సరిహద్దుల అవతల కూడా సెన్సేషనల్ కలెక్షన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. రిలీజ్ రోజునే అదిరిపోయే టాక్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా కూడా దుమ్ములేపుతోంది.

ఇప్పటికే ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా పలు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. కాగా ఈ చిత్రం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు ఓవర్సీస్‌లో. పక్క రాష్ట్రాల్లో కూడా సైతం తుక్కురేగ్గొడుతుంది.

ఇప్ప‌టికే రూ.125 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు దాటేసిన ఈ సినిమా 150 కోట్ల క్ల‌బ్ వైపు అడుగులు వేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ వీకెండ్ త‌ర్వాత కూడా ఎక్కడా డ్రాప్స్ లేకుండా అదిరిపోయే వ‌సూళ్లు రాబ‌డుతోంది.

అమెరికాలో మహేష్ ప్రభంజనం మామూలుగా లేదు. మామూలుగానే అక్కడ అతను తిరుగులేని స్టార్. ఫ్లాప్ సినిమాలతోనే మహేష్ అక్కడ మిలియన్ మార్క్‌ను అవలీలగా అందుకున్నాడు. భరత్ అనే నేను చిత్రంతతో ఏకంగా 3 మిలియన్ మార్క్‌పై కన్నేశాడు. ఇప్పటికే 2.6 మిలియన్ మార్క్‌ను క్రాస్ చేసిన భరత్ 3 మిలియన్ మార్క్‌ను అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

ఆస్ట్రేలియాలో ‘భరత్ అనే నేను’ ఈ ఏడాది ఇండియన్ సినిమాల్లో పద్మావతి తర్వాతి అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. అక్కడ తెలుగు సినిమాల ఫుల్ రన్ రికార్డులు ఆల్రెడీ బద్దలైపోవడం విశేషం. 405కె+ ఆస్ట్రేలియన్ డాలర్లు రాబట్టి విజయవంతంగా దూసుకుపోతుంది.

ఇక కర్ణాటకలో భరత్ అనే నేను చిత్రానికి బ్రహ్మాండమైన ఆదరణ లభించడంతో ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి అక్కడ ఏకంగా పది కోట్ల కు పైగా గ్రాస్ సాధించాడు భరత్. ఇంకా దిగ్విజయంగా ప్రదర్శింపబడుతుంది.

తమిళంలోను ఈ సినిమా తన జోరు చూపిస్తోంది. తమిళనాడులో రూ. 2.5 కోట్ల షేర్ దాకా వసూళ్లు చేసి చరిత్ర స్రుష్టించాడు మహేష్. బాహుబలి తెలుగు వెర్షన్ కి కూడా అక్కడ ఈ స్థాయిలో వసూళ్లు రాలేదు.

కేరళలోనూ మంచి వసూళ్లను కలెక్ట్ చేస్తున్నాడు. అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన డైరెక్ట్ తెలుగు చిత్రంగా అక్కడ రికార్డు స్రుష్టించి మహేష్ నూతన అధ్యాయానికి నాంది పలికాడు. రోజు రోజు కి అక్కడ షోస్ కౌంట్ ని పెంచుతున్నారు అంటే ఎంతా గొప్ప ఆదరణ లభిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

మొత్తానికి భరత్ అనే నేను చిత్రంతో మహేష్ సరికొత్త రికార్డులను కేవలం తెలుగు రాష్ట్రాల్లో నే కాకుండా మన సరిహద్దుల అవతల కూడా క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు కనిపిస్తున్నాడు. ఫుల్ స్వింగ్‌లో ఉన్న భ‌ర‌త్ రూ.200 కోట్ల మార్క్ సులువుగా చేరుకుంటుంద‌ని అంద‌రూ అంచ‌నా వేస్తున్నారు.

Share

Leave a Comment