విశేషంగా ఆకట్టుకుని హైలైట్ గా నిలిచింది

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘భరత్ అనే నేను’ లోని మరో అందమైన పాట ‘అరెరే ఇది కలలా ఉన్నదే’ ఫుల్ వీడియో సాంగ్ ను ఈ రోజు సాయంత్రం సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల కాగా, నిమిషాల్లోనే వైరల్ అయింది.

నటి, గాయని ఆండ్రియా ఈ పాట పాడడం విశేషం. అరెరె ఇది కలలా ఉన్నదే అని హీరోయిన్ పాడుకునే సాంగ్ ఇది. మహేష్ బాబు తనను ప్రేమిస్తున్నాడనే విషయం తెలుసుకున్న తర్వాత హీరోయిన్ తన మనోభావాల్ని పాట రూపంలో ఆలపించిన సందర్భంలో వచ్చే సాంగ్ ఇది.

సంగీతంలో, బాణీలో దేవి మార్క్ కనిపించింది. ప్రేక్షకులు ముఖ్యంగా అమ్మాయిలు ఈ పాటను విన్న వెంటనే హమ్ చేస్తారని అనడంలో ఎటువంటి సందేహం లేదు. సినిమాలో అద్భుతంగా చిత్రీకరించినందుకు ఇప్పటికే చాలా మంది కొరటాల ఆండ్ టీం ని అభినందించిన విషయం తెలిసిందే.

ఈ పాటలో మహేష్ బాబు మీసకట్టుతో కనిపించడం హైలైట్ అయ్యింది. ధియేటర్ లో మొదటిసారి చూసినపుడు అభిమానులకు అచ్చం సూపర్ స్టార్ కృష్ణను చూసినంత అనుభూతికి గురయ్యారు. అలాగే ఈ పాటలో కైరా స్టెప్పులు, అందం యువతను విశేషంగా ఆకట్టుకుంది.

ఆండ్రియా పాడడంతో ఈ పాటకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. నటిగా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న ఆండ్రియా, కేవలం ఈ ట్యూన్ నచ్చి పాడడానికి ఒప్పుకున్నట్టు తెలిపింది. దేవిశ్రీప్రసాద్ ఈ పాటను స్వరపరచగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.

ఏప్రిల్ 20న విడుద‌లైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల‌లో ఘన విజయం సాధించింది. ఇక మే 25న త‌మిళ‌నాట భ‌ర‌త్ ఎనుము నాన్ పేరుతో విడుద‌ల కానుంది. ఇక కేర‌ళ‌లోను ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. మ‌ల‌యాళంలో డబ్బింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 25న భ‌రత్ ఎన్న అంజాన్‌గా రిలీజ్ కానుంది.

దిల్‌రాజు అశ్వనీదత్‌ల కాంబినేషన్‌లో వంశీపైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌ చేస్తున్న ప్రతిష్టాత్మక 25వ చిత్రంలో మహేష్‌ కొత్తగా కనిపించనున్నాడట. ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం టైటిల్‌, చిత్రం ఏ పాయింట్‌తో ఉంటుంది అని అందరూ ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.

Share

Leave a Comment