ట్రెండీగా నేటి తరానికి తగ్గట్టు స్టైలిష్ గా

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘భరత్ అనే నేను’ లోని మొదటి పాట ఇంట్రో సాంగ్ ‘ఐ డోంట్ నో’ ఫుల్ వీడియో సాంగ్ ను ఈ ఉదయం 10:30 గంటలకు సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల కాగా, నిమిషాల్లోనే వైరల్ అయింది.

పార్టీ మూడ్ లో సాగుతూ జీవితం అంటే ఇంతే నేర్చుకోవడానికి చాలా ఉంటుందని చెప్పేస్తోంది. ‘ఐ డోంట్ నో’ అంటూ సాగే ఈ పాటలో ఎంతో చెప్పారు. జీవితం గురించి సింపుల్ గా వివరించారు. పాట ట్రెండీగా ఉంది. నేటి తరానికి తగ్గట్టుగా ఉంటుంది.

“యూనివర్స్ అనే ఎన్ సైక్లోపీడియాలో తెలుసుకున్న కొద్దీ ఉంటాయి ఎన్నెన్నో… ఆర్ట్ అఫ్ లివింగ్ అంటే ఆర్ట్ అఫ్ లెర్నింగ్ అంతే (జీవించడం అంటే నేర్చుకోవడమే).. నాకు తెలిసింది ఓ కొంత తెలియంది ఇంకెంతో.. ఐ డోంట్ నో”

“ఓన్లీ వన్ థింగ్ ఐ నో.. దేర్ ఈజ్ సొ మచ్ టు నో… (నీకు తెలిసింది ఒక్కటే… తెలుసుకోవాలని వున్నది చాలా ఉంది)” వంటి ఆంగ్ల సాహిత్యంతో ఈతరం పిల్లలకు అర్ధమయ్యే రీతిలో రామజోగయ్య శాస్త్రి పాటను రాశారు. దేవిశ్రీ ప్రసాద్ బాణీలో ఫర్హాన్ అక్తర్ వాయిస్ పాటకు భలే సెట్ అయ్యింది.

ముఖ్యంగా ఈ పాటలో మహేష్ లుక్స్, కాస్ట్యూంస్ మరియు ఎనర్జీ చూసి అభిమానులు చాలా సంతోషపడ్డారు..సూప‌ర్‌స్టార్ స్టైలింగ్ మామూలుగా లేదుగా అని ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేసారు. మహేష్ కూడా మునుపెన్నడూ ధరించనటు వంటి ట్రెండీ కాస్ట్యూంస్ ధరించి ఇంక ఎంతో అందంగా కనిపించాడు.

సంగీతంలో, బాణీలో దేవి మార్క్ కనిపించింది. ప్రేక్షకులు ఈ పాటను విన్న వెంటనే హమ్ చేస్తారని అనడంలో ఎటువంటి సందేహం లేదు. సినిమాలో అద్భుతంగా చిత్రీకరించినందుకు ఇప్పటికే చాలా మంది కొరటాల ఆండ్ టీం ని అభినందించిన విషయం తెలిసిందే.

ఏప్రిల్ 20న విడుద‌లైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల‌లో ఘన విజయం సాధించింది. ఇక మే 25న త‌మిళ‌నాట భ‌ర‌త్ ఎనుము నాన్ పేరుతో విడుద‌ల కానుంది. ఇక కేర‌ళ‌లోను ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

మ‌ల‌యాళంలో డబ్బింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 25న భ‌రత్ ఎన్న అంజాన్‌గా రిలీజ్ కానుంది. ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ తమీన్స్ ఈ చిత్రాన్ని మలయాళంలో విడుదలచేయనుంది. విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం, అక్కడ సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ ఇంకా పెరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Share

Leave a Comment