భరత్ అనే నేను సెన్సార్ హైలైట్స్

సూపర్ స్టార్ మ‌హేష్ సినిమా వ‌స్తుందంటేనే బాక్సాఫీసు ద‌గ్గ‌ర అటెన్ష‌న్ మొద‌లైపోతుంది. కొత్త రికార్డులు లిఖించ‌డానికి ఇంత‌కు మించిన త‌రుణం మ‌రోటి ఉండ‌దు. మ‌హేష్ సినిమా ఎలా ఉండ‌బోతోంది?  అందులోని ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌లేంటి?  అనే విష‌యాల‌పై చ‌ర్చ సాగుతూ ఉంటుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు, కైరా అద్వాని జంటగా కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 20న విడుదల కాబోతోంది. ఫస్ట్‌లుక్ నుంచి ట్రైలర్ వరకూ విడుదలైన ప్రతిదీ ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేసింది.

దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాను మరో మెట్టు ఎక్కించింది. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.

‘భరత్ అనే నేను’ కు సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. సెన్సార్ బోర్డువారు ఎలాంటి అభ్యంతరాలను వ్యక్తం చేయకుండా జీరో కట్స్ తో ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికెట్ ను జారీచేయడం విశేషం.

లెంగ్త్ విషయంలో కొరటాల శివ-మహేష్ బాబు రాజీ పడలేదు. మొత్తం రన్ టైం 173 నిమిషాల కాపీని సెన్సార్ కు ఇచ్చారు. జీరో కట్స్ తో సర్టిఫికెట్ ను పొందటం గొప్ప విషయం.

‘ప్రామిస్’ ఈ పదం ఇంతకుముందు వింటే ప్రమాణం అని తెలుగులో అర్థం చెప్పేవారు. కానీ ఇప్పుడు సూపర్ స్టార్ మ‌హేష్ చెప్పిన డైలాగులు గుర్తుకొస్తున్నాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ప్రామిస్ చేస్తే కట్టుడి ఉండాలి అనే అంశం మీద భారీ అంచనాలతో విడుదల అవుతుంది భరత్ అనే నేను.

ఇక విదేశాల్లో ప్రీమియర్ షోల రూపంలో కూడా ఇప్పటికే భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల లోనూ భరత్ అనే నేను ఫీవర్ మామూలుగా లేదు.

ఈ సినిమాకి ముందు కొరటాల తెరకెక్కించిన అన్ని సినిమాలు ఘన విజయాలను సాధించాయి. ఆ సక్సెస్ ల జాబితాలో ‘శ్రీమంతుడు’ కూడా ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.

Share

Leave a Comment