భరత్ అనే నేను సెన్సార్ విశేషాలు

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం ఏప్రిల్ 20న భారీస్థాయిలో విడుదల కానుంది. నిర్మాణాంతర పనుల్లో భాగంగా ఇవాళే చిత్రం సెన్సార్ ముందుకు వెళ్ళింది.

సినిమాను వీక్షించిన సెన్సార్ వారు యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేశారు. సెన్సార్ బోర్డువారు ఎలాంటి అభ్యంతరాలను వ్యక్తం చేయకుండగా జీరో కట్స్ తో ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికెట్ ను జారీచేయడం విశేషం.

సినిమా రన్ చూస్తే 2 గంటల 53 నిముషాలు ఉండడం విశేషం. ఈ సెన్సార్ రిపోర్ట్ చూస్తే రన్ టైం దాదాపు మూడు గంటల నిడివి ఉండడంతో సినిమాలో బలమైన కంటెంట్ ఉందని అర్థమవుతోంది.

మాములుగా ఓ పొలిటికల్ జోనర్ సినిమా అంటే ప్రస్తుత రాజకీయాలను ప్రభావితం చేసేలా వివాదాస్పద మాటలు కానీ, సన్నివేశాలు కానీ లేకుండా..జీరో కట్స్ తో బయటకి రావడం అంటే కొరటాల మార్క్ తోనే సినిమా మొత్తం ఉండనుందని క్లియర్ గా తెలుస్తోంది.

వినోదానికి సందేశాన్ని జోడించి కొరటాల సిద్ధం చేసిన ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకులలోను ఆసక్తి వుంది. ఈ సినిమాకి ముందు కొరటాల తెరకెక్కించిన అన్ని సినిమాలు ఘన విజయాలను సాధించాయి.

ఆ సక్సెస్ ల జాబితాలో ‘శ్రీమంతుడు’ కూడా ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఇక అమెరికాలో ప్రీమియర్ షోల రూపంలో కూడా ఇప్పటికే భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి.

ఇది వరకే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లు కూడా పవర్ ఫుల్ గా ఉండడంతో భారీ ఓపెనింగ్స్ నమోదయ్యే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ పొలిటికల్ ఎంటర్ టైనర్ ను డీవీవీ దానయ్య నిర్మించారు.

అలాగే యు.కె.లో కూడా ఏ తెలుగు సినిమా విడుదలవ్వని థియేటర్లో రాబోతున్నాడు భరత్‌. దీనికి తోడు ఆస్త్రేలియా లో ఏకంగా ఏ భారతీయ సినిమాకి సాధ్యం కాని విధంగా విడుదలౌతుంది భరత్ అనే నేను.

ఇవన్నీ చూస్తుంటే ఈసారి విదేశాల్లో లో సూపర్ స్టార్ సునామి స్రుష్తించే లా ఉన్నాడు. తెలుగు రాష్ట్రాల లోనూ భరత్ అనే నేను ఫీవర్ మామూలుగా లేదు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించాబోతోందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది.

Share

Leave a Comment