భరత్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్ లైవ్ ఇక్కడ చూడండి

భారీ వసూళ్ల ని సాధిస్తోంది భరత్ అనే నేను. 7 రోజుల్లో 160 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించింది. నార్త్ అమెరికాలో మాత్రమే ఈ సినిమా మూడు మిలియన్ డాలర్ల పై స్థాయి వసూళ్లను సాధించింది. ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో భారీ వసూళ్లను రాబడుతోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబును ముఖ్యమంత్రి పాత్రలో చూసి అభిమానులు పరవశించిపోతున్నారు . భరత్ కలెక్షన్స్ కుమ్మేస్తున్నాడు. ఈ సందర్భంగా భరత్ అనే నేను టీం నేడు బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్ పేరుతో ఒక వేడుక ను చేస్తున్నారు.

భరత్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్ ను మీరు కూడా చూడాలనుకుంటే ఈ క్రింది యూట్యూబ్ లింక్ ని క్లిక్ చేయండి. ఆ ప్రోగ్రాం మొదలవ్వగానే మీరు కూడా ఈ క్రింది యూట్యూబ్ లింక్ లో లైవ్ చూడవచ్చు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజు తిరుమల లో శ్రీవారిని దర్శించుకున్నారు. భరత్ అనే నేను ఘన విజయం సాధించిన సందర్భంగా తిరుపతి వచ్చిన మహేష్ బాబు ఈరోజు ఉదయం దర్శకుడు కొరటాలశివ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తో కలసి తిరుమల వెంకన్నను దర్శించుకొని స్వామి వారి ఆశీస్సులు పొందారు.

ఆలయ అధికారులు మహేష్ బాబు కు స్వాగతం పలికి స్వామి వారి దర్శన ఏర్పాట్లు చేసారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో శ్రీవారి తీర్థ ప్రసాదాలను అధికారులు మహేష్ బాబు కు అందజేశారు.

ఇక ఆలయం వెలుపల సూపర్ స్టార్ మహేష్ ని చూడడానికి భక్తులతోపాటు అతని అభిమానులు ఎక్కువగా చేరుకోవడంతో ఆలయం ఎదుట తోపులాట చోటు చేసుకుంది. దింతో అక్కడికి చేరుకున్న పోలీసులు అభిమానులను చెదరకొట్టి మహేష్ బాబు కు దారి కల్పించారు.

మొదటి వారంలో బ్రహ్మాండమైన కలెక్షన్స్ రాబట్టి రెండో వారంలో కూడ బలంగా కొనసాగుతోంది భరత్ అనే నేను. పైగా ఆదివారంతో పాటు మే 1 కూడ సెలవు కావడంతో లాంగ్ వీకెండ్ కలిసొచ్చి సినిమాకు మంచి రన్ ఉండనుంది. దీంతో సినిమాకు రెండో వారంలో కూడ భారీ షేర్ రానుంది.

భరత్ అనే నేను సినిమాతో రికార్డుల భరతం పడుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు మరో అరుదైన ఘనత సాధించబోతున్నారు. ప్రఖ్యాత మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో మహేష్ మైనపు విగ్రహాన్ని పెట్టబోతున్నారు. మ్యూజియం నుంచి కొందరు సాంకేతిక నిపుణులు హైదరాబాద్ కి వచ్చి మరీ సూపర్ స్టార్ శరీర కొలతలను తీసుకెళ్లారు.

Share

Leave a Comment