ఫిఫ్టీ డేస్ స్పెషల్

ప్రిన్స్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్‌లో ఏప్రిల్ 20న విడుదలైన ‘భరత్ అనే నేను’ మూవీ విజయవంతంగా రికార్డ్ కలెక్షన్లతో 50 రోజులను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఫిఫ్టి డేస్ స్పెషల్ పోస్టర్స్ ఆండ్ ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

తొలిరోజు నుండి రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోయిన ఈ మూవీ మూడు వారాల్లో రూ. 205 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధిందని అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు. ఇక లాంగ్ రన్ ఇంకా కంటిన్యూ అవుతున్న ఈ మూవీ ఇప్పటికే నాన్ బాహుబలి రికార్డ్స్‌ను బ్రేక్ చేసింది. మహేష్ కెరియర్‌లోనే బెగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి యాభై రోజులు పూర్తి చేసుకున్న ఈ మూవీలో ప్రధాన బలాబలాలు ఎంటో చూద్దాం.

1. ప్రిన్స్ మహేష్ బాబు..
‘భరత్ అనే నేను’ హామీ ఇస్తున్నానూ అంటూ ఈ చిత్ర ఫస్ట్ ఓథ్‌ తోటే ఈ సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చాడు మహేష్. ‘భరత్ అనే నేను’ అనే టైటిల్ అనౌన్స్ మెంట్ ప్రేక్షకుల్ని తనవైపు తిప్పుకోగలిగాడు మహేష్. యంగ్ అండ్ స్టైలిష్ ముఖ్య‌మంత్రిగా మహేష్ కనిపిస్తుండటం.. ఆ పాత్ర ప్రిన్స్‌కి అతికినట్టు సరిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యారెక్టర్‌కు మహేష్ వన్నె తెచ్చారు.

2. కొరటాల శివ…
మూడు చిత్రాలు టాలీవుడ్ బిగ్ బ్లాక్ బస్టర్ హిట్లే. వరుసగా అపజయమన్నదే లేకుంగా హ్యాట్రిక్ హిట్‌లను తన ఖాతాలో వేసుకున్న అరుదైన ఘనతను సాధించాడు దర్శకుడు కొరటాల. ఆయన డీల్ చేస్తే ఆ ప్రాజెక్ట్ బ్లాక్ బస్టర్ హిట్టే అని మరోసారి ‘భరత్ అనే నేను’ చిత్రంతో నిరూపించారు. సామాజిక, రాజకీయ అంశాలపై తనదైన శైలి ట్రీట్ మెంట్‌తో ప్రజలకు ఓ మెసేజ్‌తో పాటు సమ్మర్‌లో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చారు కొరటాల.

3. కైరా అద్వానీ..
బాలీవుడ్‌లో ‘ధోనీ’ చిత్రంతో ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించి వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది కైరా అద్వానీ. ‘భరత్ అనే నేను’ చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తుంది ఈ బ్యూటీ. స్టైలిష్ ముఖ్య‌మంత్రికి అందమైన ప్రియురాలిగా తొలి సినిమాలో మంచి ఆఫర్‌ని కొట్టేసింది కైరా. అందం అభినయంతో హావభావాలను పలికిస్తూ.. సీఎం లవర్ పాత్రలో చక్కగా ఒదిగి పోయింది కైరా

4. దేవి శ్రీ ప్రసాద్..
మహేష్ బాబుకి శ్రీమంతుడు, 1 నేనొక్కడినే చిత్రాలకు మ్యూజికల్ హిట్స్ అందించిన దేవిశ్రీ.. భరత్ అనే నేను చిత్రానికి చాలా మంచి పాటల్నే అందించారు. ఇక ఈ చిత్రంలోని వచ్చాడయ్యో సామీ.., భరత్ అనే నేను టైటిల్ సాంగ్స్ జనంలో రిపీట్‌ మోడ్‌లో వినిపిస్తున్నాయి.

5. భారీ తారాగణం, నిర్మాణ విలువలు..
ఈ చిత్రంలో మహేష్, కైరా అద్వానీలతో పాటు ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, రావు రమేష్, బెనర్జీ, రాహుల్ రామక్రిష్ణ, అజయ్, దేవరాజ్, సితార తదితర భారీ తారాగణం నటించడంతో ప్రతి ఫ్రేమ్ ఎంతో కలర్ ఫుల్‌గా కనిపించింది.

ఇక ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో డివివి ఎంటర్ టైన్మెంట్ పతాకంపై దానయ్య ఎక్కడా రాజీ పడకుండా భారీ నిర్మాణ విలువలతో నిర్మించడంతో అవుట్ ఫుట్ అదిరిపోయింది. రవి కె. చంద్రన్, ఎస్ తిర్రు అందించిన సినిమాటోగ్రఫీ.. సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్షన్… రామ్ లక్షణ్ స్టంట్స్.. అక్షయ్ త్యాగీ క్యాస్ట్యూమ్స్.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాయి.

Share

Leave a Comment