ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ భరత్ అనే నేను. ఇప్పటికే విడుదలయిన ఈ చిత్రం అన్ని ఏరియాల్లో సూపర్ హిట్ కలెక్షన్లు కొల్లగొట్టింది. ముఖ్యమంత్రిగా మహేష్ బాబు నటన, కొరటాల మార్క్ మేకింగ్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రం రూ.200కోట్ల గ్రాస్ కలెక్షన్లను అందుకుని ఇంకా స్టడీగానే సాగుతోంది.

మరోవైపు ఈ చిత్రం తమిళనాడులో అతిపెద్ద ప్రభంజనమే సృష్టించిందని చెప్పాలి. మహేష్ గత చిత్రం స్పైడర్ ఏకకాలంలో తెలుగు మరియు తమిళంలో చిత్రీకరించిన విషయం మనకు తెలిసిందే. భరత్ అనే నేను అక్కడ విడుదలయి మంచి టాక్ సంపాదించడంతో ఒక్కసారిగా మహేష్ కు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు భరత్ అనే నేను తమిళంలో ‘భరత్ యనుమ్ నాన్’ పేరుతో రిలీజ్ కానుంది. ఈ చిత్ర ట్రైలర్ ని ఈ శుక్రవారం రిలీజ్ చేసి చిత్రాన్ని ఈ నెల 25 న విడుదల చేయబోతున్నారు నిర్మాతలు.

ఇప్పటికే తమిళనాడులో భరత్ అనే నేను దాదాపు రూ.4.5 కొట్ల వరకు వసూలు చేసిందని, ఇప్పటివరకు తమిళనాడులో విడుదలయిన అన్ని తెలుగు చిత్రాల కలెక్షన్ల కంటే ఇది అధికమని అక్కడి సినీ విశ్లేషకులు చెపుతున్నారు.

మహేష్ బాబు కెరీర్లో తొలి ద్విభాషా చిత్రం ‘స్పైడర్’. మురుగదాస్ లాంటి స్టార్ దర్శకుడితో ఆ చిత్రం చేశాడు సూపర్ స్టార్. మహేష్ తమిళ జనాలకు ఆ చిత్రంతో బాగానే చేరవయ్యాడు. భరత్ అనే నేను చెన్నైలో మాత్రమే 1.70 కోట్లు వసూలు చేసి ‘బాహుబలి 2’ రికార్డుని క్రాస్ చేయడమంటే మాటలు కాదు.

దీన్ని బట్టి చూస్తే మన సూపర్ స్టార్ కి అక్కడి ప్రేక్షకులు ఎంత ఫిదా అయ్యారో అర్ధం అవుతుంది. మే 25 విడుదలతో కూడిన తమిళ ప్రోమోలను టీవీలలో సోమవారం నాటి నుండి విస్తృతంగా ప్రదర్శించనున్నారు.

తెలుగు నాట మహేష్ బాబుకు, ఫ్యాన్స్ కు మంచి అనుభూతులను పంచిన భరత్ అనే నేను తమిళంలో ఎలాంటి ఫలితాన్ని చవిచూస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రిన్స్ కైతే చెన్నైలో భారీ మార్కెట్ ఉందని ‘బాహుబలి 2’ రికార్డులను బద్దలు కొట్టడం ద్వారా ఇప్పటికే స్పష్టమైంది.

మహేష్ బాబు తదుపరి చిత్రం వంశి పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనుంది. ఈ చిత్రం మహేష్ బాబుకు 25 వ చిత్రం. కాగా మహేష్ బాబు 26 వ చిత్రం సుకుమార్ తో చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్, మహెష్, సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రాన్ని 2019 లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ప్రకటించారు.

Share

Leave a Comment