మహేష్ ‘హోలీ’ పోరాటం!

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘భరత్‌ అనే నేను’(వర్కింగ్‌ టైటిల్‌). కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్‌ ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నారు.

సినిమాలో హోలీ పండుగ సన్నివేశం ఒకటి తెరకెక్కించబోతున్నారట. హోలీ సందర్భంలో జరిగే ఓ పోరాట సన్నివేశం ఆసక్తికరంగా ఉండబోతోందట.

సినిమా మొత్తంలో ఇదే హైలైట్‌ సన్నివేశమని చిత్రవర్గాలు అంటున్నాయి. ఇటీవల ఈ సన్నివేశానికి సంబంధించిన చిత్రీకరణ మొదలుపెట్టినట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం.

మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ పై ఇప్పటికే జనాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘శ్రీమంతుడు’ తర్వాత మహేష్‌ – కొరటాల శివ కలిసి చేస్తున్న చిత్రమిది.

ఈ సినిమా కొర‌టాల మార్క్ యాక్ష‌న్‌, మెసేజ్ ఉన్న చిత్రంగా తెర‌కెక్కుతోంది. మహేష్‌ కనిపించే విధానం, ఆయన నటన ప్రత్యేకంగా ఉండబోతోందని చిత్రబృందం చెబుతోంది.

సినిమా తదుపరి షెడ్యూల్‌ నవంబర్‌ 26 నుంచి పొల్లాచిలో జరగబోతోంది. ప్రస్తుతం మహేశ్‌ ‘థమ్స్‌ప్‌’ యాడ్‌ షూట్‌ కోసం లాస్‌వెగాస్‌ వెళ్లినట్లు సమాచారం.

అక్కడి నుంచి వచ్చాక తిరిగి చిత్రీకరణలో పాల్గొంటారని తెలుస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో మహేష్ బాబు సీయంగా నటిస్తున్నారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతిపక్ష నేతగా పోసాని నటిస్తుండగా, మహేష్ సెక్రటరీగా బ్రహ్మాజీ యాక్ట్‌ చేస్తున్నారన్నది ఫిల్మ్‌నగర్‌ సమాచారం.

ఇందులో మహేశ్‌కి జోడీగా బాలీవుడ్‌ నటి కైరా అడ్వాణీ నటిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 27 న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

– ‘ఈనాడు’

Share

Leave a Comment