల్ని తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా నమ్రత, మహేష్ షేర్ చేశారు.

ఈ ఫోటోలు అభిమానుల్లో అంతే జోరుగా వైరల్ అయ్యాయి. ఈసారి ట్రిప్ లో డాడ్ తో కలిసి క్యూట్ సితార చేసిన అల్లరి మామూలుగా లేదు. ఇక గౌతమ్ ఎంతో సైలింట్ గా, మంచి బాలుడు టైప్ లో ఫొటోల్లో కనిపిస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ ట్రిప్ ముగిసింది. తిరిగి మహేష్ కుటుంబం అంతా హైదరాబాద్ కి చేరుకున్నారు.

శంషాబాద్ (హైదరాబాద్) విమానాశ్రయం నుంచి తాజాగా మహేష్ బయటకు వస్తున్న ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి. వీటిలో క్యూట్ సితార చెయ్యి పట్టుకుని మహేష్ బయటకు వస్తూ ఎంతో జోవియల్ గా కనిపించారు. తనతో పాటే నమ్రత, గౌతమ్ కూడా ఫోటోల్లో కనిపించారు. మహర్షి కోసం ఏడాది పాటు కఠోరంగా శ్రమించిన మహేష్ ఆ స్ట్రెస్ నుంచి ఇప్పటికి రిలీఫ్ అయ్యారని అర్థమవుతోంది.

1)

2)

3)

4)

మహర్షి సక్సెస్ ని ఇలా జాలీ ట్రిప్ రూపంలో సెలబ్రేట్ చేసుకున్న మహేష్ తదుపరి కెరీర్ 26వ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో అనీల్ సుంకర, దిల్ రాజు, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న `సరిలేరు నీకెవ్వరు`(ఎస్ఎస్ఎంబి 26) సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు నాడు ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ఇక సరిలేరు నీకెవ్వరు చిత్రీకరణతో తిరిగి బిజీ అయిపోతారు మహేష్. త్వరలోనే రెగ్యులర్ చిత్రీకరణలో మహేష్ పాల్గొంటారని తెలుస్తోంది. కథ ప్రకారం మహేష్ ఇందులో మిలిటరీ ఆఫీసర్ గా కనిపిస్తారని సినిమా ప్రారంభోత్సవం రోజునే దర్శకుడు క్లారిటీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. అలాగే సినిమాను 2020 సంక్రాంతికి విడుదల చేస్తామని కొబ్బరికాయ కొట్టిన రోజే ప్రకటించేసారు.

ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ను చిత్రబృందం కశ్మీర్‌లో ప్లాన్‌ చేస్తోందని తెలిసింది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ ఏడాది అప్పుడే ఆరు నెలలోకి అడుగు పెట్టేసాం. బాలన్స్ ఉన్న 180 రోజుల్లో పాటలతో సహా షూటింగ్ మొత్తం పూర్తి చేసేయాలి. అప్పుడే సంక్రాంతి రేస్ కు సరిలేరు నీకెవ్వరు సిద్ధమవుతుంది. దానికి తగ్గట్టే అనిల్ రావిపూడి పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది.

25వ సినిమా మహర్షి ప్రశంసలతో పాటు భారీ వసూళ్ళతో రికార్డు సృష్టించి మహేష్ అభిమానుల్లో నూతనోత్సాహం నింపింది. దీంతో మహేష్ 26 వ సినిమా మరింత ప్రత్యేకంగా ఉండాలని కోరుకున్నారు ఆయన ఫ్యాన్స్. అందుకు తగ్గట్లే ‘సరిలేరు నీకెవ్వరు’ ఉండబోతుందని కొబ్బరి కాయ కొట్టిన రోజే ప్రేక్షకులకు చెప్పేసారు అనిల్ రావిఫూడి.

ఈ చిత్రంలో రష్మిక మందన కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయశాంతి గారు నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజ‌కీయాల కార‌ణంగా 13 ఏళ్లు సినిమాల‌కు విరామం తరువాత ఈ మూవీ ద్వారా రీఎంట్రీ అవడం విశేషం. రాజేంద్ర ప్ర‌సాద్‌ గారు, జ‌గ‌ప‌తి బాబు గారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. స్టార్ క్యాస్ట్ తోనే సరిలేరు నీకెవ్వరు సినిమాపై అంచనాలను అమాతం పెంచేస్తున్నారు అనిల్ రావిఫూడి. ఇంక కధ ఏ రేంజ్ లో ప్లాన్ చేసాడో మరి.

Share

Leave a Comment