నార్త్ అభిమానులకు గుడ్ న్యూస్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది భరత్ అనే నేను తో ప్రేక్షకుల ముందుకు వచ్చి తిరుగులేని విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ కలెక్షన్లతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా పొందిన విషయం తెలిసిందే. ఇన్ని రోజులకు మళ్ళీ భరత్ అనే నేను సందడి మొదలైంది.

అదేంటి, ఇప్పుడు భరత్ అనే నేను సందడి చేయడం ఏంటి అనుకుంటున్నారా? మనం మాట్లాడుకుంటుంది భరత్ అనే నేను హిందీ వర్షన్ గురించి. సూపర్ స్టార్ మహేష్ కు నార్త్‌లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పటి నుంచో అక్కడి అభిమానులు భరత్ అనే నేను హిందీ వర్షన్ గురించి ఎదురు చూస్తున్నారు.

ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. నార్త్‌ అభిమానుల నిరీక్షణకు తెర దించుతూ ఆర్.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ వాళ్ళు యూట్యూబ్ లో భరత్ అనే నేను హిందీ వర్షన్ విడుదల చేస్తున్నామంటూ ఒక ట్రైలర్ ను పోస్ట్ చేశారు. దానికి టోటల్ ఇండియా వైడ్ అధ్బుతమైన స్పందన లభించింది.

విపరీతంగా లైక్ లు, కమెంట్ల వర్షం కురుస్తుంది. విడుదలైన ఒక రోజులోనే సుమారుగా 1 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుందంటే మాములు విషయం కాదు. ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నామంటే ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. దీని బట్టి భరత్ అనే నేను హిందీ వర్షన్ కోసం నార్త్‌ అభిమానులు ఎలా అదురు చుస్తున్నారొ అర్ధమౌతుంది.

దీని బట్టి మహేష్ కి ఎంత క్రేజ్ ఉందో తెలుస్తుంది. ఇప్పుడే కాదు మహేష్ అంటే టోటల్ ఇండియా వైడ్ గా గుర్తింపు ఉంది. దటీజ్ సూపర్ స్టార్ మహేష్. ఓవర్‌సీస్ లో తిరుగులేని ఫాలోయింగ్ ప్రిన్స్ సొంతం. పొరుగు రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్నాటక, ఒరిస్సాలో తన ఫ్యాన్ బేస్ పటిష్టం చేసుకుంటూ వెళుతున్న సంగతి తెలిసిందే. నార్తిండియాలో మన సినిమాల గురించి మాట్లాడేలా చేసిన హీరో మహేష్.

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు సిల్వర్‌ జూబ్లీ మూవీగా తెరకెక్కుతున్న సినిమా మహర్షి నెక్ట్స్ షెడ్యూల్ అమెరికాలోని న్యూయార్క్‌లో జరుగబోతోంది. 20 రోజులు పాటు అక్కడే షూటింగ్ జరిపి తరువాత హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌ను ప్లాన్‌ చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

Share

Leave a Comment