మనసుకు హత్తుకునేలా కన్నీరు తెప్పించేలా

సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా భరత్‌ అనే నేను. ఏప్రిల్ 20న రిలీజ్‌ అయిన ఈ సినిమా ఇప్పటికీ హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో రన్‌ అవుతోంది. తాజాగా సూపర్‌ స్టార్ అభిమానుల కోసం చిత్రయూనిట్ ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఎలాంటి ఎనౌన్స్‌మెంట్‌ లేకుండానే సినిమాలో లేని వీడియో క్లిప్‌లను రిలీజ్‌ చేశారు.

పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా పూర్తి కాని ఈ సన్నివేశాలు ఈ ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. ఈ సినిమాలో ప్రతీ సీన్ హైలెటే. అయితే ఈ సినిమాలో తాజాగా ఓ రైతుతో సీఎం భరత్ మాట్లాడే సీన్‌ను రిలీజ్ చేసింది.

రైతుకు, సీఎంకు మధ్య జరిగిన సంభాషణను మనసుకు హత్తుకునేలా.. కన్నీరు తెప్పించేలా తెరకెక్కించారు డైరెక్టర్ కొరటాల. రైతు వేదన ఎలా ఉంటుందో ఈ ఒక్క సీన్‌తో వివరించారు. చుట్టూ పక్కన నీల్లు ఎక్కడా కనపడట్లే పొలం ఎలా తడుపుతావ్ అని మహేష్ అడిగే ఈ సీన్ ని చాలా అధ్బుతంగా చిత్రీకరించాడు.

ఈ సీన్ చివరిలో ‘వర్షం పడితే సరే.. పడకపోతే ఏం చేస్తావు’ అని రైతును సీఎం అడగ్గా.. ‘భగవంతుడి మీద భారం వేసి పైకి చూడటమే.. పడితే సరి.. భగవంతుడి మీద భారమేసి పైకి చూడటమే.. లేకపోతే రెండు చుక్కలు తాగి ఆయన దగ్గరకు పోవడమే’ అంటూ రైతు చెప్పేమాట నిజంగా కన్నీరు తెప్పిస్తుంది.

నిడివి కారణంగా సినిమాలో తొలగించిన సన్నివేశాలను యూట్యూబ్‌ లో రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. అసెంబ్లీలో బడ్జెట్‌కు సంబంధించిన డిస‍్కషన్‌తో పాటు మరో మూడు సన్నివేశాలను చిత్రయూనిట్‌ రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో విద్యా వ్యవస్థ గురించిన ఓ కీలక సన్నివేశం, దాని కంటిన్యుయేషన్ గా మరో సన్నివేశం ఉంటాయి. ఎడిటింగ్ లో తొలగించిన కంటిన్యుయేషన్ సన్నివేశాన్ని చిత్ర యూనిట్ పోస్ట్ చేసింది. ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో అసెంబ్లీలో మహేష్ బాబు మాట్లాడే మరో సన్నివేశాన్ని కూడా తొలగించింది. దీనిని కూడా చిత్ర యూనిట్ పోస్ట్ చేసింది. ఇంకా రచ్చబండ దగ్గర ఒక మహిళ తో మహేష్ సంభాషణ జరిపే సీన్ కూడా పోస్ట్ చేసారు.

కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అద్భుత విజయం సాధించింది. ఏప్రిల్‌ 20న విడుదలైన సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కొట్లకు చేరువలో వసూలు చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మహేష్ ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి పారిస్‌ విహారయాత్రలో ఉన్నారు.

Share

Leave a Comment