లాస్ట్ డే షూట్ లో భరత్

సూపర్ స్టార్ మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం భరత్ అనే నేను. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో కైరా అద్వాని కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.

ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్ ను పూర్తిచేసిన సినిమా టీమ్, స్పెయిన్ చేరుకుంది. నాయకా నాయికల మధ్య అక్కడ కొన్ని సన్నివేశాలను ఒకటి రెండు పాటలను కొన్ని రోజులుగా చిత్రీకరిస్తూ వచ్చారు.

స్పెయిన్ లో షూటింగును ఈ సినిమా టీమ్ పూర్తి చేసింది. ఈ సందర్భంగా చిత్ర ఛాయాగ్రాహకుడు తిరు ట్విట్టర్ లో ఒక ఫొటో పోస్ట్ చేశారు.

భరత్ అనే నేను లాస్ట్ డే షూట్ స్పెయిన్ లో…ఎవ్వర్ హ్యాండ్సం మహేష్‌ మరియు రాజు సుందరం మాస్టర్ తో…అని ట్విట్టర్ లో అభిమానులతో ఫొటో షేర్ చేశారు.

భరత్ అనే నేను చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు రెండు పాటలు విడుదలయ్యాయి. ఏప్రిల్‌ 5న సినిమాలోని మరో పాటను విడుదల చేయనున్నట్లు మహేష్‌ ట్వీట్‌ చేశారు. ‘వచ్చాడయ్యో సామి’ అని సాగే ఈ పాటను ఏప్రిల్‌ 5 సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు.

భరత్ అనే నేను ఆడియో వేడుక ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ – ఎల్బీ స్టేడియం లో భారీస్థాయిలో జరగనుంది. ఆడియో వేడుకను భారీ బహిరంగ సభగా చెబుతుండటం విశేషం. మహేష్‌ అభిమానులంతా కూడా ఈ వేడుక కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

విడుదలకు ముందే ఇన్ని సంచలనాలు నమోదుచేస్తున్న భరత్ అనే నేను రేపు ఏప్రిల్‌ 20 న విడుదల తర్వాత ఇంకెన్ని రికార్డులు బద్దలుకొండుతుందో చూడాలి మరి.

Share

Leave a Comment