కొత్త చరిత్ర లిఖించిన భరత్

కొరటాల శివ డైరెక్షన్ లో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటంచిన ‘భరత్ అనే నేను’ హిట్ టాక్ తో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ మూవీ ఈ వీకెండ్ తో రూ. 200 కోట్ల క్లబ్ లోకి చేరింది.

‘భరత్ అనే నేను’ లేటెస్ట్ గా రూ. 205 కోట్లు దాటిందని నిర్మాత డీవీవీ దానయ్య తన అధికార ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. నాన్ బాహుబలి చిత్రాల క్యాటగిరీలో 200 కోట్ల క్లబ్‌లో త్వరగా చేరిన సినిమా భరత్ అనే నేను. ఈ చిత్రం ఓవర్సీస్‌లో మరింత దూకుడుగా కలెక్షన్లు రాబడుతోంది. బాహుబలి సినిమా తర్వాత అంత వేగంగా యూఎస్‌లో ఆ మార్క్‌ను చేరుకున్న చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసాడు భరత్.

విడుదలైన తొలిరోజు నుంచే రికార్డుల వేటను కొనసాగించింది భరత్ అనే నేను. మొదటి వారంలో రూ.161 కోట్లు, రెండు వారాలకు రూ. 190 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్ దక్కించుకున్నట్టు వెల్లడించారు. మూడు వారాల్లో రూ.205 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లతో దూసుకుపోతోందని ప్రకటించింది సినిమా యూనిట్.

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు సినిమా అంటే రికార్డులకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతున్నాయి. శ్రీమంతుడు సినిమా నాన్‌ బాహుబలి రికార్డులను సాధిస్తే తరువాత రిలీజైన రెండు సినిమాలు ఆశించినంతగా విజయం సాధించలేదు. భరత్‌ అనే నేను సినిమా విడుదలైన తొలిరోజు నుంచే రికార్డుల వేటను కొనసాగించింది.

భరత్ అనే నేను తో సూపర్‌స్టార్ ఏ తెలుగు హీరో కు లేని కొన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈస్ట్ గోదావరిలో 6కోట్లకు పైగా షేర్ ఉన్న చిత్రాలు రెండు, కాకినాడలో కోటికి పైగా షేర్ ఉన్న చిత్రాలు రెండు, 50లక్షలకు పైగా షేర్ ఉన్న చిత్రాలు అమలాపురంలో రెండు, తెనాలి లో మూడు, కడపలో మూడు ఉన్న ఏకైక హీరో టాలీవుడ్లో సూపర్‌స్టార్ మహేష్‌ మాత్రమే.

అమెరికాలో మిలియన్ డాలర్ల సినిమాలు 8, నైజాంలో రెండు 20కోట్ల షేర్ సినిమాలు, ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ లో ఏడు 1కోటి గ్రాసర్ లు ఉన్న ఒకే ఒక్కడు అయ్యాడు మహేష్‌ భరత్ అనే నేను తో.

విజయవాడలోని క్యాపిటల్ సినిమాస్‌లో కేవలం ఒక్క మల్టీప్లెక్సులోనే ‘భరత్ అనే నేను’ పది రోజుల వ్యవధిలో కోటి రూపాయల గ్రాస్ వసూలు చేయడం విశేషం. విజయనగరం, విశాఖపట్టణం, రాజమండ్రి, కాకినాడ, భీమవరం, ఏలురు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కర్నూలు లలో కోటి రూపాయల గ్రాస్ ను వసూలు చేసింది భరత్ అనే నేను.

భరత్ అనే నేను తో నాలుగవ 100కోట్ల గ్రాసర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు మహేష్. తెలుగు హీరోల్లో ఇదే హయ్యస్ట్. 50కోట్ల షేర్ సినిమాలు 5, 85కోట్ల షేర్ సినిమాలు 2 కలిగిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ మాత్రమే.

సూప‌ర్ స్టార్ సినిమాకు మంచి టాక్ రావాలే కానీ వసూళ్ల మోత మామూలుగా ఉండదు. అది ‘భరత్ అనే నేను’తో మరోసారి రుజువైంది. ఈ సినిమా మున్ముందు ఇంకెన్ని రికార్డులు బద్దలుకొడుతుందో వేచిచూడాలి.

Share

Leave a Comment