ఇది స్పెషల్ హైలైట్ గా నిలుస్తుందట

మహేష్ బాబు మూవీ భరత్ అనే నేను హంగామా జోరు మీద ఉంది. సూపర్ స్టార్ అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కానున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశమే హద్దు అన్న తరహాగా ఉన్నాయి.

ఇలాంటి సమయంలో భరత్ అనే నేను మూవీపై వస్తున్న ప్రతీ అప్ డేట్ ఆసక్తి కలిగిస్తోంది.. ఆన్ లైన్ లో వైరల్ అయిపోతోంది. సీఎం పాత్రలో మహేష్ బాబు నటించడమే ఈ చిత్రానికి ప్రధానమైన హైలైట్ అయితే..

మూవీకి ఆకర్షణగా నిలిచే మరో అంశం ఇందులో ఉంటుందట. థియేటర్ ఫైట్ సీక్వెన్స్ అద్భుతంగా వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. సుదీర్ఘంగా ఉండే ఈ యాక్షన్ ఎపిసోడ్.. మూవీ హైలైట్స్ లో ఒకటిగా నిలవనుందని టాక్ వినిపిస్తోంది.

మహేష్-కొరటాల కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు మూవీలో కూడా ఇలాగే ఓ మామిడితోట ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. ఈ సన్నివేశం ఆరంభమయ్యే సీన్ నుంచి.. చివరి వరకూ ప్రతీ ఫ్రేమ్ అద్భుతంగా రెప్ప వేయనీయని రేంజ్ లో ఉంటుంది.

ఇప్పుడు భరత్ అనే నేనులో కూడా అంతకు మించి ఎఫెక్ట్ చూపించే యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందని తెలుస్తోంది.. సినిమా అయిపోయిన తర్వాత కుడా చాలా కాలం పాటు కళ్ల ముందు మెదలడం ఖాయం అంటున్నారు.

కొరటాల మాట్లాడుతూ మహేష్ ఒక్కసారి టెక్నీషియన్‌ను నమ్మితే హార్ట్‌ఫుల్‌గా ఆ ప్రాజెక్ట్‌కు అంకితమౌతారు. సినిమాలో మహేష్‌బాబు భరత్ రామ్ అనే పాత్రలో ముఖ్యమంత్రిగా కనిపిస్తారు. సినిమాలో ఆయన మోస్ట్ హ్యాండ్సమ్ చీఫ్ మినిస్టర్‌గానే కాకుండా చాలా డైనమిక్‌గా కనిపిస్తారు అంటున్నారు.

మహేష్ బాబుకు దేశవిదేశాల్లో ఉన్న ఫాలోలింగ్.. సినిమా విడుదలకు ముందే రికార్డు బ్రేక్ చేసింది. మహేష్ ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ వ్యాప్తంగా 2000 థియేటర్లలో ‘భరత్ అనే నేను’ చిత్రం ప్రీమియర్ షోలను ప్రదర్శించనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది.

యూఎస్ లో మహేష్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో.. ప్రీమియర్ షోలకు టికెట్ల అమ్మకం ప్రారంభమైందని యూనిట్ తెలిపింది. రికార్డు మొత్తంలో సినిమా థియేటర్లలో ఈ చిత్రం విడుదలవుతుందని సమచారం.

Share

Leave a Comment